High Blood Pressure:బీపీ ఎందుకు పెరుగుతుంది? ఎలా కంట్రోల్ చేయాలి?

High Blood Pressure:బీపీ ఎందుకు పెరుగుతుంది? ఎలా కంట్రోల్ చేయాలి?
x

High Blood Pressure:బీపీ ఎందుకు పెరుగుతుంది? ఎలా కంట్రోల్ చేయాలి?

Highlights

హై బీపీ ఒక సైలెంట్ కిల్లర్. ఇది లోపల నుంచే మన శరీరాన్ని దెబ్బతీస్తుంది. భారతదేశంలో 20 కోట్లకు పైగా ప్రజలు ఈ సమస్యతో బాధపడుతున్నారు. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం.. 25 నుంచి 54 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారిలో దాదాపు 35% మంది హైబీపీతో ఇబ్బందులు పడుతున్నారు.

High Blood Pressure: హై బీపీ ఒక సైలెంట్ కిల్లర్. ఇది లోపల నుంచే మన శరీరాన్ని దెబ్బతీస్తుంది. భారతదేశంలో 20 కోట్లకు పైగా ప్రజలు ఈ సమస్యతో బాధపడుతున్నారు. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం.. 25 నుంచి 54 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారిలో దాదాపు 35% మంది హైబీపీతో ఇబ్బందులు పడుతున్నారు. బీపీ సాధారణంగా 120/80 ఉండాలి. కానీ, అది 130/80కి చేరితే హై బీపీగా పరిగణించాలి. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే గుండె, కిడ్నీలు, మెదడు వంటి ముఖ్య అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

హైబీపీ ఎందుకు వస్తుంది?

హై బ్లడ్ ప్రెజర్ అనేది చాలా ప్రమాదకరమైన ఆరోగ్య సమస్య. దీనికి ప్రధాన కారణాలు మన జీవనశైలి, ఆహారపు అలవాట్లే అని నిపుణులు చెబుతున్నారు.

బ్లడ్ ప్రెజర్ పెరగడానికి ప్రధాన కారణాలు

తప్పుడు ఆహారపు అలవాట్లు: అధిక ఉప్పు, వేయించిన, కొవ్వు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు, ఎక్కువ చక్కెర, జంక్ ఫుడ్ తినడం వల్ల బ్లడ్ వెస్సల్స్‌పై ఒత్తిడి పెరిగి బీపీ పెరుగుతుంది.

ఒత్తిడి, జీవనశైలి: నిరంతర ఒత్తిడి గుండె, మెదడు రెండింటికీ హానికరం. సరిగ్గా నిద్ర లేకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం కూడా బీపీని పెంచుతాయి. అలాగే, అధిక బరువు, ధూమపానం, మద్యపానం కూడా హైబీపీకి ప్రధాన కారణాలు.

బ్లడ్ ప్రెజర్‌ను కంట్రోల్ చేసే ఆహారం

ఉప్పు తగ్గించండి: వంటలో ఉప్పు తక్కువగా వాడండి. వండిన తర్వాత ఆహారంపై ఉప్పు చల్లుకోవడం మానుకోండి. ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం కూడా తగ్గించాలి.

ఆకుకూరలు, కూరగాయలు: తాజా ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా తినాలి. వీటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది, ఇది బ్లడ్ ప్రెజర్‌ను అదుపులో ఉంచుతుంది.

పండ్లు, పప్పులు, నట్స్: మీ రోజువారీ ఆహారంలో పండ్లు, పప్పులు, ఓట్స్, పల్లీలు, వాల్‌నట్స్, బాదం వంటి నట్స్ చేర్చుకోండి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు బీపీని తగ్గిస్తాయి.

మరికొన్ని ముఖ్యమైన చిట్కాలు

శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోండి: శరీరంలో నీరు తగ్గకుండా చూసుకోవాలి. డీ హైడ్రేషన్ వల్ల కూడా బీపీ పెరుగుతుంది. రోజుకు 7-8 గ్లాసుల నీరు తాగే అలవాటు చేసుకోండి. టీ, కాఫీ తాగడం తగ్గించాలి.

శారీరక శ్రమ,ధ్యానం: పైన పేర్కొన్న వాటితో పాటు వ్యాయామం, యోగాను మీ జీవితంలో భాగం చేసుకోండి. రోజుకు కనీసం 30 నిమిషాలు నడవడం, తేలికపాటి వ్యాయామాలు చేయడం, సుఖాసనం, ప్రాణాయామం వంటివి చేయడం వల్ల ఒత్తిడి తగ్గి గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories