Kichen Tips: వంట గదిలో ఫోన్ వాడుతున్నారా? అయితే ఏం జరుగుతుందో మీరే చూడండి

Kichen Tips: ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ వినియోగం అంతా ఇంతా కాదు. ఫ్రెంట్ రూమ్ నుంచి బెడ్ రూమ్‌కి కిచెన్ నుంచి బాత్రూమ్‌కి ఇలా ఎక్కడ బడితే అక్కడకి ఫోన్‌తో వెళ్లిపోతున్నారు.

Indira Ram
Published on: 2 July 2025 1:16 PM IST
Why not use Mobile Phone in Kitchen Dangers Tips
X

Kichen Tips: వంట గదిలో ఫోన్ వాడుతున్నారా? అయితే ఏం జరుగుతుందో మీరే చూడండి

Kichen Tips: ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ వినియోగం అంతా ఇంతా కాదు. ఫ్రెంట్ రూమ్ నుంచి బెడ్ రూమ్‌కి కిచెన్ నుంచి బాత్రూమ్‌కి ఇలా ఎక్కడ బడితే అక్కడకి ఫోన్‌తో వెళ్లిపోతున్నారు. ఆ ఫోన్‌తోనే జీవిస్తున్నారు. చాలామంది మహిళలు కిచెన్‌లో ఫోన్ పెట్టి ఎక్కువగా మాట్లాడుతుంటారు. లేదంటే మొబైల్ చూస్తు వంట పనులు చేసుకుంటుంటారు. కానీ ఇది ఎంతమాత్రం మంచిది కాదట. దీని వల్ల చాలా సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

చాలామంది మహిళలకు వంటగదిలోకి ఫోన్ లేకుండా ఉండలేరు. వంట చేస్తూ ఫోన్‌ని చూడాలి లేదా మాట్లాడాలి. కానీ ఇది అసలు మంచిది కాదని నిపుణులు అంటున్నారు. ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. ఫోన్ చూస్తే లేదా మాట్లాడుతూ వంట చేస్తే ఇక్కడ రెండు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అందులో మొదటిది ఫోన్‌పై ఏకాగ్రత ఉంటుంది కానీ వంటపైన ఉండదు. దీనివల్ల వంట చెడిపోయే ప్రమాదంఎక్కువగా ఉంటుంది. ఇక రెండోది వంటగదిలోకి ఫోన్‌ని తీసుకెళితే మీ ఫోన్ బ్యాటరీ వేడెక్కి పేలిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వంట గదిలోకి మొబైల్ ఫోన్‌ని అసలు తీసుకెళ్లకూడదు.

వీటితో పాటు ఫోన్‌ని చూస్తూ మీరు కూరగాయలు కట్ చేస్తున్నారనుకుంటే అప్పుడు మీ కళ్లు ఫోన్‌పైన ఉంటాయి గానీ, చేతి వేళ్లపైన ఉండవు. దీంతో వేళ్లు కట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అలాగే, ఫోన్‌ని ఎక్కడబెడితే అక్కడ పెడతారు. బాత్రూంలలోకి కూడా తీసుకెళతారు. అలాంటప్పుడు చాలా రకాల జెమ్స్, బ్యాక్టీరియా, వైరస్‌లు మీ ఫోన్‌ క్యారీ చేస్తూ ఉంటుంది. అటువంటిది పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన వంటగదిలో మీ ఫోన్ తీసుకెళితే ఎలాంటి ప్రమాదాలు వస్తాయో మీరే ఊహించండి.

అంతేకాదు, వంట గదిలో నీరు, మంట ఉంటాయి. మీ మొబైల్ పొరపాటున ఇక్కడుండే నీటిలో గానీ, మంటలో గానీ పడితే తర్వాత ఘటన ఎలా ఉంటుందో చెప్పండి. అందుకే వంటగదిలో ఫోన్‌ని తీసుకెళ్లకూడదు. ఆ గదిలో ఉన్న కాసేపు అన్ని పనులు చకచకా పూర్తి చేసుకుంటే సమయం బాగా కలిసి వస్తుంది.

Indira Ram

Indira Ram

Next Story