కోపం వచ్చినప్పుడు ఇలా చేస్తే.. మళ్ళీ రమ్మన్నరాదు..

కోపం వచ్చినప్పుడు ఇలా చేస్తే.. మళ్ళీ రమ్మన్నరాదు..
x
Highlights

తన కోపమే తనకు శత్రువుగా మారుతుందని మన పెద్దలు అంటూ ఉంటారు. చాలా మంది కోపంలో నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు. అలా తీసుకునే నిర్ణయాలు ఒక్కోసారి జీవితానికి...

తన కోపమే తనకు శత్రువుగా మారుతుందని మన పెద్దలు అంటూ ఉంటారు. చాలా మంది కోపంలో నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు. అలా తీసుకునే నిర్ణయాలు ఒక్కోసారి జీవితానికి చెడు చేస్తాయి. అలాగే కోపాన్ని అవతలి వ్యక్తిపై ప్రదర్శించడం వల్ల సంబంధాలు తెగిపోతాయి. కోపంలో ఎన్నో రకాలు ఉంటాయి. మనం కోరుకున్నది దొరక్కపోవడం. ఇష్టమైనది జరగకపోవడం, ఇష్టం లేనిది జరగటం, చెప్పిన మాటలను ఇతరులు ధిక్కరించడం వల్ల.. అంచనాలు తప్పిపోవడంతో కోపాలు వస్తుంటాయి.

అయితే కొందరు కోపం వస్తే తమలో తాము బాధపడుతుంటారు. ఆ కోపాన్ని తినే తిండి మీద చూపిస్తుంటారు. భోజనం మాని తమను తాము హింసించుకుంటారు. అయితే ఇది మరింత ప్రమాదకరం అవుతుంది. అందుకే కోపం వచ్చినప్పుడు దానికి కారకులైన వారి వద్దకు పోయి, మీ బాధను మీ ఆగ్రహాన్ని బయటపెట్టి అడిగేస్తే సగం బాధ తీరుతుంది. అలాగని కొట్లాడకూడదు. అలాకాకుండా కోపం తెప్పించిన వారి గురించి ఇతరుల దగ్గర మాట్లాడితే మరికొన్నిసమస్యలు ఎదురవుతాయి. కోపంతో ఉన్నప్పుడు పరాయి వారితో మాట్లాడే కన్నా మౌనంగా ఉండటం మంచిది.

ఒక్కోసారి కోపంలో ఏం మాట్లాడుతున్నామో మనకే అర్ధం కాదు. కోపం వచ్చినప్పుడు మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి. కోపానికి అతిసులువైన విరుగుడు అంకెలను లెక్కపెట్టడమే. కోపం వచ్చినప్పుడు శ్వాసిస్తూ ఒకటి నుంచి పది అంకెలు లెక్కపెట్టడం వల్ల క్రమంగా కోపం తగ్గిపోతుంది. ఆత్మన్యూనత భావం కలవారు ప్రతి విషయానికి కోపం తెచ్చుకుంటారు. దీనివల్ల ఏ ప్రయోజనం ఉండదు. ఇందుకు చక్కటి పరిష్కారం ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడమే. ఎప్పుడైనా మీకు కోపం వస్తే.. అద్దంలో మొహం చూసుకోండి. కోపంలో మీ హావభావాలు ఎంత వికృతంగా ఉంటాయో అన్నది మీరు తెలుసుకున్నప్పుడు మరోసారి మీకు కోపం రమ్మన్నా రాదు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories