WHO హెచ్చరిక.. గుండె జబ్బులకి ప్రధాన కారణం ఇదే..!

WHO Warns Trans-fat Foods is the Cause of 5 Billion Heart Attacks
x

WHO హెచ్చరిక.. గుండె జబ్బులకి ప్రధాన కారణం ఇదే..!

Highlights

WHO Warning: వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్ (WHO)ప్రకారం ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఐదు బిలియన్ల (500 కోట్లు) ప్రజలు ట్రాన్స్-ఫ్యాట్ భారినపడ్డారు.

WHO Warning: వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్ (WHO)ప్రకారం ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఐదు బిలియన్ల (500 కోట్లు) ప్రజలు ట్రాన్స్-ఫ్యాట్ భారినపడ్డారు. ఇది గుండె జబ్బులకి కారణమవుతూ మరణాల ప్రమాదాన్ని పెంచుతుంది. ట్రాన్స్-ఫ్యాట్ అనేది అసంతృప్త కొవ్వు రకం. ఇది సహజ, కృత్రిమ రూపాల్లో వస్తుంది. సాధారణంగా ప్యాక్ చేసిన ఆహారాలు, కాల్చిన ఆహారాలు, వంట నూనెలలో ఎక్కువగా ఉంటుంది.

WHO డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ మాట్లాడుతూ..ట్రాన్స్-ఫ్యాట్ వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. దీనివల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. సరళంగా చెప్పాలంటే ట్రాన్స్ ఫ్యాట్ అనేది విషపూరితమైన రసాయనం. ఇది మానవులను నెమ్మదిగా చంపుతుంది. అందుకే ఆహారం నుంచి దానిని వదిలించుకోవాలి. లేదంటే చాలా ఆరోగ్య ప్రమాదం పొంచి ఉంది. .

WHO 2018లోనే 2023 నాటికి ప్రపంచం నుంచి ట్రాన్స్ ఫ్యాట్‌ను తొలగించాలని పిలుపునిచ్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం 43 దేశాలు ట్రాన్స్-ఫ్యాట్‌లను ఎదుర్కోవడానికి ఉత్తమ-ఆచరణ విధానాలను అమలు చేస్తున్నాయి. దాదాపు 2.8 బిలియన్ల ప్రజలను రక్షించాయి. అయితే ఐదు బిలియన్ల మంది ప్రజలు ఇప్పటికీ ఈ అసంతృప్త కొవ్వు ప్రభావాలతో బాధపడుతున్నారు.

గుండె జబ్బులు,ట్రాన్స్ ఫ్యాట్ కారణంగా మరణాలు ఎక్కువగా ఉన్న 16 దేశాలలో 9 దేశాలు ఖచ్చితమైన చర్యలు తీసుకోలేదని WHO తెలిపింది. ఈ 9 దేశాల్లో ఆస్ట్రేలియా, అజర్‌బైజాన్, భూటాన్, ఈక్వెడార్, ఈజిప్ట్, ఇరాన్, నేపాల్, పాకిస్థాన్, దక్షిణ కొరియా ఉన్నాయి. ఈ దేశాలు తక్షణ చర్యలు తీసుకోవాలని WHO సూచించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories