Live Updates: ఈరోజు (02 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు శుక్రవారం | 02 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | పాడ్యమి: రా.03-02 వరకు తదుపరి విదియ | రేవతి నక్షత్రంపూర్తిగా | వర్జ్యం: సా.06-55 నుంచి రా.08-41వరకు | అమృత ఘడియలు: తె.05-32నుంచి 06-36 వరకు | దుర్ముహూర్తం: ఉ.08-15 నుంచి 09-02 వరకు తిరిగి మ. 12-09 నుంచి 12.56 వరకు | రాహుకాలం: ఉ.10-30 నుంచి 12-00 వరకు | సూర్యోదయం: ఉ.5-54 | సూర్యాస్తమయం: సా.5-47

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • Amaravati updates: గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడు మహాత్మా గాంధీ...
    2 Oct 2020 2:52 AM GMT

    Amaravati updates: గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడు మహాత్మా గాంధీ...

    అమరావతి....

    -డిప్యూటీ సీఎం అంజాద్ భాషా..

    -ఒక సాధారణ కుటుంబంలో పుట్టి, భారతీయులందరిచే ఆదరింపబడే ఒక గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడు మహాత్మా గాంధీ.

    -సత్యము, అహింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహము ఆయన ఆయుధాలు.

    -అటువంటి మహనీయుని జయంతి ఈరోజు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికి గాంధీ జయంతి శుభాకాంక్షలు.

  • Kadapa district updates: సీఎంఆర్ఎఫ్‌ నకిలీ చెక్కుల కేసును సీఐడీకి అప్పగించిన పొలీసులు...
    2 Oct 2020 2:36 AM GMT

    Kadapa district updates: సీఎంఆర్ఎఫ్‌ నకిలీ చెక్కుల కేసును సీఐడీకి అప్పగించిన పొలీసులు...

    కడప :

    -ప్రొద్దుటూరులో వెలుగుచూసిన సీఎంఆర్ఎఫ్‌ నకిలీ చెక్కుల కేసును సీఐడీకి అప్పగించిన పొలీసులు...

    -నకిలీ చెక్కులు సమర్పించి ఎస్‌బీఐకి చెందిన మూడు శాఖల్లో మొత్తం రూ.9.95 లక్షలు నగదు ఉపసంహరించిన ముగ్గురు వ్యక్తులు...

    -బ్యాంకు మేనేజర్ల ఫిర్యాదుతో గత నెల 23వ తేదీన నమోదైన కేసులు...

    -ఈ కేసులో ప్రధాన నిందితుడు భాస్కర్‌రెడ్డి గత నెల 24నే పోలీసుల ఎదుట లొంగుబాటు...

    -తమిళనాడు రాష్ట్రం హోసూరుకు చెందిన భాస్కర్‌రెడ్డి స్నేహితుడితో పాటు మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం...

    -ఈ వ్యవహారంలో ఏడుగురిని సీఐడీ అధికారుల ఎదుట హాజరుపరిచిన పోలీసులు...

  • Kadapa updates: ఆబ్కారీ సీఐ శ్రీనివాసమూర్తిని సస్పెండ్‌ చేసినట్లు జిల్లా ఆబ్కారీ అధికారులు...
    2 Oct 2020 2:33 AM GMT

    Kadapa updates: ఆబ్కారీ సీఐ శ్రీనివాసమూర్తిని సస్పెండ్‌ చేసినట్లు జిల్లా ఆబ్కారీ అధికారులు...

    కడప :

    -ఎర్రగుంట్ల ఆబ్కారీ సీఐ శ్రీనివాసమూర్తిని సస్పెండ్‌ చేసినట్లు జిల్లా ఆబ్కారీ అధికారులు...

    -ఓ బెల్టు షాపుకు సంబంధించి అవకతవకలకు పాల్పడినట్లు ఫిర్యాదులు...

    -విచారించి నివేదికను ఆబ్కారీ కమిషనర్‌కు పంపించిన జిల్లా అధికారులు...

    -కమిషనర్‌ ఆదేశాల మేరకు సస్పెన్షన్‌ చేస్తూ ఉత్తర్వులను జారీ...

  • Srisailam project updates: శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద..
    2 Oct 2020 2:28 AM GMT

    Srisailam project updates: శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద..

    కర్నూలు జిల్లా....

    -9 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేత

    -ఇన్ ఫ్లో : 1,61,365 క్యూసెక్కులు

    -ఔట్ ఫ్లో : 2,89,180 క్యూసెక్కులు

    -పూర్తి స్థాయి నీటి మట్టం: 885 అడుగులు

    -ప్రస్తుతం : 884.30 అడుగులు

    -పూర్తిస్దాయి నీటి నిల్వ : 215.8070 టిఎంసీలు

    -ప్రస్తుతం: 211.4759 టీఎంసీలు

    -కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

  • Kurnool district updates: వైఎస్ జగన్ శ్రీశైలంలో గిరిజనులకు పట్టాల   పంపిణీ...
    2 Oct 2020 2:24 AM GMT

    Kurnool district updates: వైఎస్ జగన్ శ్రీశైలంలో గిరిజనులకు పట్టాల పంపిణీ...

    కర్నూలు జిల్లా...

    -గాంధీ జయంతి సందర్భంగా నేడు శ్రీశైలం ఐటీడీఏ పరిధిలో చెంచు గిరిజనులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వైఎస్ జగన్ శ్రీశైలంలో గిరిజనులకు పట్టాల   పంపిణీ

    -శ్రీశైలం ఐటిడిఎ గిరిజనుల పట్టాల పంపిణీ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొననున్న కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండియన్ శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా   చక్రపాణి రెడ్డి

    -శ్రీశైలం ఐటీడీఏ పరిధిలో కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాలలో 1315 మంది లబ్ధిదారులకు సుమారు 2400 ఎకరాల భూముల పట్టాలు పంపిణీ చేయనున్న   అధికారులు

  • Amaravati updates: ఎన్నో పోరాటాలకు ఊపిరిపోశాయి గాంధీజీ సిద్ధాంతాలు: నారా లోకేష్...
    2 Oct 2020 2:07 AM GMT

    Amaravati updates: ఎన్నో పోరాటాలకు ఊపిరిపోశాయి గాంధీజీ సిద్ధాంతాలు: నారా లోకేష్...

    అమరావతి..

    -టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్...

    -ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, సామాజిక, ఆధ్యాత్మికవేత్తల్లో ప్రేరణ కలిగించి...

    -వివక్ష, నిరంకుశత్వాలపై జరుగుతున్న ఎన్నో పోరాటాలకు ఊపిరిపోశాయి గాంధీజీ సిద్ధాంతాలు.

    -గాంధీ జయంతివేళ రైతు సౌభాగ్యం, సమాజ సమానత్వం సాధించేందుకు ఆ మహాత్ముడు సూచించిన మార్గంలో నడుద్దాం.

Print Article
Next Story
More Stories