అందుకు నేను అర్హుడిని కాదు.. సోనూసూద్ ట్వీట్!

అందుకు నేను అర్హుడిని కాదు.. సోనూసూద్ ట్వీట్!
x
Highlights

లాక్ డౌన్ సమయంలో వలస కూలీలు ఎన్ని ఇబ్బందులు ఎదురుకున్నారో అందరికి తెలిసిందే. లాక్ డౌన్ వలన పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయి ఎన్నో ఇబ్బందులు పడ్డ వలస కూలీలకు ఆదుకొని వారి పాలిట దేవుడి లాగా నిలిచాడు

లాక్ డౌన్ సమయంలో వలస కూలీలు ఎన్ని ఇబ్బందులు ఎదురుకున్నారో అందరికి తెలిసిందే. లాక్ డౌన్ వలన పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయి ఎన్నో ఇబ్బందులు పడ్డ వలస కూలీలకు ఆదుకొని వారి పాలిట దేవుడి లాగా నిలిచాడు సినీనటుడు సోనూసూద్.. అంతటితో తన సేవలను ఆపకుండా కష్టం అనే మాట వస్తే చాలు అక్కడ వాలిపోతున్నాడు. సమస్య కనిపిస్తే చాలు అక్కడ సొల్యూషన్ లాగా కనిపిస్తున్నాడు.

దీనితో ఇప్పుడు ఎక్కడ చూసిన సోనూసూద్ పేరే వినిపిస్తోంది. అయన సేవలకి గాను అభిమానులు కొందరు గుళ్లు క‌ట్టి దేవుడిగా పూజిస్తూ హార‌తులు ఇస్తున్నారు. దీనికి సంబంధించి విష్ణు కుమార్ గుప్తా అనే ఓ నెటిజన్ ట్వీట్ చేస్తూ పలు ఫొటోలు పోస్ట్ చేశాడు. అయితే దీనిపైన సోనూసూద్ స్పందిస్తూ.. గుళ్లు కట్టి పూజలు చేయడానికి తాను అర్హుడిని కాదంటూ ట్వీట్ చేశారు. గతంలో కూడా తానూ దేవుడిని కాదని మామలు మనిషేనని, కానీ ఇతరులు కష్టంలో ఉంటే తానూ చూడలేనని అంటూ పేర్కొన్నాడు సోనూసూద్!

అటు ప్రస్తుతం తెలుగు సినిమాలతో బిజీగా ఉన్నాడు సూనూసూద్. మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న ఆచార్య మూవీలో విలన్ గా నటిస్తున్నాడు. తాజాగా షూటింగ్ లో కూడా పాల్గొన్నాడు. ఈ సినిమాతో పాటుగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న అల్లుడు అదుర్స్ సినిమాలో నటిస్తున్నాడు సూనూసూద్.

Show Full Article
Print Article
Next Story
More Stories