Live Updates: ఈరోజు (03 నవంబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 03 నవంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు మంగళవారం | 03 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | తదియ రా.12-36 తదుపరి చవితి | రోహిణి నక్షత్రం రా.12-55 తదుపరి మృగశిర | వర్జ్యం సా.4-13 నుంచి 5-57 వరకు | అమృత ఘడియలు రా.9-26 నుంచి 11-10 వరకు | దుర్ముహూర్తం ఉ.8-19 నుంచి 9-05 వరకు తిరిగి రా.10-28 నుంచి 11-19 వరకు | రాహుకాలం మ.3-00 నుంచి 4-30 వరకు | సూర్యోదయం: ఉ.06-02 | సూర్యాస్తమయం: సా.05-౨౬
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 3 Nov 2020 2:35 PM GMT
Warangal Urban Updates: కోవిడ్ మరియు సీజనల్ వ్యాధులపై వైద్య అధికారులతో సమీక్ష సమావేశం..
వరంగల్ అర్బన్ జిల్లా
- కోవిడ్ మరియు సీజనల్ వ్యాధులపై వరంగల్ ఉమ్మడి జిల్లా వైద్య అధికారులతో సమీక్ష సమావేశం
- నిర్వహించిన రాష్ట్ర వైద్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస్ రావు
- వచ్చే3 నెలలో కోవిడ్ తీవ్రత ఎక్కువ ప్రభావం
- ఇతర దేశాలలో పెరుగుతున్న కేసులు
- మన దేశంలో గత రెండు నెలల నుంచి తగ్గుతున్న కేసులు
- Dmho లతో మీటింగ్
- రాబోయే రోజుల్లో కేసులు పెరుగుతే ఎలాంటి చర్యలు తీసుకోవాలని చర్చ
- ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము
- ప్రజలు అజాగ్రత్తగా ఉండకూడదు.
- వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో తెలియదు ?
- వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుందో తెలియదు
- కాబట్టి మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి మనకు maltiple వేవ్ ఉంటాయి.
- మాస్క్, శానిటేషన్, భౌతిక దూరం, 60- 65 సం, 10 సం లోపు అందరూ జాగ్రత్తలు తీసుకోవాలి.
- 242506 కేసుల నమోదు
- అక్టీవ్ 17742
- 2800 మంది హాస్పిటల్ చికిత్స
- 3.5 పాజిటివ్ కేసులు
- గత సంవత్సరం కంటే 50శాతం తక్కువ అంటూ వ్యాధులు
- రాష్ట్రంలో 1600 మంది మృతి టార్గెట్ కంటే ఎక్కువ మంది ని టెస్ట్ చేయాలి.
- ఎలాంటి సింతంటాక్ ఫ్లూ వచ్చిన uphc టెస్ట్ చేయించుకోవాలి
- 3 Nov 2020 2:29 PM GMT
Mulugu District Updates: విలేకరుల సమావేశంలో కంటతడి పెట్టిన వాజేడు యంపిపీ శ్యామల శారద..
ములుగు జిల్లా.....
-ప్రజా ప్రతినిధుల పట్ల అధికారులు వివక్ష చూపుతున్నారని యంపిపీ ఆవేదన
-స్వేచ్ఛ లేని ప్రజాప్రతినిధులు
-రైతు వేదిక నిర్మాణంలో నాణ్యతా లోపాలు బయట పెట్టటంతో అధికార పార్టీ యంపీపీ కి బెదిరింపులు.
-పదవి నుంచి తప్పిస్తామని హెచ్చరికలు చేస్తున్నారని ఆమె విలేకరులతో బోరున విలపించారు.
-అధికారులు అధికారిక కార్యక్రమాలు గురించి తనకు ఏవిధమైన సమాచారం ఇవ్వకుండా యంపీడీఓ అవహేలన చేస్తున్నారని ఆమె ఆరోపించారు.
-ఈ విషయాన్ని పార్టీ నాయకుల దృష్టికి తీసుకొని వెళ్లినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
-యంపీడీఓ నిర్లక్ష్య వైఖరిని ములుగు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా చర్యలు తీసుకుంటామని చెప్పారని ఆమె తెలిపారు.
-అధికార పార్టీ కి చెందిన తన పట్ల అధికార పార్టీ నాయకులు, అధికారులు వివక్ష చూపుతున్నారని యంపిపీ శ్యామల శారద తెలిపారు
- 3 Nov 2020 2:27 PM GMT
Mulugu District Updates: పోలీసుల వాహనాల తనిఖీల్లో పట్టుబడ్డ మావోయిస్ట్ కొరియర్లు..
ములుగు జిల్లా...
- ఏటూరునాగారం మండలంలోని ముళ్లకట్ట బ్రిడ్జి వద్ద పోలీసుల వాహనాల తనిఖీల్లో పట్టుబడ్డ ఇద్దరు మావోయిస్ట్ కొరియర్లు.
- వాజేడు మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన బంధం వేణు,టేకులగూడెం గ్రామానికి చెందిన ఆలెం రవి లను అదుపులోకి తీసుకున్న పోలీసులు.
- వారి వద్ద నుండి డిటోనేటర్స్,జెలిటీన్ స్టిక్స్, విప్లవ సాహిత్యాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు
- 3 Nov 2020 2:15 PM GMT
Medchal Updates: రైల్వే స్టేషన్ వద్ద రైలు అగ్నిప్రమాదంపై దక్షిణ మధ్య రైల్వే ప్రకటన...
- మేడ్చల్ రైల్వేస్టేషన్ వద్ద ఆగి ఉన్న ట్రైన్ లో అగ్ని ప్రమాదం జరిగినట్లు స్టేషన్ మాస్టర్ సమాచారం ఇచ్చారు...
- రైలు అగ్ని ప్రమాదానికి కారణం ఇంకా తెలియాల్సి ఉంది..
- ఈ రైలు సెప్టెంబర్ 22 నుండి నవంబర్ 4 వరకు 10 బోగీలు అక్కడే ఉంచబడ్డాయి..
- ఈ 10 కోచ్ లలో ఒక స్లీపర్ కోచ్ కాలిపోయింది..
- డ్యూటీ లో ఉన్న రైల్వే సిబ్బంది మిగిలిన కోచ్ లను వేరు చేయడం తో పాటు,ఎలక్ట్రిక్ సరఫరా దిస్ కనెక్ట్ చేసి మంటలు వ్యాపించకుండా నివారణ చర్యలు తీసుకున్నారు..
- వెంటనే ఫైర్ ఇంజన్ల సహయం తో మంటలను అదుపులోకి తీసుకురావడం జరిగింది..
- 3 Nov 2020 2:04 PM GMT
Bhadradri Kothagudem Updates: ఛత్తీస్‌ఘడ్ లో లొంగిపోయిన పది మంది మావోయిస్టులు...
భద్రాద్రి కొత్తగూడెం..
- లోన్ వరాట్ కార్యక్రమం లో బాగంగా దంతెవాడ జిల్లా ఎస్ పి ముందు లొంగిపోయిన మావోయిస్టులు.
- వీరిలో ఏసిఎం, డి సి ఎం, ఎల్ జి ఎస్ డిప్యూటీ కమాండర్ స్దాయిగల ఐదుగురు కీలక దళ సభ్యులు కాగా వీరి తలపై ఒక్కొక్కరికి రూ. లక్ష నుండి ఐదు లక్షల వరకు రివార్డులు ఉన్నట్లు తెలిపిన దంతెవాడ పోలీసులు.
- 3 Nov 2020 2:00 PM GMT
Hyderabad Updates: ఐపీఎల్ బెట్టింగ్ లకు ఓ యువకుడు బలి...
హైదరాబాద్
- జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన సోను కుమార్ యాదవ్ కొంతకాలంగా ఐపీఎల్ బెట్టింగ్ లో పాల్గొని తీవ్రంగా ఆర్థిక ఇబ్బందులతో బాధ పడుతున్నాడు.
- పంజాగుట్ట ద్వారకపురి కాలనీ లో స్నేహితులతో కలిసి ఉంటూ కొబ్బరి బోండాలు విక్రయించేవారు.
- మంగళవారం ఉదయం మిగిలిన వారు బయటకు వెళ్లగా ఇంట్లోనే ఉండి ఎవరూ లేని సమయంలో గ్రిల్ కు ఉరి బిగించుకొని ఆత్మహత్య పాల్పడ్డాడు.
- అతని సోదరుడు అర్జున్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
- 3 Nov 2020 1:56 PM GMT
Nizamabad Updates: ధరణి పోర్టల్ , రిజిస్ట్రేషన్ పరిశీలన..
నిజామాబాద్ జిల్లా :
- ఇందల్వాయి రెవెన్యూ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ నారాయణరెడ్డి..
- రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి పట్టాదారు పాసు పుస్తకాలను అందజేసిన జిల్లా కలెక్టర్...
- 3 Nov 2020 1:16 PM GMT
Basara Saraswathi Devi Temple Updates: భక్తులు సమర్పించిన కానుకల హుండీల లెక్కింపు...
* నిర్మల్ జిల్లా/బాసర,, శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం....
* ఈ రోజు అమ్మవారి ఆలయంలో భక్తులు సమర్పించిన 119 రోజుల కానుకల హుండీలను లెక్కింపు
* ఆదాయము..
* మిశ్రమ బంగారం:--55 గ్రాములు..
* మిశ్రమ వెండి:--1 కిలో 110 గ్రాములు..
* విదేశీ కరెన్సీ నోట్లు:-- 04
* మొత్తము:- 33,83048 రూపాయలు....
- 3 Nov 2020 12:41 PM GMT
Palvai Rajani Comments: ముఖ్యంగా దళితులపై ఎక్కువ అఘాయిత్యాలు జరుగుతున్నాయి..
పాల్వాయి రజని బీజేపీ మహిళ నేత
-తెలంగాణ అత్యాచారాలకు అడ్డాగా మారుతుంది..
-ఒక మారుమూల ప్రాంతం నుండి చదువుకోవడానికి హైదరాబాద్ వచ్చిన అమ్మాయి పై అఘాయిత్యం చేసి చంపేశారు..
-దాదాపు 2000 మంది మహిళలపై అత్యాచారాలు జరిగాయి మీ చట్టాలు అన్ని ఏమయ్యాయి...?
-మంత్రుల స్థానంలో ఉన్నవారు కూడా మహిళలను వేధిస్తున్నారు..
-చదువుకోవడానికి హైదరాబాద్ వచ్చిన మహిళలకు రక్షణ లేకుండా పోయింది..
-గత 4 రోజులుగా 200 మంది మహిళలు మిస్సయ్యారు..
-ఇంతమంది ఎక్కడికి వెళ్లారు,ఏ ముఠా చేసింది..
-అత్యాచారాలకు సంబంధించిన కేసుల్లో ఎంత వరకు శిక్షలు పడ్డాయి..
-నిందితులను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు..
-బాధితురాలి కుటుంబానికి మేము అండగా ఉంటాము...
-ఉద్యోగాల కోసం తాము ఆత్మహత్య చేసుకుంటాం అనుమతి ఇవ్వాలని మానవ హక్కుల కమిషన్ ను ఒక సోదరి కలసి చెప్పడం బాధాకరం..
-బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఘటనల్లో ముందుడే రాహుల్ గాంధీ తెలంగాణ లో ఇన్ని అత్యాచారాలు జరుగుతున్న రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదు..
- 3 Nov 2020 12:27 PM GMT
Suryapet Updates: హుజూర్ నగర్ పిట్లా నాయక్ తండాలో దారుణం..
బంగారు శ్రుతి బీజేపీ జనరల్ సెక్రటరీ..
-హుజూర్ నగర్ లో పిట్లా నాయక్ తండాలో అమ్మాయిని దారుణంగా చంపేశారు...
-నిందితుడు ఎవరో తల్లిదండ్రులు చెప్పిన ఎందుకు అరెస్ట్ చేయలేదు...?
-కోవిడ్ సమయంలో తెలంగాణ లో వరుసగా దారుణాలు జరుగుతున్న ప్రభుత్వం ఎంత సేపు ఎన్నికల్లో గెలవలెనే ఆలోచిస్తుంది...
-మహిళల పైన అత్యాచారాలు జరిగిన ప్రభుత్వం స్పందించడం లేదు..
-ఇంతమంది బిడ్డలు పోగొట్టుకున్న తల్లుల గురించి కేటీఆర్ ఎందుకు మాట్లాడడం లేదు...
-స్వయంగా హోం మంత్రి ఇలాకా చందర్ ఘాట్ లో జరిగింది హోంమంత్రి ఎక్కడ...?
-దేశంలో మహిళల మీద జరిగిన క్రైమ్ లో తెలంగాణ 4 వస్థానం లో ఉంది..
-రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదు..
-ఏ మహిళ మంత్రి కూడా మహిళలపైన జరుగుతున్న అత్యాచారాల పైన మాట్లాడడం లేదు...
-ఆదివారం ఈ ఘటన జరిగిన నిందితులు ఎవరో తెలిసిన అరెస్టులు చేయడం లేదు...
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire