Health Tips: ప్రతిరోజు ఈ టీ తాగితే అద్భుత ప్రయోజనాలు.. అవేంటంటే..?

You Will be Surprised to Know the Benefits of Lemon Grass Tea Know how to Prepare it
x

Health Tips: ప్రతిరోజు ఈ టీ తాగితే అద్భుత ప్రయోజనాలు.. అవేంటంటే..?

Highlights

Health Tips: మనం రోజు ఎన్నో రకాల టీలని తాగుతాం. కానీ అవన్ని మన శరీరానికి హాని చేస్తాయి.

Health Tips: మనం రోజు ఎన్నో రకాల టీలని తాగుతాం. కానీ అవన్ని మన శరీరానికి హాని చేస్తాయి. అందుకే చాలామంది ఈ మధ్య మార్కెట్‌లో దొరికే ఈ హెర్బల్‌ టీని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఆ టీ పేరు లెమన్‌ గ్రాస్‌ టీ. దీని వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

జీర్ణక్రియ

లెమన్‌ గ్రాస్‌ జీర్ణక్రియకు చాలా మంచిది. ఇది బరువుని అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. లెమన్‌గ్రాస్‌లో సిట్రస్‌ అనే మూలకం ఉంటుంది. ఇది శరీరంలో ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడుతుంది.

యాంటీఆక్సిడెంట్లు

లెమన్‌ గ్రాస్‌ టీ శరీరాన్ని డిటాక్స్ చేయడానికి పని చేస్తుంది. లెమన్ గ్రాస్ టీలో అనేక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరాన్ని లోపల నుంచి శుభ్రపరచడంలో సహాయపడుతుంది. ఇది శరీరం నుంచి టాక్సిన్స్‌ని బయటకి పంపిస్తాయి.

బరువు తగ్గిస్తుంది

లెమన్ గ్రాస్ టీ జీవక్రియను పెంచడంలో చాలా మేలు చేస్తుంది. అలాగే ఊబకాయాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే దంత క్షయానికి కారణమయ్యే బ్యాక్టీరియాతో పోరాడుతుంది.

ఎలా తయారు చేయాలి..?

ఒక పాత్రలో 4 కప్పుల నీరు, 1 కప్పు లెమన్ గ్రాస్, 1 టేబుల్ స్పూన్ తేనె తీసుకోవాలి. ముందుగా నిమ్మగడ్డిని నీళ్లతో కడిగి చిన్నచిన్న ముక్కలుగా కోసి రాతిపై రుబ్బుకోవాలి. ఇప్పుడు ఒక పాత్రలో నీటిని వేడి చేసి నిమ్మరసం వేసి ఈ నీటిని 10 నిమిషాలు మరిగించి అందులో రుబ్బుకున్న లెమన్‌ గ్రాస్‌ పేస్ట్‌ని వేయాలి. ఫిల్టర్ చేసి వేడిగా ఆస్వాదించాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories