Live Updates: ఈరోజు (02 నవంబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు సోమవారం | 02 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | విదియ రా.11-01 తదుపరి తదియ | కృత్తిక నక్షత్రం రా.10-50 తదుపరి రోహిణి | వర్జ్యం ఉ.9-38 నుంచి 11-24 వరకు | అమృత ఘడియలు రా.8-11 నుంచి 9-56 వరకు | దుర్ముహూర్తం మ.12-06 నుంచి 12-52 వరకు తిరిగి మ.2-23 నుంచి 3-09 వరకు | రాహుకాలం ఉ.7-30 నుంచి 9-00 వరకు | సూర్యోదయం: ఉ.06-02 | సూర్యాస్తమయం: సా.05-26

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 2 Nov 2020 9:39 AM GMT

    విజయవాడ....

    మంత్రి కొడాలి నాని

    బీసీ కార్పొరేషన్ ల ఏర్పాటుతో దేశానికే సీఎం వైఎస్ జగన్ ఆదర్శంగా నిలిచారు

    బీసీల కు అండగా నిలిచిన ఎన్టీఆర్ ని చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడు

    పార్టీ ని లాక్కొని బీసీ లను ఓటుబ్యాంకుగా మార్చేశారు

    బీసీ లకు ఎన్టీఆర్ లేని లోటును వైఎస్ రాజశేఖర రెడ్డి తీర్చారు

    ఐదేళ్లపాలనలో అందరి హృదయాల్లో చెరగని ముద్రలా నిలిచారు

    తండ్రి లేని లోటుని తనయుడు వైఎస్ జగన్ తీరుస్తున్నాడు

    బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు

    బీసీ విద్యార్థుల విద్యోన్నతికి వైఎస్ జగన్ బాటలు వేస్తున్నారు

    చైర్మన్లు ,డైరెక్టర్లు చిత్తశుద్ధితో పనిచేసి పదవులకు న్యాయం చేయాలి

    మరో ముప్పై ఏళ్ళు వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారు

  • 2 Nov 2020 9:39 AM GMT

    విజయవాడ...

    వైసీపీ ఎంపీ మోపిదేవి.......

    బీసీ సంక్షేమం, అభివృద్ధి కి సీఎం జగన్ పెద్దపీట వేశారు..

    ఇప్పుడు అవకాశం రానివారికి బావిష్యత్తులో వస్తాయి..

    పదవులు వచ్చిన వారు విజిటింగ్ కార్డ్ కే పరిమితం కాకుండా బీసీల అభివృద్ధికి కృషి చెయ్యాలి..

    అన్ని విధాలుగా వారిని చైతన్య పరిచేలా ఉండాలి..

    క్షేత్ర స్థాయిలో వారి సమస్యలను పరిష్కరించాలి..

  • Rajahmundry Updates: గోకవరం మం. తంటికొండ లో విషాదం...
    2 Nov 2020 5:49 AM GMT

    Rajahmundry Updates: గోకవరం మం. తంటికొండ లో విషాదం...

      తూర్పుగోదావరి -రాజమండ్రి

    -- గోకవరం మం. తంటికొండ ఘాట్‌రోడ్డుపై పెళ్ళీబృందం మినీ వ్యాన్‌ బోల్తా ప్రమాదంలో మరొక మహిళ మృతి

    -- ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య

    -- గాదరాడ గ్రామానికి చెందిన పెళ్ళి కుమారుడి సోదరి చాగంటి సుజాత(34) రాజమండ్రి- లో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి

    -- సుజాత కుమార్తె యామినీ శ్రీలత(13) ప్రమాద ఘటన స్థలంలోనే మృతి

    -- తల్లీకుమార్తెలు మృతితో గాదరాడలో విషాద ఛాయలు

    -- పెళ్ళికొడుకు ఇద్దరు సోదరిలు, మేనకోడళ్ళు మృత్యువాత పడడం పెళ్ళింట తీవ్ర విషాదాన్ని నింపింది

  • Guntur District Updates: ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నారు...
    2 Nov 2020 5:46 AM GMT

    Guntur District Updates: ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నారు...

     గుంటూరు ః....

    - జనసేన నేత పోతిన మహేష్ కామెంట్స్.

    - పరిపాలన చేస్తోంది పోలీసులా, జగనా....

    - భూములిచ్చిన నేరానికి రైతుల్ని అరెస్టు చేస్తున్నారా..

    - దళితుల పైనా అట్రాసిటీ కేసు పెట్టడం చరిత్ర లేదు.

    - మూడు రాజధానుల ప్రతిపాదన ఉపసంహరించుకోవాలి.

    - షర్మిల, విజయమ్మ మహిళా రైతు‌లకు సంఘీభావం తెలియజేయాలని డిమాండ్ చేస్తున్నాం.

  • Visakha Updates: వరలక్ష్మి కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన హోంమంత్రి...
    2 Nov 2020 5:43 AM GMT

    Visakha Updates: వరలక్ష్మి కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన హోంమంత్రి...

    విశాఖ

    - గాజువాక శ్రీనగర్ లో వరలక్ష్మి ఇంటికి చేరుకున్న హోంమంత్రి సుచరిత.

    - కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన హోంమంత్రి.

    - దాడి జరిగిన సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్న హోంమంత్రి సుచరిత

  • Srikakulam Updates: జిల్లా కేంద్రంలో ఎర్రన్నాయుడు వర్ధంతి నివాళులు..
    2 Nov 2020 5:35 AM GMT

    Srikakulam Updates: జిల్లా కేంద్రంలో ఎర్రన్నాయుడు వర్ధంతి నివాళులు..

    శ్రీకాకుళం జిల్లా..

    జిల్లా కేంద్రంలో కేంద్ర మాజీమంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు 8వ వర్ధంతి..

    ఏడు రోడ్ల కూడలి వద్ద ఎర్రన్నాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవి..

  • CBI Court Updates: ఏపీ సీఎం జగన్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసుపై నేడు సీబీఐ కోర్టు విచారణ..
    2 Nov 2020 4:47 AM GMT

    CBI Court Updates: ఏపీ సీఎం జగన్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసుపై నేడు సీబీఐ కోర్టు విచారణ..

     సీబీఐ కోర్టు....

    - జగన్ కేసులో వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని కోరిన రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి...

    - జగతి పబ్లికేషన్స్ కేసులో డిశ్చార్జ్ పిటిషన్లపై నేడు మరోసారి విచారించనున్న సీబీఐ కోర్టు..

    - రెండు పిటీషన్ లపై విచారణ చేపట్టనున్న సీబీఐ కోర్టు.

  • Guntur Updates: మంగళగిరిలో కొడుకు పై కన్న తండ్రి పోలీసులకు ఫిర్యాదు!
    2 Nov 2020 4:36 AM GMT

    Guntur Updates: మంగళగిరిలో కొడుకు పై కన్న తండ్రి పోలీసులకు ఫిర్యాదు!

    గుంటూరు....

    -మంగళగిరిలో కొడుకు గంజాయికి బానిసై తమను చిత్రహింసలు పెడుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన కన్న తండ్రి.

    -100 నంబర్ కు ఫిర్యాదు చేసిన తండ్రి.

    -తండ్రి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.

    -కొడుకును అదుపులోకి తీసుకున్న పోలీసులు.

    -పోలీసు కస్టడీలో కొడుకు తో పాటు మరో ఇద్దరు యువకులు..

    -గంజాయి విక్రయాలపై ఆరా...

  • Visakha Updates: వరలక్ష్మి కేసు....అఖిల్ సాయి జైలుకు....
    2 Nov 2020 4:25 AM GMT

    Visakha Updates: వరలక్ష్మి కేసు....అఖిల్ సాయి జైలుకు....

    విశాఖ..

    -వరలక్ష్మి హత్య కేసు

    -నిందితుడు అఖిల్ సాయి ను మేజిస్ట్రేట్ ముందు హజరు పరిచిన పోలీసులు

    -ఈ నెల 12 వరకు రిమాండ్

    -సెంటర్ జైలు కు తరలింపు

  • Amaravati Updates: రాజధాని గురించి హైకోర్టులో నేటి నుంచి తుది విచారణ ప్రారంభం..
    2 Nov 2020 3:58 AM GMT

    Amaravati Updates: రాజధాని గురించి హైకోర్టులో నేటి నుంచి తుది విచారణ ప్రారంభం..

    అమరావతి (హైకోర్టు)..

    - రాజధానికి సంబంధించిన అంశాల గురించి దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో నేటి నుంచి తుది విచారణ ప్రారంభం

    - త్రిసభ్య ధర్మాసనం వ్యాజ్యాలన్నింటిపై రోజువారీ విచారణ.

    - అంశాల వారీగా పిటిషన్లను విభజించి విచారిస్తామని గత విచారణలో పేర్కొన్న ధర్మాసనం .

    - ఈరోజు ప్రధాన వ్యాజ్యాలతో పాటు కొన్ని అనుబంధ పిటిషన్లపైనా జరగనున్న విచారణ

    - విచారణను హైబ్రిడ్ పద్ధతిలో కొనసాగించనున్న హై కోర్టు.

    - రెండు వారాలపాటు రోజువారీ విచారణ జరిపే అవకాశo.

    - అనుబంధ పిటిషన్లలో అత్యధిక శాతం ఇప్పటికే విచారణ పూర్తి.

Print Article
Next Story
More Stories