Live Updates: ఈరోజు (03 నవంబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 03 నవంబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు మంగళవారం | 03 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | తదియ రా.12-36 తదుపరి చవితి | రోహిణి నక్షత్రం రా.12-55 తదుపరి మృగశిర | వర్జ్యం సా.4-13 నుంచి 5-57 వరకు | అమృత ఘడియలు రా.9-26 నుంచి 11-10 వరకు | దుర్ముహూర్తం ఉ.8-19 నుంచి 9-05 వరకు తిరిగి రా.10-28 నుంచి 11-19 వరకు | రాహుకాలం మ.3-00 నుంచి 4-30 వరకు | సూర్యోదయం: ఉ.06-02 | సూర్యాస్తమయం: సా.05-26
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 3 Nov 2020 8:35 AM IST
Visakha Updates: జీవీఎంసీ పారిశుద్ధ్య కార్మికుల నిరసన..
విశాఖ
* గత మూడు నెలలుగా జీవీఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నామని నిరసన
* కుటుంబంతో ఆకలి బాధ పడుతున్నాపట్టించుకోవటం లేనిదని ఆవేదన
* కార్మికులకు తక్షణమే జీతాలు చెల్లించాలని కోరుతూ చినముషీడివాడలో పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన
- 3 Nov 2020 8:33 AM IST
Tirumala Updates: శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం..
తిరుపతి
- ఇవాళ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
- సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు.
- ఉదయం 9.30 గంటల నుండి భక్తులను సర్వదర్శనానికి అనుమతి
- తిరుచానూరులోని శ్రీ పద్మావతి ఈనెల 11 నుండి 19వ తేదీ వరకు వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు





