Pregnancy: ప్ర‌తీ రెండు నిమిషాల‌కు ఒక గ‌ర్భిణీ మృతి.. అస‌లు కార‌ణం ఏంటో తెలుసా ?

Pregnancy
x

Pregnancy: ప్ర‌తీ రెండు నిమిషాల‌కు ఒక గ‌ర్భిణీ మృతి.. అస‌లు కార‌ణం ఏంటో తెలుసా ?

Highlights

Pregnancy: ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా గణాంకాల ప్రకారం, ప్రతి రెండు నిమిషాలకు ఓ గర్భిణీ స్త్రీ మరణిస్తోంది. 2023లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా 2.6 లక్షల మంది మహిళలు గర్భధారణ సమయంలో, లేదా ప్రసవం తరువాత మరణించారు.

Pregnancy: ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా గణాంకాల ప్రకారం, ప్రతి రెండు నిమిషాలకు ఓ గర్భిణీ స్త్రీ మరణిస్తోంది. 2023లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా 2.6 లక్షల మంది మహిళలు గర్భధారణ సమయంలో, లేదా ప్రసవం తరువాత మరణించారు. ఇది దిగ్భ్రాంతికరమైన అంశం. అయితే, 2000 నుంచి 2023 మధ్యకాలంలో ప్రసూతి మరణాల రేటు (Maternal Mortality Ratio - MMR)లో 40 శాతం తగ్గుదల కనిపించింది.

WHO నిర్వచనం ప్రకారం, గర్భవతిగా ఉన్న సమయంలో, ప్రసవం సమయంలో లేదా తర్వాత 42 రోజుల్లో స్త్రీ మరణించడాన్ని ప్రసూతి మరణం అంటారు. ఈ మరణాలు గర్భధారణకు సంబంధించిన కారణాల వ‌ల్ల‌నే సంభవిస్తాయి. అమెరికన్ కాలేజ్ ఆఫ్ అబ్స్టెట్రిషియన్స్ అండ్ గైనకాలజిస్ట్స్ (ACOG) ప్రకారం, కొన్ని సందర్భాల్లో ప్రసూతి మరణం గర్భం తర్వాత ఒక సంవత్సరం వరకూ సంభవించొచ్చు.

2023లో ప్రపంచ ప్రసూతి మరణాల రేటు (MMR) ప్రతి లక్ష మంది సజీవ జననాలకు 197. తక్కువ ఆదాయ దేశాల్లో ఇది 346గా ఉండగా, అధిక ఆదాయ దేశాల్లో కేవలం 10 మాత్రమే ఉంది.

గర్భిణీ స్త్రీలు ఎక్కువగా ఎందుకు మరణిస్తున్నారు?

అధిక రక్తస్రావం:

ప్రసవం తర్వాత బాగా రక్తం పోవడం ప్రపంచవ్యాప్తంగా మహిళల మరణాలకు ప్రధాన కారణం. భారతదేశం, పాకిస్తాన్ వంటి దేశాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తోంది.

రక్తపోటు సంబంధిత వ్యాధులు:

ఈ వ్యాధులు గుండె, మూత్రపిండాలు, మెదడు లాంటి ముఖ్యమైన అవయవాలను దెబ్బతీస్తాయి. గర్భధారణ సమయంలో అనుకోకుండా వచ్చే రక్తపోటు సమస్యలు ప్రాణాంతకంగా మారవచ్చు.

మానసిక ఆరోగ్య సమస్యలు:

ప్రసవానంతర డిప్రెషన్, ఆందోళన, ఇతర మానసిక సమస్యలు కూడా అతి ప్రమాదకరంగా మారతాయి. చాలామంది ఈ సమస్యలను గమనించకపోవడమే ప్రమాదానికి దారితీస్తోంది.

అంటువ్యాధులు:

సెప్సిస్ లాంటి వ్యాధులు గర్భధారణ సమయంలో లేదా ప్రసవం తరువాత ప్రాణాలను హరిస్తున్నాయి. పారిశుధ్యం లోపించడం, తగిన వైద్యం అందకపోవడం దీనికి ప్రధాన కారణాలు.

గుండె సంబంధిత వ్యాధులు:

గర్భ సమయంలో గుండె మీద ఒత్తిడి పెరగడం వల్ల కొన్ని మహిళలు గుండె జబ్బులతో మృతిచెందుతున్నారు. ముఖ్యంగా కార్డియోమయోపతి అనే వ్యాధి కీలకంగా మారుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories