Blurry Lip Trend: బ్లరీ లిప్స్ కోసం ఎగబడుతోన్న సెలబ్రెటీలు

Blurry Lip Trend: మార్కెట్లో పెరుగుతోన్న బ్లరీ లిప్స్ మేకప్ ఆర్టిస్టులు

Indira Ram
Published on: 13 Jun 2025 9:15 PM IST
Blurry Lip Trend
X

Blurry Lip Trend: బ్లరీ లిప్స్ కోసం ఎగబడుతోన్న సెలబ్రెటీలు

Blurry Lip Trend: బ్లరీ లిప్స్ ట్రెండ్ బాగా పెరిగిపోతోంది. సెలబ్రెటీలు, కాలీజీ గర్ల్స్ ఇప్పుడు బ్లరీ లిప్స్ పై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. దీన్ని అదునుగా చేసుకుని మార్కెట్లో బ్లరీ లిప్స్ మేకప్ ఆర్టిస్టులు పెరుగుతున్నారు. అయితే చిన్న చిన్న మేకప్ టెక్నిక్స్ నేర్చుకుంటే బ్లెరీ లిప్స్ పొందడం చాలా ఈజీ అని ఎక్స్ పర్ట్స్ అంటున్నారు.

సాధారణంగా పెదవులకు లైనర్ పెట్టి, లిప్ స్టిక్ వేసుకుంటారు. ఆ తర్వాత దానికి ఒక షైనింగ్ గ్లాస్ పూస్తారు. ఇది సహజంగా అందరూ వేసుకునే లిప్ మేకప్. దీనివల్ల పెదవులు చాలా షార్ప్ గా కనిపిస్తాయి. అయితే ఇప్పుడు ఇలా షార్ప్‌గా కాకుండా సెక్సీ లుక్‌లో కనిపించాలని సెలబ్రెటీలు ఆరాటపడుతున్నారు. దీనికోసం స్పెషల్ మేకప్ ఆర్టిస్టులను తెప్పించుకుని మరీ బ్లరీ లిప్స్ పొందుతున్నారు.

బ్లరీ లిప్స్ అంటే ఏంటి?

బ్లరీ లిప్స్ అంటే ఇదొక మేకప్ మాయ. ఈ మేకప్ లో పెదవుల అంచులను మృదువుగా చేస్తారు. అంటే లైనర్ వేసే చోట ఇక కనిపించదు. పెదవుల మధ్య భాగంలో లిప్ స్టిక్ వేస్తారు. అలా అంచులకు వెళ్లే కొద్దీ రంగును డల్ చేస్తారు. దీనివల్ల పెదవులు పెద్దగా మృదువుగా కనిపిస్తాయి. దీనిపైన గ్లాస్ యాడ్ చేయడం వల్ల సెక్సీ లుక్ ఉంటుంది.

మేకప్ ఎలా చేయాలి?

ఏదైనా డార్క్ కలర్ లిప్ స్టిక్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. పింక్, రెడ్ కలర్స్ అయితే బెటర్. ముందుగా లిప్ బ్రష్‌తో లిప్ లైన్‌ను బ్లర్ చేయాలి. ఆ తర్వాత లిప్ స్టిక్ లేదా లిప్ టింట్ ను అప్లై చేయాలి. దీని తర్వాత పెదవుల మధ్య భాగంలో లిప్ స్టిక్ ను గట్టిగా వేసి పెదవుల అంచువరకు వెళ్లే కొద్దీ థిక్‌నెస్‌ను తగ్గించాలి. అవసరమైతే మళ్లీ ఇక్కడ బ్రష్‌తో బ్లర్ చేయొచ్చు. ఇక్కడ మ్యాట్ లిప్ స్టిక్‌ని మాత్రమే ఉపయోగించాలి. ఇప్పుడు పెదవులు మృదువుగా రొమాంటిక్‌గా మారతాయి.

Indira Ram

Indira Ram

Next Story