Live Updates: ఈరోజు (03 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 03 అక్టోబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు శనివారం | 03 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | విదియ: తె.05-06 వరకు తదుపరి తదియ | రేవతి ఉ.08-11 వరకు తదుపరి అశ్వని | వర్జ్యం: లేదు | అమృత ఘడియలు: రా.02-49 నుంచి 04-22 వరకు | దుర్ముహూర్తం: ఉ.05-54 నుంచి 07-29 వరకు | రాహుకాలం: ఉ.09-00 నుంచి 10-30 వరకు | సూర్యోదయం: ఉ.5-54 | సూర్యాస్తమయం: సా.5-47
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 3 Oct 2020 10:54 AM IST
విశాఖ...
టీడీపీ నేత సబ్బం హరి ఇంటికి అనుకోని ఉన్న టాయిలెట్ రూమ్ ని కూల్చివేస్తున్న జీవీఎంసీ అధికారులు.
అక్రమ కట్టడాలు అంటున్న అధికారులు..
ముందుగా సమాచారం ఇవ్వకుండా జేసీబీ లతో ఎలా కూల్చివేస్తారని అధికారులు పై మండిపడుతున్న టీడీపీ నేత సబ్బం హరి
- 3 Oct 2020 10:54 AM IST
గుంటూరు..
అమరావతి రాజధాని కోనసాగించాలంటు రైతులు ఆందోళనలు....
291వరోజుకు చేరుకున్న రైతులు నిరసనలు,ధీక్షలు...
- 3 Oct 2020 10:53 AM IST
కడప :
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు బృంధానికి కరోనా ఎఫెక్ట్ ...
కేసులో దర్యాప్తు చేస్తున్న మరో ఆరుగురు సీబీఐ అధికారులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ ...
బృంధంలొ ఒక సీబీఐ అధికారికి గురువారం పాజిటివ్ నిర్దారణ
మిగిలిన అధికారులు పరీక్షలు చేయించుకొవడంతొ మరొ అరుగురికి నిర్దారణ...
తమ బృందంలోని దాదాపు సగం మందికి కరోనా సోకడంతో సీబీఐ అధికారుల్లొ ఆందోళన ...
కేసులో రెండో విడత దర్యాప్తు కోసం గత నెలలో జిల్లాకు చేరుకున్న సుమారు 15 మంది సీబీఐ అధికారులు ...
- 3 Oct 2020 10:53 AM IST
అమరావతి
నేడు పులివెందులకు ఏపీ సీఎం వైఎస్ జగన్
వైఎస్ భారతి తండ్రి ఈసి గంగిరెడ్డి అంత్యక్రియల్లో పాల్గొననున్న సీఎం జగన్
ఉదయం 11 గంటలకు తాడేపల్లి నివాసం నుండి బయలుదేరనున్న సీఎం



