Live Updates: ఈరోజు (సెప్టెంబర్-03) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు గురువారం, 03 సెప్టెంబర్, 2020: శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, కృష్ణపక్షం-పాడ్యమి (ఉ.10-41వరకు) తదుపరి విదియ, పూర్వాభాద్ర నక్షత్రం (రా.8-20 వరకు) తదుపరి ఉత్తరాభాద్ర అమృత ఘడియలు (ఉ.11-41 నుంచి 1-25 వరకు) వర్జ్యం: లేదు దుర్ముహూర్తం (ఉ.9-56 నుంచి 10-45 వరకు తిరిగి మ. 2-53 నుంచి 3-42 వరకు) రాహుకాలం (మ. 1-30 నుంచి 3-00 వరకు) సూర్యోదయం: ఉ.5-49 సూర్యాస్తమయం: సా.6-11

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 3 Sep 2020 7:12 AM GMT

    Telangana latest news: ప్రగతి భవన్ లో అసెంబ్లీ సమావేశాల పై సీఎం కేసీఆర్ రివ్యూ..

    -ప్రగతి భవన్ లో అసెంబ్లీ సమావేశాల పై సీఎం కేసీఆర్ రివ్యూ..

    -హాజరైన అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి,ప్రభుత్వ విప్..

    -ఎన్ని రోజులు నిర్వహించాలి..ఏ ఏ అంశాల పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి.. ఇప్పటికే 4 బిల్స్ పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది..

    -మొదటగా 20 రోజుల అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి అనుకున్నా..వారం రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వ ఆలోచన...

    -దాదాపు 20 మంది ఎమ్మెల్యే లకు పాజిటివ్ వచ్చిన పరిస్థితి...

    -అసెంబ్లీ భౌతిక దూరం పాటించడానికి సీటింగ్ ఏ విధంగా ఏర్పాటు చేశారు అనే అంశాల పై చర్చ..

    -రేపు అసెంబ్లీ మరో సారి మీటింగ్...పాల్గొన నున్న స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి,విప్ లు,అసెంబ్లీ కార్యదర్శి.

  • 3 Sep 2020 6:42 AM GMT

    Mulugu district updates: వాజేడు మండలం ప్రభుత్వ ఆస్పత్రి నుంచి కరోనా పేషెంట్ పరార్..

    ములుగు జిల్లా .

    -వాజేడు మండలం ప్రభుత్వ ఆస్పత్రి నుంచి కరోనా పేషెంట్ పరార్..

    -వాజేడు మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన మహిళా, రెండు రోజులుగ జ్వరంతో బాధపడుతు వాజేడు హాస్పిటల్ కి వెళ్లగా వైద్యులు జ్వరం పరీక్షలతో   పాటు కరోనా పరీక్షలు చేయగా ఆమెకు పాజిటివ్ అని తేలింది.

    -ఇది తెలుసుకున్న ఆ మహిళ భయంతో హాస్పిటల్ నుండీ పరారై మెయిన్ రోడ్డు వెంబడి నడుచుకుంటూ జంగాలపల్లి చివర్లో ఉన్న జామాయిల్ తోటవద్ద రోడ్డు   పై సుమారు 4గం" కూర్చొగా నాలుగు గంటల తర్వాత అధికారులు స్పందించి అంబులెన్స్లో ఆమెను క్వారంటైన్ కి తరలించారు .

  • 3 Sep 2020 6:39 AM GMT

    Mancherial district updates:ఆర్కే 5 బీ గనిలో ప్రమాద ఘటనపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆరా..

    -ఆర్కే 5 బీ గనిలో ప్రమాద ఘటనపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆరా..

    -కార్మికుడి మృతి పట్ల విచారం వ్యక్తం చేసిన మంత్రి..

    -మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే 5 బీ గనిలో నిన్న జరిగిన ప్రమాద ఘటనపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆరా తీశారు.

    -ఈ సంఘటనపై ప్రాథమిక వివరాలను అడిగి తెలుసుకున్నారు.

    -గనిలో ప్రమాదం బాధాకరమని, క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని సింగరేణి అధికారులను ఆదేశించారు.

    -ఈ ప్రమాదంలో గని కార్మికుడు లింగయ్య మృతి చెందడం పట్ల మంత్రి విచారం వ్యక్తం చేశారు. బాధితుని కుటుంబాన్ని ఆదుకుంటామని మంత్రి   భరోసానిచ్చారు.

  • 3 Sep 2020 6:35 AM GMT

    Warangal updates: చెరువులోకి చేప పిల్లలను వదలిన ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి..

    వరంగల్ రూరల్ జిల్లా.

    -శాయంపేట మండలం కొత్తగట్టు సింగారం గ్రామంలోని చెరువులోకి చేప పిల్లలను వదలిన ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి ,

    -జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్   గండ్ర జ్యోతి.

    -అనంతరం శాయంపేట మండల కేంద్రములో CMRF ద్వారా వచ్చిన రూ:6,21,000/- ల విలువ గల 25 చెక్కులను లబ్ధి దారులకు పంపిణీ చేశారు.

  • 3 Sep 2020 5:35 AM GMT

    Telangana updates: మావోల కదలికలపై పోలీసుల హై అలర్ట్ ..

    -మావోల కదలికలపై పోలీసుల హై అలర్ట్ ..

    -మరో రెండు రోజుల పాటు అసిపాబాద్ లో మకాం వేయనున్న డిజిపి మహేందర్ రెడ్డి..

    -ఎల్లుండి నుండి ములుగులో ‌ రెండు రోజులపాటు..

    -కోత్త గూడేం లో రెండు రోజుల పాటు బస చేస్తారని అంటున్న పోలీసు వర్గాలు..

    -గణపతి లొంగుబాటు పై ద్రువీకరించని పోలీసులు..

  • 3 Sep 2020 5:11 AM GMT

    Telangana updates: Hmtv తో మావోయిస్టు పార్టీ మాజీ కేంద్ర కమిటీ సభ్యుడు జంపన్న...

    -Hmtv తో మావోయిస్టు పార్టీ మాజీ కేంద్ర కమిటీ సభ్యుడు జంపన్న...

    -మావోయిస్టు పార్టీ అగ్రనేత గణపతి మరికొంతమంది లొంగుబాటు అని వార్తలు వస్తున్నాయి..

    -అనారోగ్య సమస్యలతో లొంగిపోతున్నారు అంటున్నారు...

    -అనారోగ్య సమస్యలు ఉంటే మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ చూసుకుంటుంది...

    -గతంలో అనేక మందికి అనారోగ్యం సమస్యలు ఉంటే వాళ్ళు రాలేదు..

    -డిజిపి స్టేట్మెంట్ కూడా వాళ్లు వస్తే మేం సహకరిస్తాం మాత్రమే చెప్పారు...

    -కేంద్ర కమిటీ లో ఎలాంటి ప్రాంతీయ విభేదాలు లేవు...

    -గణపతి పార్టీకి 20 సంవత్సరాల సేవలందించారు కాబట్టి పార్టీకి గణపతి అవసరం....

    -గణపతి కి పార్టీలో ఎలాంటి బాధ్యతలు లేకుండానే సలహాలు మాత్రం తీసుకుంటుంది పార్టీ...

    -గణపతి లొంగుబాటు కేవలం ప్రచారం మాత్రమే...

  • 3 Sep 2020 3:16 AM GMT

    Mahabubabad updates: నేడు జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పర్యటన.

    మహబూబాబాద్ జిల్లా.

    -నేడు జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పర్యటన.

    -బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు యాప సీతయ్య ను పరమర్శించనున్న బండి సంజయ్.

  • 3 Sep 2020 3:14 AM GMT

    Jayashankar Bhupalpally updates: సరస్వతి బ్యారేజ్..2 గేట్లు ఎత్తిన అధికారులు

    జయశంకర్ భూపాలపల్లి జిల్లా..

    -సరస్వతి బ్యారేజ్..

    -2 గేట్లు ఎత్తిన అధికారులు

    -పూర్తి సామర్థ్యం 119.000 మీటర్లు

    -ప్రస్తుత సామర్థ్యం 118.100 మీటర్లు

    -పూర్తి సామర్థ్యం 10.87 టీఎంసీ

    -ప్రస్తుత సామర్థ్యం 8.77 టీఎంసీ

    -ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 9,192 క్యూసెక్కులు

  • 3 Sep 2020 3:09 AM GMT

    Bhadradri Kothagudem updates: భద్రాచలం వద్ద క్రమంగా పెరుగుతున్న గోదావరి నీటి మట్టం.

    భద్రాద్రి కొత్తగూడెం:

    -భద్రాచలం వద్ద క్రమంగా పెరుగుతున్న గోదావరి నీటి మట్టం. 42.3 అడుగులు వద్ద ప్రవహిస్తున్న గోదావరి నీటి మట్టం.

    -ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వస్తున్నందున ఇంకా నీటి మట్టం పెరుగుతుందని తెలుపుతున్న cwc అధికారులు.

    -భద్రాచలంలో నీటి మట్టం 43 అడుగులకు పెరిగితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్న అధికారులు.

  • 3 Sep 2020 3:04 AM GMT

    Bhadradri Kothagudem district: గుండాల మండలం దేవల్లగూడెం అటవీప్రాంతంలో ఎన్ కౌంటర్..

    భద్రాధ్రి కొత్తగూడెం జిల్లా..

    -గుండాల మండలం దేవల్లగూడెం అటవీప్రాంతంలో ఎన్ కౌంటర్

    -ఓమావోయిస్ట్ మృతి

    -కొనసాగుతున్న కాల్పులు

Print Article
Next Story
More Stories