Live Updates: ఈరోజు (సెప్టెంబర్-02) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు బుధవారం, 02 సెప్టెంబర్, 2020: శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, శుక్లపక్షం పూర్ణిమ (ఉ. 9-31 వరకు) తదుపరి పాడ్యమి శతభిష నక్షత్రం (సా. 6-25 వరకు) తదుపరి పూర్వాభాద్ర, అమృత ఘడియలు (ఉ. 10-46 నుంచి 12-28 వరకు) వర్జ్యం (రా. 1-19 నుంచి 3-03 వరకు) దుర్ముహూర్తం (ఉ. 11-35 నుంచి 12-25 వరకు) రాహుకాలం (మ. 12-00 నుంచి 1-30 వరకు) సూర్యోదయం: ఉ.5-49 సూర్యాస్తమయం: సా.6-12

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • Guntur updates: జనసేన అధినేత పవన్ కళ్యాణ జన్మదినం సందర్భంగా జిజిహెచ్ కు 14 ఆక్సిజన్ సిలిండర్ లు అందజేత...
    2 Sep 2020 6:41 AM GMT

    Guntur updates: జనసేన అధినేత పవన్ కళ్యాణ జన్మదినం సందర్భంగా జిజిహెచ్ కు 14 ఆక్సిజన్ సిలిండర్ లు అందజేత...

    గుంటూరు....

    -జనసేన అధినేత పవన్ కళ్యాణ జన్మదినం సందర్భంగా జిజిహెచ్ కు 14 ఆక్సిజన్ సిలిండర్ లు అందజేత.

    -సూపరింటెండెంట్ సుధాకర్ కు సిలిండర్ లు అందజేసిన జనసేన నేత తులసి ధర్మచరణ్, బిజేపి నేత డాక్టర్ శనక్కాయల ఉమా శంకర్

  • YSR Vardhanthi in Nellore: జిల్లావ్యాప్తంగా వైయస్ వర్ధంతి కార్యక్రమాలు..
    2 Sep 2020 6:33 AM GMT

    YSR Vardhanthi in Nellore: జిల్లావ్యాప్తంగా వైయస్ వర్ధంతి కార్యక్రమాలు..

    నెల్లూరు స్క్రోలింగ్:--

    -- జిల్లావ్యాప్తంగా వైయస్ వర్ధంతి కార్యక్రమాలు.

    -- గ్రామ గ్రామాన వైఎస్ విగ్రహాలకు నివాళులర్పిస్తున్న వైసీపీ శ్రేణులు.

    -- జిల్లా కేంద్రంలో లో వైయస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించిన ఏపీ ఇరిగేషన్ మంత్రి డాక్టర్ పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్.

    -- ప్రజాస్వామ్య వ్యవస్థలో నవ శకానికి నాంది పలికిన నాయకుడు దివంగత నేత డాక్టర్ వైయస్.

    --ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో సాగు, తాగునీటి రంగాల అభివృద్ధికి బీజాలు వేసిన దార్శినికుడు డాక్టర్ వైయస్.

    -- డాక్టర్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు మంత్రి పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్

    -- తండ్రి ఆశయాలే లక్ష్యంగా, రాష్ట్ర అభవృద్ధి కి కృషి చేస్తున్న నాయకుడు ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి.

    -- వై ఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిం చిన మంత్రి అనీల్, ఎన్ డి డి సి బీ చైర్మన్ ఆనం విజయకుమార్ రెడ్డి.

  • 2 Sep 2020 6:25 AM GMT

    Rajahmundry-Amalapuram updates: పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా రోడ్డు మరమ్మతులు చేపట్టేందుకు సిద్ధమైన జనసైనికులు..

    తూర్పు గోదావరి జిల్లా- రాజమండ్రి- అమలాపురం..

    -పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా పాడైన ఈదర పల్లి నుంచి ఇందుపల్లి ఆర్ అండ్ బి రోడ్డు రెండు కిలోమీటర్లు రోడ్డు మరమ్మతులు చేపట్టేందుకు     సిద్ధమైన జనసైనికులు

    -అనుమతి లేకుండా రోడ్డు నిర్మాణం చేపట్టరాదంటూ అడ్డుకున్న పోలీసులు

    -ఆర్ అండ్ బి, సబ్ కలెక్టర్ నుంచి అనుమతి తెచ్చుకోవాలని జనసైనికులకు సూచించిన పోలీసులు

    -ఈదర పల్లి, ఇందుపల్లి బ్రిడ్జిల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలు నిలిపివేసిన పోలీసులు

    -రోడ్డు రిపేర్లు చేపట్టేందుకు సిద్ధమవుతున్న ఆర్అండ్ బీ అధికారులు

    -ఈదరపల్లి బ్రిడ్జి వద్ద ఉద్రిక్తత ..

  • YSR Vardhanthi in Vizag:  వైస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళ్ళు అర్పించిన రాజ్యసభ సభ్యులు..
    2 Sep 2020 6:16 AM GMT

    YSR Vardhanthi in Vizag: వైస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళ్ళు అర్పించిన రాజ్యసభ సభ్యులు..

    విశాఖ:

    -వైస్సార్ 11 వ వర్ధంతి సందర్భాగా బీచ్ రోడ్డులోని వైస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళ్ళు అర్పించిన రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి   శ్రీనివాస్, వైసీపీ పార్టీ నాయకులు.

    -పేద మహిళలకు బియ్యం,చీరలు ఎంపిణీ చేసిన విజయసాయిరెడ్డి.

  • Atchannaidu inTirumala: తిరుమలేశుణ్ణి దర్శించుకున్న అచ్చెన్నాయుడు..
    2 Sep 2020 5:59 AM GMT

    Atchannaidu inTirumala: తిరుమలేశుణ్ణి దర్శించుకున్న అచ్చెన్నాయుడు..

    -తిరుమలేశుణ్ణి దర్శించుకున్న అచ్చెన్నాయుడు

    -ఈ సందర్భంగా శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్నారు.

    -ఈఎస్ఐ స్కామ్ కేసులో అరెస్టైన అచ్చెన్నాయడుకి ఇటీవలె బెయిల్‌ లభించింది.

    -అయితే అచ్చెన్నకు కరోనా పాజిటివ్ రావడంతో ఆయన ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో చికిత్స పొందారు.

    -ఇటీవలె ఆయన కరోనా బారి నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

    -ఇలా చాలా రోజుల తరువాత బయటకు వచ్చిన అచ్చెన్న.. నేడు కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు.

  • 2 Sep 2020 5:42 AM GMT

    YSR vardhanthi in Rayachoti: వైఎస్ఆర్ చిత్రపటానికి నివాళులర్పించిన ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ జకీయా ఖానం.

    కడప :

    -రాయచోటిలో వైఎస్ఆర్ సిపి కార్యాలయంలో వైఎస్ఆర్ చిత్రపటానికి, విగ్రహానికి, వైఎస్ఆర్ సర్కిల్ లోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ జకీయా ఖానం.

    -పాల్గొన్న మాజీ కౌన్సిలర్లు, కార్యకర్తలు, ఆభిమానులు, పార్టీ శ్రేణులు.

  • 2 Sep 2020 5:40 AM GMT

    Bommana Raj Kumar Death: బొమ్మన రాజ్ కుమార్ పార్ధివదేహానికి నివాళులర్పించిన రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్

    తూర్పుగోదావరి:

    -ప్రముఖ వస్త్ర వ్యాపారవేత్త, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ది.జాంపేట కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ బొమ్మన రాజ్ కుమార్ పార్ధివదేహానికి     నివాళులర్పించిన రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్,

    -రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఎంపీ మార్గాన్ని భరత్ రామ్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు

  • Visakhapatnam updates: రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి కామెంట్స్..
    2 Sep 2020 5:16 AM GMT

    Visakhapatnam updates: రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి కామెంట్స్..

    విశాఖ..

    -రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి కామెంట్స్

    -దివంగత నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి మన నుంచి దూరమైన ప్రజలు గుండెలలో చిరస్థాయిగా నిలిచిపోయారు.

    -విశాఖను అభివృద్ధి చేసిన వ్యక్తి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి.

    -కరోనా కష్ట కాలంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి అభినందనలు.

    -రానున్న జీవీఎంసీ ఎన్నికలలో వైసీపీ జెండా ఎగురవేయాలి.

    -ఎన్నికలు ముందు ప్రతి వార్డు లో పర్యటించి వారి సమస్యలు తెలుసుకుంటాను.

    -మంత్రి అవంతి శ్రీనివాస్ కామెంట్స్

    -తండ్రి బాటలో తనయుడు జగన్మోహన్ రెడ్డి నడుస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు.

    -చంద్రబాబు నాయుడు ఎన్ని కుటిల రాజకీయాలు చేసిన జగన్మోహన్ రెడ్డిని ఆపలేరు.

    -రాజశేఖర్ రెడ్డి మన నుంచి భౌతికంగా దూరం అయిన రాష్ట్ర ప్రజలు గుండెలలో ఉన్నారు.

  • 2 Sep 2020 5:11 AM GMT

    Ysr Vardhanthi in Kurnool: వైఎస్సార్ వర్ధంతి సందర్బంగా రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాలర్పించిన వైసీపీ నేతలు..

    కర్నూలు:

    -వైఎస్సార్ వర్ధంతి సందర్బంగా రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాలర్పించిన వైసీపీ నేతలు..

    -వైఎస్ రాజశేఖర్ రెడ్డికి భారతరత్న ఇవ్వాలని కర్నూలు పార్లమెంట్ ఇంచార్జి బి.వై రమయ్యా..

  • YSRs Vardhanti: వైయస్సార్ ఘాట్ వద్దకు చేరుకున్న వైఎస్సార్సీపీ ప్రముఖులు..
    2 Sep 2020 4:49 AM GMT

    YSR's Vardhanti: వైయస్సార్ ఘాట్ వద్దకు చేరుకున్న వైఎస్సార్సీపీ ప్రముఖులు..

    కడప : 

    -వైయస్సార్ ఘాట్ వద్దకు చేరుకున్న డిప్యూటి సిఎం ఎస్ బి అంజద్ భాష,

    -బీసీ సంక్షేమ శాఖ మాత్యులు సి. శ్రీనివాస వేణు గోపాల కృష్ణ, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి,

    -విప్ కొరముట్ల శ్రీనివాసులు, టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి,

    -ఎంఎల్సీలు వెన్నుపూస గోపాల్ రెడ్డి, జకియా ఖానం, ఎమ్మెల్యే రవీంద్రనాథ రెడ్డి

Print Article
Next Story
More Stories