Tamarind Seeds Benefits: చింతగింజల పవర్‌ మామూలుగా ఉండదు.. ఏ మెడిసిన్‌ పనిచేయదు..!

You Will Be Surprised To Know The Benefits Of Tamarind Seeds These Health Problems Can Be Checked
x

Tamarind Seeds Benefits:చింతగింజల పవర్‌ మామూలుగా ఉండదు.. ఏ మెడిసిన్‌ పనిచేయదు..!

Highlights

Tamarind Seeds Benefits: ఎండాకాలం వచ్చిందంటే చాలు గ్రామాల్లో మహిళలు గుంపుగా చేరి ఓ చెట్టు కింద కూర్చొని చింతగింజలు ఒలుస్తూ ఉంటారు

Tamarind Seeds Benefits: ఎండాకాలం వచ్చిందంటే చాలు గ్రామాల్లో మహిళలు గుంపుగా చేరి ఓ చెట్టు కింద కూర్చొని చింతగింజలు ఒలుస్తూ ఉంటారు. సాయంత్రమైన తర్వాత ఒలిచిన చింతగింజలను డబ్బాలో తీసుకెళ్లి పెంటకుప్పలో పారబోస్తారు. ఇది రొటీన్‌గా జరుగుతూనే ఉంటుంది. అయితే చాలామందికి చింతపండు మాత్రమే ఉపయోగపడుతుంది చింతగింజలు వృథా అనుకుంటారు. నిజానికి చింతపండు కన్నా చింతగింజలతోనే ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి. వీటి ద్వారా వివిధా ఆరోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. వీటిని మందుల తయారీలో ఉపయోగిస్తారు. ఈ రోజు చింతగింజల ఉపయోగాల గురించి తెలుసుకుందాం.

కీళ్ల నొప్పులతో బాధపడేవారికి చింతగింజలు దివ్యౌషధంగా పనిచేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చింత గింజ‌ల‌ పొడితో దంత సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఇందుకోసం చింత గింజలను పొడి చేసి అందులో నీళ్లు క‌లిపి పేస్ట్‌లా చేసి రోజూ దంతాల‌ను తోముకోవాలి. దీంతో దంతాలు తెల్ల‌గా మారడంతోపాటు దంతాల‌పై ఉండే గార‌, పాచి వదిలిపోతుంది. మధుమేహంతో ఇబ్బంది పడుతున్నవారికి చింత గింజ‌లు దివ్యవౌషధమని చెప్పాలి. ఇందుకోసం చింతల గింజల పొడిని నీళ్ల‌లో కలిపి మ‌రిగించి డికాష‌న్‌ను తయారు చేసుకోవాలి. దీనిని ఉద‌యం, సాయంత్రం భోజ‌నానికి ముందు క‌ప్పు మోతాదులో తాగుతుండాలి. దీంతో షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. మధుమేహం అదుపులో ఉంటుంది.

చింత గింజ‌ల పొడి డికాష‌న్‌ను తాగ‌డం వ‌ల్ల హైబీపీ త‌గ్గుతుంది. ఈ గింజ‌ల్లో ఉండే పొటాషియం బీపీని త‌గ్గిస్తుంది. చింత గింజ‌ల్లో యాంటీ వైర‌ల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందువ‌ల్ల ఈ గింజ‌ల పొడిలో నీళ్లు క‌లిపి ఆ మిశ్ర‌మాన్ని గాయాలు, పుండ్ల‌పై రాయాలి. ఇలా చేస్తే అవి త్వ‌ర‌గా మానుతాయి. చింత గింజల్లో ఉండే ఆయుర్వేద గుణాలు చర్మం పై ఉన్న మంగు మచ్చల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. చింత గింజలను పొడిలా తయారుచేసి, ఆ పొడిలో తేనె కలిపి మచ్చల ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. చింతగింజల పొడిని రోజూ ఓ అర టీస్పూన్ మేర రోజుకు రెండు సార్లు నీటితో క‌లిపి తీసుకోవాలి. పాలు లేదా నెయ్యిని కూడా వాడొచ్చు. దీనివల్ల మోకాళ్ల నొప్పులు దూరమవుతాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories