Reheat: ఫ్రిజ్‌లో పెట్టి ఈ 5 ఆహారాలను వేడి చేసి తింటున్నారా? అయితే మీరు విషం తిన్నట్టే..!

You Should Never Reheat These 5 Common Foods
x

Reheat: ఫ్రిజ్‌లో పెట్టి ఈ 5 ఆహారాలను వేడి చేసి తింటున్నారా? అయితే మీరు విషం తిన్నట్టే..!

Highlights

Foods Do Not Reheat: ఇప్పటి జీవనశైలిలో చాలా మంది వండిన ఆహారాలను ఫ్రిజ్‌లో నిల్వచేసి మరుసటి రోజు తింటున్నారు.

Foods Do Not Reheat: ఇప్పటి జీవనశైలిలో చాలా మంది వండిన ఆహారాలను ఫ్రిజ్‌లో నిల్వచేసి మరుసటి రోజు తింటున్నారు. కానీ, కొన్ని ఆహారాలు ఫ్రిజ్‌లో పెట్టి రీ హీట్ చేసి తినడం ఆరోగ్యానికి ప్రమాదకరం మాత్రమే కాదు, ప్రాణాంతకమూ కావొచ్చు. ఇటీవల హైదరాబాద్‌ వనస్థలిపురానికి చెందిన ఒక వ్యక్తి బోనాల సందర్భంగా ఫ్రిజ్‌లో ఉంచిన మటన్‌ తిని విషమించి మరణించిన సంఘటన దీనికి ఉదాహరణగా నిలిచింది. మరికొంతమంది కుటుంబసభ్యులు ఆసుపత్రి పాలయ్యారు.

ఫ్రిజ్‌లో నిల్వచేసి మళ్లీ వేడి చేసి తినకూడని 5 ముఖ్యమైన ఆహార పదార్థాలు ఇవే:

1. గుడ్డు (Boiled/Cooked Eggs)

ఉడికించిన గుడ్డు లేదా గుడ్డు కూరను ఫ్రిజ్‌లో ఉంచి మళ్లీ రీ హీట్ చేసి తినడం ప్రమాదకరం. గుడ్లలో సాల్మోనెల్లా అనే హానికరమైన బాక్టీరియా ఉండే అవకాశం ఉంటుంది. రీ హీట్ ప్రక్రియ సరైన విధంగా జరగకపోతే ఈ బ్యాక్టీరియా నశించదు. ఇది ఆహార విషపూరితతను కలిగించి ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేసే ప్రమాదం ఉంది.

2. ఆకుకూరలు (Leafy Greens)

ఆకుకూరలు ఆరోగ్యానికి మంచివైనా, వాటిని వండిన తర్వాత ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల నైట్రేట్‌లు నైట్రో అమైన్లుగా మారి క్యాన్సర్‌ను కలిగించే అవకాశం ఉంటుంది. వర్షాకాలంలో ఆకుకూరల వాడకాన్ని తగ్గించాల్సిన అవసరమూ ఉంటుంది.

3. నాన్-వెజ్‌ (Chicken, Mutton, Eggs)

చికెన్, మటన్ వంటి నాన్‌వెజ్‌ ఐటమ్స్‌ను ఫ్రిజ్‌లో ఉంచి మళ్లీ వేడి చేసి తినడం అత్యంత ప్రమాదకరం. ఈ మాంసాహారాల్లోనూ సాల్మొనెల్లా, ఇలాంటివి ఉండే అవకాశముంది. సరైన ఉష్ణోగ్రత వద్ద రీ హీట్ కాకపోతే, అవి మన ఆరోగ్యానికి ముప్పుగా మారతాయి. తినాల్సినప్పుడు తాజాగా వండినదే తీసుకోవడం మంచిది.

4. అవిసెగింజలతో చేసిన తిండి (Flaxseeds & Omega-3 Rich Oils)

అవిసె గింజలు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు కలిగిన ఆయిల్స్ (కనోలా ఆయిల్, కోల్డ్ ప్రైస్ ఆయిల్స్ మొదలైనవి) ఫ్రిజ్‌లో పెట్టడం ద్వారా వాటి పోషకగుణాలు మారిపోతాయి. ఇవి వాడిన ఆహారాన్ని మళ్లీ వేడి చేయడం వల్ల రసాయన మార్పులు జరిగి అనారోగ్యానికి దారి తీస్తాయి.

5. బీట్‌రూట్ (Beetroot Dishes)

బీట్‌రూట్‌లోనూ నైట్రేట్‌లు అధికంగా ఉంటాయి. వండిన తర్వాత ఫ్రిజ్‌లో పెట్టి మళ్లీ రీ హీట్ చేయడం వల్ల అవి నైట్రో అమైన్లుగా మారి క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులకు దారి తీసే అవకాశం ఉంటుంది. అందుకే నిపుణులు బీట్‌రూట్ వంటకాలను తాజా గానే తినమని సూచిస్తున్నారు.

వండిన ఆహారాన్ని ఫ్రిజ్‌లో నిల్వచేయడం సాధారణమే అయినా, కొన్ని రకాల ఆహారాలను రీ హీట్ చేసి తినడం ఆరోగ్యాన్ని ముప్పులోకి నెట్టే ప్రమాదం కలిగి ఉంటుంది. ఇవి తినే ముందు ఏది సరైనది, ఏది ప్రమాదకరం అనేది తెలుసుకుని జాగ్రత్తలు పాటించండి.

Show Full Article
Print Article
Next Story
More Stories