Top
logo

Live Updates: ఈరోజు (01 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Live Updates: ఈరోజు (01 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
X
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 01 అక్టోబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు పంచాంగం

ఈరోజు గురువారం | 01 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | పౌర్ణిమ: రా.01-05 వరకు తదుపరి | ఉత్తరాభాద్ర నక్షత్రం తె.05-39వరకు తదుపరి | వర్జ్యం: మ.01-56 నుంచి 03-41వరకు | అమృత ఘడియలు: రా.12-24నుంచి 02-46 వరకు | దుర్ముహూర్తం: ఉ.09-48 నుంచి 10-35 వరకు తిరిగి మ. 02-28 నుంచి 03.15 వరకు | రాహుకాలం: మ.01-30 నుంచి 03-00 వరకు | సూర్యోదయం: ఉ.5-54 | సూర్యాస్తమయం: సా.5-47

ఈరోజు తాజా వార్తలు

Web Titlebreaking-news-01st-October-live-updates-latest-telangana-news-latest-telugu-news

Live Updates

 • Mumaith Khan Comments: నాకు క్యాబ్ డ్రైవర్ ను‌ చీట్ చేయాల్సిన అవసరం ఏంటి..
  1 Oct 2020 3:14 PM GMT

  Mumaith Khan Comments: నాకు క్యాబ్ డ్రైవర్ ను‌ చీట్ చేయాల్సిన అవసరం ఏంటి..

  ముమైత్ ఖాన్ సినీ నటి..

  -రెండు రోజుల నుంచి నా పై జరుగుతున్న తప్పుడు ఆరోపణలపై ఫిర్యాదు ఇచ్చాను..

  -కొన్ని మీడియా చానళ్లు నా పరువుకి భంగం కలిగేలా వార్తలు ప్రసారం చేశారు..

  -నా క్యారెక్టర్ ను‌ జడ్జ్ చేసే అధికారం ఏముంది ఒక్కసారి ఆలోచించండి..

  -నామీద డ్రైవర్ తప్పుడు ఆరోపణలు చేశాడు..

  -అతను రాష్ డ్రైవింగ్ చేసి నన్ను భయాందోళనకు గురి చేశాడు..

  -అతనిపై పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాను..

  -నా దగ్గర ఉన్న ఆధారాలన్నీ పోలీసులకు అందజేశాను..

  -అతనికి 23 వేలు 500 డబ్బులు చెల్లించాను..

  -మీడియా ఒక్క సైడ్ వర్షన్ తీసుకొని వార్తలు వేయడం నన్ను బాధించింది..

  -నేను 12 సంవత్సరాల నుండి తెలుగు ఇండస్ట్రీలో ఉన్నాను నా క్యారెక్టర్ గురుంచి అందరికీ తెలుసు..

  -టోల్ గేట్ లకు సంబంధించి పూర్తి డబ్బులు నేనే కట్టాను..

 • Hyderabad updates: ట్యాంక్ బండ్ పై కాంగ్రెస్ నేతల క్యాండిల్ ర్యాలీ..
  1 Oct 2020 3:00 PM GMT

  Hyderabad updates: ట్యాంక్ బండ్ పై కాంగ్రెస్ నేతల క్యాండిల్ ర్యాలీ..

  హైదరాబాద్.. 

  -యూపీలో రేపిస్టులను ఉరి తీయాలంటూ అంబేద్కర్ విగ్రహం వద్ద ప్లకార్డుల ప్రదర్శన

  -మోదీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు

  -పాల్గొన్న టీపీసీసీ ఉత్తమ్, పొన్నాల, ఫిరోజ్ ఖాన్, పొన్నం

 • T. Harish Rao Comments: వివిధ పార్టీల  నాయకులు టి ఆర్ ఎస్ పార్టీలో చేరిక...
  1 Oct 2020 2:45 PM GMT

  T. Harish Rao Comments: వివిధ పార్టీల నాయకులు టి ఆర్ ఎస్ పార్టీలో చేరిక...

  సిద్దిపేట జిల్లా:

  -సిద్దిపేట లోని మంత్రి హరీష్ రావు గారి నివాసంలో దుబ్బాక నియోజకవర్గం తొగుట మండలం పల్లె పహాడ్ , వేములఘాట్ గ్రామాల నుండి వివిధ పార్టీల   నాయకులు టి ఆర్ ఎస్ పార్టీలో చేరిక...

  -ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు గారు మాట్లాడుతూ...

  -ప్రతిపక్షాలు మనతో అడుకొని రాజకీయంగా లబ్ది పొందాలని చూస్తున్నారు...

  -ప్రతిపక్షాలు మనం బ్రతికుండగా ప్రాజెక్ట్ లు కావు నీళ్లు రావు అని అనేవారు..

  -ప్రభుత్వం పట్టుదలతో కాళేశ్వరం ప్రాజెక్ట్ ను పూర్తి చేసింది..

  -ఎవరు అవునన్నా, కాదన్న ఇంకా మూడు ఎంద్లు టీ అర్ ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది...

  -కొండ పోచమ్మ సాగర్ నిర్వాసితులకు ఎలాంటి సహాయం అందించమో మల్లన్న సాగర్ నిర్వాసితులకు కూడా ఇస్తాం...

  -ఇప్పటి వరకు ప్రతిపక్షాలు ఎన్ని కేసులు వేసి అడ్డుకునే ప్రయత్నం చేసిన చివరకు ఎం సాధించారు...

  -మీ నమ్మకాన్ని నిలబెడుతా, మీకు న్యాయం చేస్తాం...

  -త్వరలోనే ప్రాజెక్ట్ లను పూర్తి చేస్తాం

 • Gandhi Bhavan updates: రేవంత్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు...
  1 Oct 2020 2:19 PM GMT

  Gandhi Bhavan updates: రేవంత్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు...

  గాంధీ భవన్..

  -గాంధీ భవన్ నుంచి బీజేపీ ఆఫీస్ ముట్టడికి బయల్దేరిన రేవంత్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు...

  -బీజేపీ కార్యాలయం నుంచి ఎదురుగా దాడికి వచ్చిన బిజెపి కార్యకర్తలు...

  -గాంధీభవన్ బిజెపి మధ్యలో ఉన్న రహదారిపై వద్ద ఉద్రిక్తత

  -మోడీ యోగి డౌన్ డౌన్ అంటూ కాంగ్రెస్ నేతలు నినాదాలు....

  -ప్రియాంక రాహుల్ డౌన్ డౌన్ అంటూ బీజేపీ నేత నినాదాలు.

 • Hyderabad updates: జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సమావేశం: మేయర్ బొంతు రామ్మోహన్...
  1 Oct 2020 2:05 PM GMT

  Hyderabad updates: జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సమావేశం: మేయర్ బొంతు రామ్మోహన్...

  హైదరాబాద్...

  -మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన జరిగిన జి హెచ్ ఎం సి స్టాండింగ్ కమిటీ సమావేశం

  -వరద నీటి సమస్య ను పరిష్కరించుటకు నాలాల నిర్మాణం, రిపేర్లు, అభివృద్ధి,రక్షణ చర్యలకు రూ 298 కోట్లతో 472 పనులు

  -చేపట్టుటకు ఉత్తర్వులు జారీ   చేయించిన రాష్ట్ర మంత్రి తారక రామారావు కు ధన్యవాదములు తెలిపిన జి హెచ్ ఎం సి స్టాండింగ్ కమిటీ

 • Telangana updates: రాహుల్, ప్రియాంకలపై పోలీసుల దాడిని ఖండించిన సీఎల్పీ నేత భట్టి..
  1 Oct 2020 1:59 PM GMT

  Telangana updates: రాహుల్, ప్రియాంకలపై పోలీసుల దాడిని ఖండించిన సీఎల్పీ నేత భట్టి..

  -ఉత్తర్ ప్రదేశ్ హత్రాస్ గ్యాంగ్ రేప్ బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్న

  -మాజీ కాంగ్రెస్ అద్యక్షుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి   ప్రియాంక గాంధీ ని యూపీ పోలీసులు అడ్డుకుని దాడి చేయడాన్ని సీఎల్పీ నేత భట్టి   విక్రమార్క ఖండించారు.

  -యోగి ప్రభుత్వం, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఇలా అప్రజాస్వామికంగా వ్యవహరించడం చాలా బాధాకరమైన విషయమని,

  -ఇలాంటి చర్యల వల్ల ప్రభుత్వం తన వైఫలలు కప్పుపుచుకోవాలని అనుకోవడం దేశ ప్రజలు హర్శించారని,

  -ఇప్పటికైనా యోగి, మోడీ ప్రభుత్వం గ్యాంగ్ రేప్ బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలి.

 • 1 Oct 2020 1:41 PM GMT

  Karimnagar district updates: కొత్త రెవెన్యూ చట్టం పై అవగాహనా సమావేశం నిర్వహించిన మంత్రి గంగుల కమలాకర్..

  కరీంనగర్ :

  కరీంనగర్ నియోజకవర్గంలోని కొత్తపల్లి కరీంనగర్ రూరల్ మండల సర్పంచులు,ఎంపిటిసి లు, గ్రామా పంచాయితీ సెక్రటరీ లతో కొత్త రెవెన్యూ చట్టం పై అవగాహనా సమావేశం నిర్వహించిన మంత్రి గంగుల కమలాకర్

  గంగుల కమలాకర్ కామెంట్స్..

  -చాలా చోట్ల పేద ప్రజల ఆస్తుల హక్కులపై సమస్యలు ఉన్నాయి...

  -ఆ సమస్యల పరిష్కారానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టం తీసుకొచ్చింది...

  -పేద, మధ్యతరగతి ప్రజలకు ఆస్తి హక్కు కల్పించే దిశగా అడుగులు వేస్తున్నాం ..

  -ప్రజల నుంచి అదనంగా డబ్బు వసూలు చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఎంతమాత్రం లేదు

  -కేవలం ప్రజలకు వారి ఆస్తులపై హక్కులు కల్పించాలన్న ప్రయత్నమే చేస్తున్నాం

  -రానున్న 15 రోజుల పాటు ధరణి పోర్టల్‌లో ఆస్తుల నమోదు కార్యక్రమంలో ప్రజాప్రతినిధులంతా చురుగ్గా పాల్గొనాలి

  -ప్రభుత్వ అధికారులకు సహకరించాలి

  -ప్రజలు దళారులను నమ్మి మోసపోవద్దు

 • 1 Oct 2020 1:37 PM GMT

  Telangana updates: అపెక్స్ కౌన్సిల్ సమావేశానికంటే ముందు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి..

  చాడ వెంకటరెడ్డి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి....

  -నదీజలాల వివాదాలపై ఈనెల 6న జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశానికంటే ముందు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి..

  -పోతిరెడ్డిపాడు సామర్థం పెంపు, ప్రత్యేక రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా జలాలను తరలించుకుపోతే దక్షిణ తెలంగాణ   ప్రాజెక్టులకు తీరని నష్టదాయకం..

  -అపెక్స్ కౌన్సిల్ ఎపి తీరును ఎండగట్టేందుకు సిఎం కెసిఆర్ కసర్తు చేయడం అభినందనీ యం..

  -త్వరలో ఉప ఎన్నిక జరగన్ను దుబ్బాక నియోజకవర్గంలో బిజెపిని ఓడించడమే లక్షంగా పని చేస్తాం..

  -ఆ ప్రాంతంలో గ్రామాలలో సిపిఐ పార్టీ శాఖలు, బీడీ, హమాలీ , భవన నిర్మాణ కార్మిక సంఘాలు ఉన్నాయి..

  -గ్రాడ్యుయేట్ ఎంఎల్ ఎన్నికల్లో ప్రజల గొంతు వినిపించే అభ్యర్థులు ఎన్నిక కావాలి..

  -అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో అందరూ నిర్దోషులేనని సిబిఐ ప్రత్యేక కోర్టు తేల్చడం అన్యా యం..

  -ఇన్ని సంవత్సరాల విచారణ అనంతరం దోషులను తేల్చకపోవడంతో ప్రజలు న్యాయవ్యవస్థపై విశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉంది..

 • 1 Oct 2020 1:30 PM GMT

  Bhadradri Kothagudem district updates: కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు విలేకరుల సమావేశం..

  భద్రాద్రికొత్తగూడెం జిల్లా: కొత్తగూడెం....

  -యూపీలో అత్యంత దారుణంగా లైంగిక దాడికి గురైన బాలిక మృతదేహాన్ని అర్ధరాత్రి దొంగచాటుగా దహనం చేసిందే కాక,

  -ఆ బాలిక కుటుంబాన్ని పరామర్శించడానికి వెళుతున్న రాహుల్ గాంధీని ప్రతిపక్ష నేత అని కూడా చూడకుండా పోలీసులు అడ్డుకోవటమే కాక

  -చొక్కా పట్టుకొని కింద పడేయడం అమానీయమైన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం.

 • Telangana updates: రాహుల్, ప్రియాంక గాంధీ ల పై యూపీ పోలీసు తీరుని తీవ్రంగా ఖండిస్తున్న జగ్గారెడ్డి..
  1 Oct 2020 1:23 PM GMT

  Telangana updates: రాహుల్, ప్రియాంక గాంధీ ల పై యూపీ పోలీసు తీరుని తీవ్రంగా ఖండిస్తున్న జగ్గారెడ్డి..

  జగ్గారెడ్డి...ఎమ్మెల్యే..

  -పరామర్శించడానికి వెళ్ళనివ్వకుండా అడ్డుకోవడమే కాకుండా కింద పడేస్తారా..!

  -యూపీ ప్రభుత్వం లో మహిళలకు రక్షణ లేకుండా పోయింది.

  -ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాల్సింది పోయి పరామర్శించడానికి వెళ్ళిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం దారుణం.

  -జాతీయ స్థాయిలో దీని పై కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ తీసుకోవాలి

Next Story