Bodybuilding: జిమ్‌కి వెళ్లకుండా ఇంట్లోనే కండలు పెంచండి.. ఎలాగంటే..?

You can do Bodybuilding at Home Without Going to The Gym | Bodybuilding Tips
x

Bodybuilding: జిమ్‌కి వెళ్లకుండా ఇంట్లోనే కండలు పెంచండి.. ఎలాగంటే..?

Highlights

Bodybuilding: కండలు తిరిగిన దేహ ధారుడ్యాన్ని కలిగి ఉండాలని ప్రతి ఒక్కరి కల...

Bodybuilding: కండలు తిరిగిన దేహ ధారుడ్యాన్ని కలిగి ఉండాలని ప్రతి ఒక్కరి కల. దీని కోసం చాలా మంది జిమ్‌లో చేరుతారు. కానీ బిజీ షెడ్యూల్, బిజినెస్ కారణంగా జిమ్‌కి వెళ్లలేకపోతారు. అలాంటి వారు బాధపడడం తప్ప మరేమి చేయలేరు. అయితే మీరు జిమ్‌కి వెళ్లకుండానే మంచి కండలు, ఫిట్‌నెస్ పొందవచ్చు. అంతేకాదు పెరుగుతున్న మీ స్థూలకాయం కూడా తగ్గించుకోవచ్చు. అంతేకాదు శరీరాన్ని అందంగా తీర్చిదిద్దవచ్చు.

అయితే ఇంట్లో ఎక్సర్‌ సైజ్ చేయడం వల్ల కూడా జిమ్‌లో పొందే ఫిట్‌నెస్‌ని పొందవచ్చు. వాటి కోసం ముందుగా కొన్ని ఆరోగ్య పద్దతులను పాటించాలి. మంచి ఫిట్‌నెస్, కండలను పొందడానికి ప్రతిరోజూ కనీసం 10-12 గ్లాసుల నీరు తాగాలి. ఎందుకంటే నీరు కండరాలు పెరగడానికి సహాయపడుతుంది. దీంతో పాటు నీటి ద్వారా కండరాలకు అవసరమైన పోషకాలు కూడా లభిస్తాయి. క్రమం తప్పకుండా నీరు తాగడం ద్వారా డీహైడ్రేషన్ సమస్య కూడా ముగుస్తుంది.

మానసిక ఒత్తిడి కారణంగా శరీరంలో కార్టిసాల్ హార్మోన్ విడుదలవుతుంది. ఇది శరీరానికి మంచిది కాదు. దీనివల్ల కండరాల వాపు, విస్తరణ ప్రక్రియ ఆగిపోతుంది. అందువల్ల యోగా, ధ్యానాన్ని క్రమం తప్పకుండా చేయాలి. తద్వారా మానసిక ఒత్తిడి నుంచి బయటపడవచ్చు. మంచి శరీరాన్ని నిర్మించడానికి ప్రోటీన్ చాలా అవసరం. ప్రొటీన్ కండర కణజాలాన్ని పెంచుతుంది. ఒక వ్యక్తి బరువు 60 కిలోలు ఉంటే అతనికి ప్రతిరోజూ 90 గ్రాముల ప్రోటీన్ అవసరం.

అందుకోసం ఆహారంలో బియ్యం, తృణధాన్యాలు, బ్రౌన్ బ్రెడ్, ఓట్స్ తినాలి. ప్రతి రాత్రి 7 నుంచి 8 గంటల నిద్ర, ఉదయాన్నే లేవడం ఆరోగ్యానికి మంచిది. రాత్రి బాగా నిద్రపోవడం వల్ల కండరాలు కోలుకుని వాటి పరిమాణం పెరుగుతుంది. తక్కువ నిద్ర కారణంగా, శరీరంలో ప్రోటీన్ పరిమాణం తగ్గుతుంది. దీనివల్ల కండరాలు అభివృద్ధి చెందవు. అందువల్ల రాత్రినిద్రలో అస్సలు రాజీ పడకండి.

Show Full Article
Print Article
Next Story
More Stories