Micro Greens: మైక్రో గ్రీన్స్ తినమని డాక్టర్లు ఎందుకు చెబుతున్నారు? కూరగాయలు, పండ్లకంటే ఇవి బెటరా?

Micro Greens
x

Micro Greens: మైక్రో గ్రీన్స్ తినమని డాక్టర్లు ఎందుకు చెబుతున్నారు? కూరగాయలు, పండ్లకంటే ఇవి బెటరా?

Highlights

Micro Greens: ఈ మధ్యకాలంలో మైక్రో గ్రీన్స్‌కి ఎక్కువ క్రేజ్ పెరిగిపోయింది. సెలబ్రెటీల ఫుడ్ చార్ట్‌లో ఈ మైక్రో గ్రీన్స్ తప్పనిసరి చేసుకోవడంతో అంతటా ఇప్పుడు అదే ట్రెండ్ నడుస్తోంది.

Micro Greens: ఈ మధ్యకాలంలో మైక్రో గ్రీన్స్‌కి ఎక్కువ క్రేజ్ పెరిగిపోయింది. సెలబ్రెటీల ఫుడ్ చార్ట్‌లో ఈ మైక్రో గ్రీన్స్ తప్పనిసరి చేసుకోవడంతో అంతటా ఇప్పుడు అదే ట్రెండ్ నడుస్తోంది. డాక్టర్లు కూడా మైక్రో గ్రీన్స్ తినమని సలహా ఇస్తున్నారు. అసలింతకీ ఈ మైక్రో గ్రీన్స్ తినడం వల్ల ఎలాంటి లాభాలున్నాయో చూద్దాం.

మైక్రోగ్రీన్స్ అనేవి చాలా చిన్నవి. కానీ వీటి ప్రయోజనాలు మాత్రం చాలా ఎక్కువ. ఇవి మొలకలు కంటే కాస్త పెద్దవి. మొలకల కోసం పెసళ్లు, శనగలు, పల్లీలు నానబెట్టి, వాటిని ఒక గుడ్డలో పెడితే ఆ తర్వాత రోజుకు మొలకలు వస్తాయి. వీటిని మనం మొలకలు అంటాం. అలాకాకుండా వీటితో పాటు గోధుమలు, ఓట్స్, మిలెట్స్ లాంటివి మొలకలు కంటే ఎక్కువ రోజులు ఉంచితే చిన్నపాటి మొక్కలుగా వస్తాయి. వీటిని మైక్రో గ్రీన్స్ అని అంటారు. మైక్రోగ్రీన్స్ సాధారణంగా మూడు అంగుళాల కంటే తక్కువ ఎత్తులో పెరుగుతాయి. ఇవి అలంకరణ కోసం అలాగే తినడానికి కూడా ఉపయోగిస్తారు.

ప్రయోజనాలు

మైక్రోగ్రీన్స్‌లో ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఇవి తినడం వల్ల శరీరానికి విటమిన్లు, మినరిల్స్ అదికంగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్లు(ఎ,సి,ఇ,కె) ఖనిజాలు(కాల్షియం, మెగ్నీషియం, ఇనుము, జింక్ అలాగే యాంటీ యాక్సిడెంట్లు) ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఉండే పాలీ ఫెనాల్స్ గుండెజబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

రక్త హీనత

చాలామంది రక్త హీనతతో బాధపడుతుంటారు. అలాంటి వారు మైక్రోగ్రీన్స్‌ ని తినడం వల్ల శరీరానికి పుష్కలమైన ఐరన్ దొరుకుతుంది. అందుకు పాలకూర, బ్రోకలి, మెంతి.. మైక్రో గ్రీన్స్ ఎక్కువగా తినాలి.

క్యాన్సర్‌‌కి వ్యతిరేకం..

మైక్రో గ్రీన్స్‌ లో ఎక్కువగా సల్ఫోరాపేన్ ఉంటుంది. దీనివల్ల క్యాన్సర్ తగ్గుతుంది. డైట్‌లో మైక్రోగ్రీన్స్ తీసుకంటే క్యాన్సర్ ను కంట్రోల్ చేయొచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. ముఖ్యంగా కొలన్ క్యాన్సర్ బారిన పడకుండా ఇవి కాపాడతాయి.

గుండె జబ్బులకు దూరంగా

మైక్రో గ్రీన్స్‌లో పాలీ ఫెనాల్స్ ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదాలు తగ్గుతాయి. క్యాబేజీ మైక్రో గ్రీన్స్ తిన్నప్పుడు శరీర బరువు, ట్రైగ్లిజరైడ్స్, చెడు కొలెస్ట్రాల్ తగ్గాయని కొన్ని పరిశోధనల్లో తేలింది. ఇవి ఎక్కువగా ఉంటే గుండో జబ్బులు వస్తాయి. అందుకే మైకో గ్రీన్స్ ని తీసుకుంటే గుండో జబ్బులకు దూరంగా ఉండొచ్చు.

టైప్ 2 డయాబెటిస్

టైప్ 2 డయాబెటీస్ అంటే ఇక షుగర్ లెవెల్స్ కంట్రోల్ కాని పరిస్థితి. ఈ పేషెంట్లలో కణాలు రక్తం నుండి చక్కెరను తొలగించవు. కానీ మైక్రో గ్రీన్స్ తినడం వల్ల రక్తంలో చక్కెరను తగ్గిస్తాయి. బ్రోకలీ మైక్రోగ్రీన్ ఇన్సులిన్‌ను నిరోధిస్తుంది. అదేవిధంగా మెంతి మైక్రో గ్రీన్స్ బ్లడ్ షుగర్‌‌ను కంట్రోల్ చేస్తుంది.

అయితే ఎటువంటి ఆరోగ్యకరమైన సమస్యలతో బాధపడుతున్నవారు, అనుమానం ఉన్నవారు కచ్చితంగా డాక్టర్ల సలహా మేరు ఈ మైక్రో గ్రీన్స్ తినడం మంచిది.

Show Full Article
Print Article
Next Story
More Stories