Top
logo

Live Updates: ఈరోజు (03 నవంబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Live Updates: ఈరోజు (03 నవంబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
X
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 03 నవంబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు పంచాంగం

ఈరోజు మంగళవారం | 03 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | తదియ రా.12-36 తదుపరి చవితి | రోహిణి నక్షత్రం రా.12-55 తదుపరి మృగశిర | వర్జ్యం సా.4-13 నుంచి 5-57 వరకు | అమృత ఘడియలు రా.9-26 నుంచి 11-10 వరకు | దుర్ముహూర్తం ఉ.8-19 నుంచి 9-05 వరకు తిరిగి రా.10-28 నుంచి 11-19 వరకు | రాహుకాలం మ.3-00 నుంచి 4-30 వరకు | సూర్యోదయం: ఉ.06-02 | సూర్యాస్తమయం: సా.05-26

ఈరోజు తాజా వార్తలు

Live Updates

 • Anantapur Updates: నగరంలోని అంబేద్కర్ భవన్ లో సన్మాన సభ...
  3 Nov 2020 1:23 PM GMT

  Anantapur Updates: నగరంలోని అంబేద్కర్ భవన్ లో సన్మాన సభ...

   అనంతపురం:

  * నగరంలోని అంబేద్కర్ భవన్లో బీసీ కులాల కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్ల కు సన్మాన సభ.

  * వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మంత్రి శంకర్ నారాయణ , ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్,   ఎమ్మెల్యే      వెంకట్రాంరెడ్డి తదితరులు.

 • Amaravati Updates: విశాఖ గీతం యూనివర్సిటీ యాజమాన్యానికి చుక్కెదురు..
  3 Nov 2020 12:12 PM GMT

  Amaravati Updates: విశాఖ గీతం యూనివర్సిటీ యాజమాన్యానికి చుక్కెదురు..

  అమరావతి..

  -సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యానికి నిరాకరించిన ధర్మాసనం..

  -గీతం యూనివర్సిటీ అప్పీల్ ను విచారించలేమని స్పష్టం చేసిన హైకోర్టు..

  -ఏం చెప్పాలన్నా సింగిల్ జడ్జి వద్దకే వెళ్ళాలని హైకోర్టు సూచన..

 • Amaravati Updates: టి.డి.పి. సీనియర్ నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్..
  3 Nov 2020 11:58 AM GMT

  Amaravati Updates: టి.డి.పి. సీనియర్ నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్..

  అమరావతి..

  -పాల్గొన్న 175నియోజకవర్గాల ఇన్ ఛార్జ్ లు, టిడిపి ప్రజా ప్రతినిధులు

  -అన్నం పెట్టే రైతన్నలకు సంకెళ్లు వేసిన రాష్ట్రంగా ఏపికి దేశవ్యాప్తంగా చెడ్డపేరు తెచ్చారు...

  -రైతులకు సంకెళ్లు వేయడాన్ని Lనిరసిస్తూ ఆందోళనల ద్వారా వైసిపి రైతాంగ వ్యతిరేక చర్యలను రాష్ట్రవ్యాప్తంగా గర్హించారు.

  -176చోట్ల గృహ నిర్బంధాల ద్వారా, దీనిని విఫలం చేయాలని వైసిపి నాయకులు ప్రయత్నించి భంగపడ్డారు.

  -వరద ప్రాంతాల్లో అడుగుపెట్టని ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి మరో చరిత్ర.

  -గాల్లో తిరిగి చేతులు దులుపుకున్నాడే తప్ప నేలపై అడుగు పెట్టలేదు.

  -రేషన్ సరుకుల పంపిణీకి, ముంపు రోజులకు ముడిపెట్టిన సిఎంగా జగన్మోహన్ రెడ్డి ఇంకో చరిత్ర.

  -రైతులకు సంకెళ్లు వేయడాన్ని నిరసిస్తూ ఆందోళనలు చేసిన జెఏసి నాయకులపై, మహిళలపై దాడిని, అక్రమ కేసులను ఖండిస్తున్నాం.

  -రివర్స్ టెండర్ల పేరుతో పోలవరం పనులు ఆపేశారు.

  -అంచనాల పెంపులో అవినీతి జరిగిందని తప్పుడు ఆరోపణలు చేశారు.

  -వైసిపి చేసిన తప్పులే రాష్ట్రం మెడకు చుట్టుకున్నాయి.

  -టిడిపిపై బురద జల్లడంపై శ్రద్ద, పోలవరం పనుల పూర్తిపై పెట్టడం లేదు.

  -కేంద్రాన్ని ఒప్పించి పనులు త్వరితగతిన పూర్తిచేసే దిశగా చర్యలు లేవు.

  -వైఎస్ హయాంలో పోలవరంపై ఖర్చు చేసింది కేవలం రూ 400కోట్లు మాత్రమే..

  -టిడిపి 5ఏళ్లలో రూ11వేల కోట్లు పోలవరంపై ఖర్చు చేశాం, 71% పనులు పూర్తి చేశాం, నీటిపారుదల ప్రాజెక్టులపై రూ64వేల కోట్లు ఖర్చు చేశాం.

  -రాష్ట్రానికి తీరని నష్టం చేశారు.

 • Chittoor District Updates: ప్రభుత్వ నవోదయా స్కూల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం..
  3 Nov 2020 11:53 AM GMT

  Chittoor District Updates: ప్రభుత్వ నవోదయా స్కూల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం..

  చిత్తూరు జిల్లా ..

  -మదనపల్లి పుంగనూరు రోడ్డులోని ప్రభుత్వ నవోదయా స్కూల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.

  -బండకిందపల్లికి వెల్లే ప్రైవేటు బస్సు బోల్తా.

  -ముగ్గురు అక్కడికక్కడే మృతి, మరో 30 మందికి తీవ్ర గాయాలు‌.

  -గాయపడి వారిని స్థానికి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.

  -కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

 • Chittoor District Updates: ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం చేసిన మహేష్ అరెస్ట్..
  3 Nov 2020 11:50 AM GMT

  Chittoor District Updates: ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం చేసిన మహేష్ అరెస్ట్..

  చిత్తూరు..

  -పెద్ద పంజాణి మండలం రాయలపేటలో నిందితుడు అదుపులోకి తీసుకున్న పోలీసులు.

  -గంగవరం పోలిస్ స్టేషనులో నిందితుడిని మీడియా ముందు హాజరుపర్చిన పోలీసులు.

  -నిందితుడు మహేష్ రిమాండ్ కు తరలింపు.

 • Guntur District Updates: తాడేపల్లి లో గుడ్ షెఫర్డ్ స్వచ్ఛంద సంస్థను సందర్శించిన డీజీపీ..
  3 Nov 2020 11:41 AM GMT

  Guntur District Updates: తాడేపల్లి లో గుడ్ షెఫర్డ్ స్వచ్ఛంద సంస్థను సందర్శించిన డీజీపీ..

   గుంటూరు.. ..

  * 7 సంవత్సరాల బాలిక హిమబిందుకు నూతన వస్త్రాలు,ఆటబొమ్మలు ఇచ్చిన డీజిపి

  * జులై17న పట్టాభిపురం పోలీసులకు దొరికిన చిన్నారి హిమబిందు సంస్థలో ఉన్న 22 మంది చిన్నారులకు పుస్తకాలు,చాక్లెట్లు అందచేసిన డీజీపీ

  * డీజీపీ గౌతమ్ సవాంగ్ కామెంట్స్:

  * చిన్నారి హిమబిందు సంరక్షణ బాధ్యతలు పోలీస్ శాఖ చూసుకుంటుంది

  * ఆపరేషన్ ముష్కాన్ లో భాగంగా ఇప్పటి వరకు 13 వేల మంది చిన్నారులకు వెట్టి చాకిరి నుంచి విముక్తి కల్పించాం

  * మహిళలు, యువతులు, చిన్నారులు సురక్షితంగా నివసించే రాష్ట్రంగా ఏపీని తయారుచేసాం

  * బాలకార్మిక వ్యవస్థను నిర్ములం చేసేందుకు రేపు వెబ్ నార్ నిర్వహిస్తున్నాం......

  * ఇందులో హోంమంత్రి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తో పాటు ఇతర స్వచ్చంద సంస్థలు పాల్గొంటాయి......

 • Krishna District Updates: కృష్ణా నదిలో దిగిన ఇద్దరు వ్యక్తులు గల్లంతు...
  3 Nov 2020 11:35 AM GMT

  Krishna District Updates: కృష్ణా నదిలో దిగిన ఇద్దరు వ్యక్తులు గల్లంతు...

  కృష్ణాజిల్లా...

  - చందర్లపాడు (మం) పొక్కునూరులో కృష్ణా నదిలొ దిగిన ఇద్దరు వ్యక్తులు గల్లంతు

  - గుర్రం విద్యాసాగర్ (18)

  - గుణం మురళి(14)

  - విద్యా సాగర్ మృతదేహం లభ్యం మురళీ కోసం గాలింపు

 • Nellore District Updates: ఎమ్మెల్యే వరప్రసాద్ ఇంటివద్ద ఉద్రిక్తత...
  3 Nov 2020 11:32 AM GMT

  Nellore District Updates: ఎమ్మెల్యే వరప్రసాద్ ఇంటివద్ద ఉద్రిక్తత...

    నెల్లూరు :--

  * గూడూరులో స్థానిక వైకాపా ఎమ్మెల్యే వరప్రసాద్ ఇంటివద్ద ఉద్రిక్తత.

  * ఎమ్మెల్యేపై వైకాపా కార్యకర్తలు అవినీతి ఆరోపణలు..

  * ఎమ్మెల్యేకు, కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం

  * సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు..

 • West Godavari Upadtes: జీలుగుమిల్లిలో అక్రమంగా తరలిస్తున్న ఎరువులను పట్టుకున్న పోలీసులు..
  3 Nov 2020 11:29 AM GMT

  West Godavari Upadtes: జీలుగుమిల్లిలో అక్రమంగా తరలిస్తున్న ఎరువులను పట్టుకున్న పోలీసులు..

   పశ్చిమ గోదావరి జిల్లా

  * జీలుగుమిల్లిలో అక్రమంగా తరలిస్తున్న 79 బస్తాల ఎరువులను పట్టుకున్న పోలీసులు..

  * పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం కామయ్యపాలెం చెక్ పోస్టు వద్ద అక్రమంగా తరలిస్తున్న 79 బస్తాల ఎరువులను పోలీసులు పట్టుకున్నారు.

  * అనంతరం ఆ బస్తాలను వ్యవసాయ అధికారులకు అప్పగించారు.

  * వీటిని జంగారెడ్డిగూడెం నుంచి తెలంగాణ రాష్ట్రానికి అక్రమంగా తరలిస్తున్నట్లు తెలిపారు.

  * స్వాధీనం చేసుకున్న ఎరువులను కామయ్యపాలెం డీసీఎంఎస్ దుకాణంలో భద్ర పరిచామని మండల వ్యవసాయ అధికారి పార్వతి తెలిపారు.

  * ఎరువుల తరలింపులో ఈపాస్ బిల్లులు తప్పనిసరిగా ఉండాలని ఏవో చెప్పారు.

  * రైతుల పేరిట ఎరువులను అక్రమంగా తరలిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు.

 • 3 Nov 2020 7:26 AM GMT

  ప.గో.ఏలూరులో బీసీ కార్పోరేషన్ చైర్మన్ల అభినందన సభలో ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని కామెంట్స్...

  రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బిసి వర్గాల ప్రజలకు ఈ రోజు చరిత్రలో లిఖించే రోజు.

  గత ప్రభుత్వం తెలుగుదేశం హయంలో చంద్రబాబు నాయుడు బిసిలను కేవలం ఓట్ల బ్యాంకుగా మాత్రమే చూశారు

  బీసిలకు మాయ మాటలు చెప్పి వారిని అణగదొక్కారు

  బిసిలకు రాజ్యాధికారం ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు

  రాష్ట్రంలోని వెనుకబడిన బడుగు బలహీన వర్గాలను గుర్తించి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి

Next Story