Live Updates: ఈరోజు (03 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు శనివారం | 03 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | విదియ: తె.05-06 వరకు తదుపరి తదియ | రేవతి ఉ.08-11 వరకు తదుపరి అశ్వని | వర్జ్యం: లేదు | అమృత ఘడియలు: రా.02-49 నుంచి 04-22 వరకు | దుర్ముహూర్తం: ఉ.05-54 నుంచి 07-29 వరకు | రాహుకాలం: ఉ.09-00 నుంచి 10-30 వరకు | సూర్యోదయం: ఉ.5-54 | సూర్యాస్తమయం: సా.5-47

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 3 Oct 2020 7:17 AM GMT

    అమరావతి


    ట్విట్టర్లో టీడీపీ అధినేత చంద్రబాబు...


    తెలుగుదేశం నేత సబ్బం హరిగారి ఇంటిని కూల్చేయడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నా. రాత్రివేళ కూల్చాల్సిన అవసరం ఏమొచ్చింది. ఏమిటీ సైకోయిజం..?


    ఒక మాజీ ఎంపీకే ఇలాంటి పరిస్థితి వస్తే సామాన్యులు ఎంత ప్రమాదకర పాలనలో ఉన్నారో అర్థం చేసుకోవాలి.




  • 3 Oct 2020 7:16 AM GMT

    విజయవాడ


    కేన్సర్ అవేర్ నెస్ ప్రోగ్రామ్


    డీసీపీ విక్రాంత్ పాటిల్


    కేన్సర్ అవేర్ నెస్ ప్రోగ్రామ్ లో పోలీసులను భాగస్వాములని చేయడం సంతోషం


    ఇలాంటి మంచి కార్యక్రమాలు సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నా


    కేన్సర్ అవేర్ నెస్ రన్ ఏర్పాటు చేయడం ఆహ్వానించదగినది


  • 3 Oct 2020 5:30 AM GMT

    విశాఖ

    మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ కామెంట్స్

    సబ్బం హరికి సంబందించిన ఇంటి గోడను కూల్చివేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం

    ఉత్తరాంద్ర రాజకీయాల్లో ఎప్పుడూ లేని కల్చర్ ని వైసీపీ నాయకులు తీసుకొస్తున్నారు

    టీడీపీ నేతలపై కక్ష పూరిత చర్యలు ఇకనైనా మానుకోవాలి

    ప్రజల తరుపున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న టీడీపీ నేతలను టార్గెట్ చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు

    ఇది ప్రజాస్వామ్య వ్యతిరేకం

    ప్రతిపక్షం నోరు నొక్కేసే చర్యలు ఇక నైనా మానుకోవాలి.

    ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా అధికారులు నిర్మాణాలు జోలికి ఎలా వస్తారు ?

  • 3 Oct 2020 5:29 AM GMT

    తిరుమల

    పాపవినాశనం డ్యామ్ ను సందర్శించిన కేంద్రమంత్రి గజేంద్ర సింగ్

    భారత దేశంలోనే అత్యంత ప్రత్యేకమైన ప్రదేశం తిరుమల

    రోజుకు వేల సంఖ్యలో శ్రీవారి దర్శనార్థం భక్తులు తిరుమలకు చేరుకుంటారు

    భక్తుల సంఖ్య పెరిగే కొద్దీ నీటి సమస్య పెరుగుతుంది, నీటి ఎద్దడి అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కల్యాణి డ్యామ్ నుంచి పైప్ లైన్ ద్వారా నీటి సరఫరా చేస్తుంది

    నూతనంగా నిర్మిస్తున్న బాలాజీ రిజర్వాయర్ కు సహకారం అందించాలని టీటీడీ ప్రతిపాదించింది

    కేంద్ర ప్రభుత్వంకు లిఖిత పూర్వకంగా వారి అభ్యర్థనను పంపాలని కోరాం

    ఇప్పటికే దేశంలోని ప్రజలందరికీ తాగి నీటిని ఇవ్వాలని ప్రధాని ఇప్పటికే సంకల్పించారు

    అదే స్కీమ్ లో తిరుమలలో నెలకొన్న నీటి సమస్యను చేర్చే విధంగా చర్యలు తీసుకుంటాం

    గజేంద్ర సింగ్ షేకవత్, కేంద్ర మంత్రి

  • 3 Oct 2020 5:28 AM GMT

    తిరుమల

    కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ తో కలసి పాపవినాశనం డ్యామ్ ను పరిశీలించిన రాష్ట్ర ఇరిగేషన్

    మంత్రి అనిల్ కుమార్ యాదవ్

    తిరుమల నీటి ఎద్దడికి సమస్యకు ఎలాంటి చర్యలు చేపట్టారో కేంద్ర మంత్రి పరిశీలించారు

    వేసవిలో నీటి ఎద్దడిని అధిగమించేందుకు శ్రీ బాలాజీ రిజర్వాయర్ల నిర్మాణంకు కొంత భాగం టీటీడీ బరిస్తోంది

    బాలాజీ రిజర్వాయర్ పై పూర్తి నివేదిక కేంద్ర ప్రభుత్వంకు సమర్పిస్తే మా వంతు సహకారం అందిస్తామని సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి

    బాలాజీ రిజర్వాయర్ ప్రాజెక్టుకు ఎంత మొత్తంలో నిధులు అవసరం అవుతాయో వాటి ప్రతిపాదనలు పంపితే కేంద్రం తన వంతు సహాయం చేస్తుందని అన్నారు

    అనిల్ కుమార్ యాదవ్, రాష్ట్ర మంత్రి

  • 3 Oct 2020 5:27 AM GMT

    కడప :

    సీఎం వైఎస్ జగన్ పులివెందుల పర్యటన ఖరారు

    మామ ఈసీ గంగిరెడ్డి అంత్యక్రియల్లో పాల్గొననున్న సీఎం వైఎస్ జగన్..

    మధ్యాహ్నం12.15 గంటలకు కడప విమానాశ్రయం చేరుకోనున్న సీఎం..

    కడప విమానాశ్రయం నుండి ప్రత్యేక చాపర్ లో పులివెందులకు పయనం..

  • 3 Oct 2020 5:27 AM GMT

    కడప :

    ఎగువన కురిసిన వర్షాలతొ గండికోటకు కొనసాగుతున్న వరద ప్రవాహం...

    జిఎన్ఎస్ఎస్ వరద కాలువ ద్వారా 6500, పరివాహక ప్రాంతం నుంచి 7400 క్యూసెక్కుల నీరు రాక...

    గండికోట జలాశయంలొ 16.4 టీఎంసీలకు చేరుకున్న నీటి నిల్వ...

    మైలవరానికి 10300 క్యూసెక్కులు విడుదల ...

    మైలవరం నుంచి 9 గేట్ల ద్వారా 30వేల క్యూసెక్కులకు పైగా నీరు విడుదల

    ఎగువన కురిసిన వర్షాలతొ కుందూ నదికి కొనసాగుతున్న వరద

    అదినిమ్మాయపల్లె అనకట్ట నుంచి పెన్నా నదికి 85 వేల క్యూసెక్కుల నీరు విడుదల

  • 3 Oct 2020 5:26 AM GMT

    తూర్పుగోదావరి

    రసగుల్లలు తిని 12 మంది చిన్నారులకు అస్వస్థత.

    ఇద్దరి పరిస్థితి విషమం

    వి అర్ పురం మండలం పులుసుమామిడిలో నిన్నరాత్రి ఘటన.

    వాగులు దాటుకుంటూ వెళ్లిన డాక్టర్లు.

    రేఖపల్లి ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి తరలింపు

  • 3 Oct 2020 5:26 AM GMT

    విశాఖ

    సబ్బం హరి కామెంట్స్

    జగన్ సర్కారును ప్రశ్నించినందుకే కూల్చివేతకు దిగారు.

    కక్షపూరితంగానే ప్రభుత్వం వ్యవహారిస్తుంది.

    తగిన మూల్యం చెల్లించక తప్పదు

    సబ్బం హరిని ఇబ్బందులు పెడితే అందరు బయపడతారని అనుకుంటున్నారు

    ఉదయం నాలుగు గంటల ప్రాంగణంలో యుద్ధ ప్రాతిపదికన కనీసం నోటిసులు ఇవ్వకుండా ఇంటి ఆవరణంలోనికి ప్రవేశించారు.

    జగన్ నన్ను ఏమీ చేయలేడు

    ఇంతకు ముందు ఎలా ఉన్నానో,ఇప్పుడు అలాగే ఉంటాను.

    నా వైఖరిలో ఎటువంటి మార్పు ఉండదు.

    2009లో జీవిఎంసీ నుండి అనుమతులు ఇచ్చారు.

    ఈ ఆక్రమణ ఇంతవరకు గుర్తు రాలేదా

    నేను నీతి,నిజాయితీ గల వ్యక్తిని,నేను ఏ తప్పు చేయలేదు.

    నేను న్యాయపరంగా ముందుకు వెలతాను.

  • 3 Oct 2020 5:25 AM GMT

    విశాఖ పెందుర్తి...

    విశాఖ శారదా పీఠాన్ని సతీ సమేతంగా దర్శించుకున్న రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి

    ముందుగా ఆలయంలో రాజశ్యామల అమ్మవారిని దర్శించుకుని అనంతరం స్వరూపానంద సరస్వతి స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు


Print Article
Next Story
More Stories