Live Updates: ఈరోజు (01 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 01 అక్టోబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు గురువారం | 01 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | పౌర్ణిమ: రా.01-05 వరకు తదుపరి | ఉత్తరాభాద్ర నక్షత్రం తె.05-39వరకు తదుపరి | వర్జ్యం: మ.01-56 నుంచి 03-41వరకు | అమృత ఘడియలు: రా.12-24నుంచి 02-46 వరకు | దుర్ముహూర్తం: ఉ.09-48 నుంచి 10-35 వరకు తిరిగి మ. 02-28 నుంచి 03.15 వరకు | రాహుకాలం: మ.01-30 నుంచి 03-00 వరకు | సూర్యోదయం: ఉ.5-54 | సూర్యాస్తమయం: సా.5-47
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 1 Oct 2020 5:33 PM IST
Bhadradri Kothagudem district updates: రెవిన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం: వనమా వెంకటేశ్వరరావు!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:
కొత్తగూడెం....
-రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన రెవిన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ
-సుజాతనగర్ మండలం నాయకులగూడెం గ్రామంలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం
-కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు....
-నాయకులగూడెం గ్రామం నుండి కొత్తగూడెం వరకు ఐదు వందల ట్రాక్టర్లతో భారీ ర్యాలీ.
- 1 Oct 2020 5:30 PM IST
Uttam Kumar Reddy Comments: మోడీ ప్రభుత్వం రైతాంగానికి తీవ్రంగా నష్టపరుస్తుంది.
ఉత్తమ్ కుమార్ రెడ్డి..టీపీసీసీ అధ్యక్షులడు..
-కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చేలా చట్టాలు రూపొందించారు
-రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యాక్రమాలు ..
-కిసాన్, మాజ్దూర్ బచావో దివస్ గా కార్యక్రమాలు జరపాలి..
-కలెక్టరేట్ దగ్గర కానీ, గాంధీ విగ్రహాల వద్ద నిరసన కార్యక్రమాలు చేయాలని పిలుపు
-మద్దతు ధరకే పంట కొనుగోలు చేయాలని చట్టంలో ఎందుకు పొందుపరచడం లేదు
-కేసీఆర్ రైతులకు రుణమాఫీ ఎందుకు చేయలేదో సమాధానం చెప్పాలి
-తెలంగాణ రైతులను కేసీఆర్ ప్రభుత్వం మోసం చేస్తుంది
-గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు జాబితాలో గ్రాడ్యుయేట్స్ ని ఓటర్లుగా చేర్పించాలి
-దుబ్బాక అభ్యర్థి ని రేపు లేదా ఎల్లుండి ప్రకటిస్తాం .
-గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం సబ్ కమిటీని రేపు ప్రకటిస్తాం
- 1 Oct 2020 5:22 PM IST
Rewanth Reddy: సీఎం కేసీఆర్ కు ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ..
-ఈ నెల ఆరున అపెక్స్ కౌన్సిల్ ఎజెండాలో నారాయణపేట్-కొడంగల్ లిఫ్ట్ స్కీం అంశాన్ని చేర్పించండి
-రాజకీయ దురుద్ధేశంతో ఈ స్కీంను మీరు అటకెక్కించారు
-ఉమ్మడి రాష్ట్రంలో ఆమోదం పొందిన ఈ లిఫ్ట్ స్కీం తెలంగాణ హక్కు
-రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటామని కేఆర్ఎంబీ నా లేఖకు స్పందనగా ప్రత్యుత్తరమిచ్చింది.
-జలాల కేటాయింపులో ఏడేళ్లుగా మోడీ ఉలకకపోయినా... బీజేపీ ప్రయోజనాల కోసం మీరు పలుకుతూనే ఉన్నారుగా.
-ఏపీ కయ్యానికి కాలుదువ్వుతోందంటోన్న మీకు... ఆ ప్రభుత్వంలోని కీలక వ్యక్తులతో సాగునీటి కాంట్రాక్టుల విషయంలో వియ్యమెందుకు?
-ఉత్తుత్తి హూంకరింపులు, గాండ్రింపులు పక్కన పెట్టండి
- 1 Oct 2020 5:17 PM IST
Telangana Jana Samithi: నూతన కమిటీని నియమించిన రాష్ట్ర అధ్యక్షులు ఫ్రో,, కోదండరాం ...
టీజేఏస్:
-టీజేఏస్ పార్టీ రాష్ట్ర యూత్ విభాగం నూతన కమిటీని నియమించిన రాష్ట్ర అధ్యక్షులు ఫ్రో,, కోదండరాం ...
-ఆశప్ప - రాష్ట్ర అధ్యక్షులు - సంగారెడ్డి జిల్లా
-సయ్యద్ సలీంపాష - రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ - భువనగిరి యాదాద్రి జిల్లా
-కొత్త రవి - రాష్ట్ర ఉపాధ్యక్షులు - రంగారెడ్డి జిల్లా
-గొంగారెడ్డి వెంకట్ రెడ్డి - రాష్ట్ర ప్రధాన కార్యదర్శి - సూర్యాపేట జిల్లా
- 1 Oct 2020 9:24 AM IST
Hyderabad updates: ఈ రోజు జిహెచ్ఎంసి కార్యాలయంలో ఆల్ పార్టీ మీటింగ్..
హైదరాబాద్..
-ఉన్నతాధికారుల సమావేశంలో ఎన్నికల నిర్వహణ, సిబ్బంది శిక్షణ ,సాంకేతిక పరిజ్ఞానం పై చర్చించనున్న అధికారులు
-జిహెచ్ఎంసి కార్యాలయంలో వార్డ్ ల విభజన, ఓటర్ ల జాబితా, తదితర అంశాలపై చర్చ
-కరోనా నేపథ్యంలో పోలింగ్ వంటి అంశాలపై చర్చించనున్న జిహెచ్ఎంసి అధికారులు.
- 1 Oct 2020 9:18 AM IST
Graduates Elections: తెలంగాణ లో డిగ్రీ పూర్తి చేసిన పట్టభద్రుల ఓటర్ నమోదు..
-ఇవాళ్టి నుండి ఉమ్మడి మహబూబ్ నగర్,రంగారెడ్డి, హైదరాబాద్, ఉమ్మడి ఖమ్మం ,వరంగల్,నల్గొండ గ్రాడ్యుయేట్ ఎన్నికల ఓటర్ నమోదు కు నోటిఫికేషన్ విడుదల
-నవంబర్ 6 వరకు కొత్త ఓటర్ నమోదు కు దరఖాస్తుల స్వీకరణ
-గతంలో ఓటరైనా కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిందే.
-డిసెంబర్ 1 న ఓటర్ ల జాబితా ముసాయిదా విడుదల
-డిసెంబర్ 31 వరకు అభ్యంతరాలు స్వీకరణ
-జనవరి 2021 12 వ తేదీ వరకు అభ్యంతరాలు పరిష్కరణ
-జనవరి18 ఓటర్ తుది జాబితా విడుదల
-నవంబర్ 1 వ తేదీ వరకు డిగ్రీ పూర్తి అయి మూడు సంవత్సరాలు అయి ఉండాలి.
- 1 Oct 2020 8:46 AM IST
Sriram Sagar Project updates: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు మళ్ళీ పెరిగిన వరద..
నిజామాబాద్..
-ఇన్ ఫ్లో 86943 క్యూసెక్కులు
-ఔట్ ఫ్లో 86943 క్యూసెక్కులు
-16 గేట్లు ఎత్తేసిన అధికారులు
-జూన్ నుంచి ఇప్పటివరకు ప్రాజెక్టులోకి చేరిన 259 టీఎంసీలు
-144 టీఎంసీలను వరద గేట్ల ద్వారా గోదావరి లోకి వదిలిపెట్టిన అధికారులు
-జూన్ నుంచి ఇప్పటి వరకు ప్రాజెక్టులోకి వచ్చిన 256 టీఎంసీలు
-142 టీఎంసీలను వరద గేట్ల ద్వారా గోదావరి లోకి వదిలిపెట్టిన అధికారులు







