Ayodhya Ram Mandir Bhumi Pujan Live Updates: అయోధ్య రామ మందిరం భూమి పూజ లైవ్ అప్ డేట్స్!
Ayodhya Ram Mandir Bhumi Pujan Live Updates: జగదానంద కారకుడికి మందిర నిర్మాణం. ఎన్నో ఏళ్ల కల.. ఆ కల సాకారానికి తొలిఅడుగు మరి కొద్దిగంటల్లో పడనుంది. ప్రధాని మోడీ చేతుల మీదుగా రామ మందిర నిర్మాణానికి భూమి పూజ జరగనుంది. ఆ వేడుకకు సంబంధించి ఎప్పటికప్పుడు లైవ్ అప్ డేట్స్!
Live Updates
- 5 Aug 2020 9:26 AM IST
రామమందిరం నిర్మాణ భూమి పూజ వేదిక ఇలా!
అయోధ్యలో రామమందిర నిర్మాణానికి భూమిపూజ మహోత్సవం మరి కొద్ది గంటల్లో జరగనుంది. ఈ సందర్భంగా అక్కడ అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. వేదిక.. ఎలావుందో ఈ ఫోటోలలో చూడొచ్చు.


- 5 Aug 2020 9:15 AM IST
రామమందిరం భూమి పూజ సందర్భంగా మోహన్ బాబు ట్వీట్!
రామమందిరం భూమి పూజ సందర్భంగా ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు.
అయోధ్య రాముడు ఆనందించేలా
— Mohan Babu M (@themohanbabu) August 5, 2020
భారతదేశం గర్వించేలా
ప్రపంచ చరిత్ర చెప్పుకునేలా
ఎదురులేని తిరుగులేని మొక్కవోని సాహసంతో
పుణ్యకారం తలపెట్టిన పుణ్యాత్ములందరికీ
శతథా సహస్రథా
వందనం అభివందనం.#JaiShriRam #AyodhyaBhoomipoojan #AyodhyaRamMandir pic.twitter.com/ELAhGhsCBL - 5 Aug 2020 9:09 AM IST
28 ఏళ్ల తరువాత అయోధ్యకు ప్రధాని మోడీ!
ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్యలో కాలు పెట్టి 28 ఏళ్ళు అయింది. అప్పట్లో త్రిరంగా యాత్ర కోసం అయోధ్య వచ్చిన మోడీ.. మళ్ళీ ఇప్పుడు ప్రధాని హోదాలో రామ మందిరం నిర్మాణానికి శ్రీకారం చుట్టడానికి అక్కడ అడుగుపెడుతున్నారు.
- 5 Aug 2020 8:20 AM IST
రాములోరి ఆలయానికి భూమిపూజ కొద్ది సేపట్లో..
భూమి పూజకు శ్రీకారం వెనుక..
అయోధ్యలో రామాలయం భూమిపూజ ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన ఈరోజు నిర్వహించనున్నారు.అపురూపంగా నిర్మించనున్న ఈ ఆలయ విశేషాలతో పాటు.. ఆలయం నిర్మాణానికి పడిన అడుగుల వెనుక విశేషాలు సంక్షిప్తంగా..
- ప్రపంచంలోనే మూడో అతిపెద్ద గుడి
- నిర్మాణ వ్యయం రూ.300 కోట్లు..
- శంకుస్థాపనకు పుణ్యనదుల నుంచి జలాలు
- తొలి ఆహ్వానం ముస్లిం ప్రముఖుడికి.. బాబ్రీ కేసు కక్షిదారు అన్సారీకి అందజేత
- రాముడి కోరిక కావచ్చు.. అందుకే అందుకున్నా అంటూ వ్యాఖ్యానించిన అన్సారీ
- అతిథుల కుదింపు.. వేదికపై మోదీ సహా ఐదుగురే!
- ఆన్‌లైన్‌లో ఆడ్వాణీ, జోషీ హాజరు.. పటిష్ఠ ఏర్పాట్లు
- ఆహ్వాన పత్రిక ఉంటేనే ప్రాంగణంలోకి అనుమతి
- బృహత్తర రామాలయానికి అయోధ్యలో భూమిపూజ
ఆలయ నిర్మాణానికి సాగిన ప్రస్థానం ఇదే..
- ఆడ్వాణీ రథయాత్రతో ఉద్యమానికి రాజకీయ రూపు
- తర్వాత రెండేళ్లకే బాబ్రీ విధ్వంసం
- 30 ఏళ్లుగా రాముడి చుట్టూనే రాజకీయం
- 70 ఏళ్లుగా కోర్టుల్లో నలిగిన కేసు
- అంతిమంగా తెరదించిన సుప్రీంకోర్టు
- శ్రీరాముడికి అనుకూలంగా తీర్పు
దీంతో ఆలయ నిర్మాణానికి భూమిపూజను ఈరోజు వైభవంగా నిర్వహిస్తున్నారు.




