Live Updates: ఈరోజు (సెప్టెంబర్-02) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 02 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు బుధవారం, 02 సెప్టెంబర్, 2020: శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, శుక్లపక్షం పూర్ణిమ (ఉ. 9-31 వరకు) తదుపరి పాడ్యమి శతభిష నక్షత్రం (సా. 6-25 వరకు) తదుపరి పూర్వాభాద్ర, అమృత ఘడియలు (ఉ. 10-46 నుంచి 12-28 వరకు) వర్జ్యం (రా. 1-19 నుంచి 3-03 వరకు) దుర్ముహూర్తం (ఉ. 11-35 నుంచి 12-25 వరకు) రాహుకాలం (మ. 12-00 నుంచి 1-30 వరకు) సూర్యోదయం: ఉ.5-49 సూర్యాస్తమయం: సా.6-12
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 2 Sept 2020 9:15 AM IST
Warangal Rural Updates: అభిమాన హీరో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు..అభిమానుల కుటుంబాలలో విషాదం..
వరంగల్ రూరల్ జిల్లా..
-అభిమాన హీరో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు అభిమానుల కుటుంబాలలో విషాదం..
-పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా ఐదుగురు యువకులు రాత్రి జన్మదిన వేడుకల కోసం ప్రయాణం.
-పోచమ్మ మైదానం చెందిన ప్రవీణ్ ,రాకేష్, పవన్ వీరితో పాటు నైమ్ నగర్ కు చెందిన రోహిత్ .ఆటో నగర్ కు చెందిన రహీమ్ లు గా పోలీసులు గుర్తింపు.
-దామెర మండలం పసరగొండ క్రాస్ రోడ్ వద్ద తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం.
-నిద్రమత్తులోఎదురెదురుగా కారును ఢీకొట్టిన లారీ, నుజ్జునుజ్జుయైన కారు.
-కారులో ఉన్న ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి.
-మృతదేహాలను ఎంజీఎం మార్చరీకి తరలింపు..



