
Guava: ఈ సమస్యలు ఉన్నవారు.. ఈ సీజన్‌లో జామకాయను తినొద్దు
Guava: వర్షాకాలంలో చాలా ఎక్కువగా దొరికే పండ్లలో ఒకటి జామకాయ. చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ల వరకు అందరూ ఈ జామకాయను చాలా ఇష్టంగా తింటారు.
Guava: వర్షాకాలంలో చాలా ఎక్కువగా దొరికే పండ్లలో ఒకటి జామకాయ. చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ల వరకు అందరూ ఈ జామకాయను చాలా ఇష్టంగా తింటారు. అయితే ఈ సీజన్‌లో కొన్ని రకాల ఆరోగ్య సమస్యలతో సతమతమయ్యేవాళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ జామకాయను తినొద్దని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ సమస్యలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
జామకాయలో పోషకాలు ఎక్కువ. అందుకే దీన్ని పేదోడి యాపిల్ అని పిలుస్తారు. విటమిన్లు, ఖనిజాలు, పోషకాలు, పీచు పదార్ధాలతో జామకాయ నిండి ఉంటుంది. అయితే సర్వసాధారణంగా జామకాయ తింటే ఆరోగ్యానికి చాలామంచిది. అందుకే జామకాయ తినమనే డాక్టర్లు సలహా ఇస్తారు. అయితే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ సీజన్‌లో తినొద్దని కూడా డాక్టర్లు చెబుతుంటారు.
ప్రయోజనాలెన్నో..
జామకాయ తింటే అన్నీ ప్రయోజనాలే. విటమిన్ సి ఇందులో పుష్కలంగా ఉంటుంది. ఇది ఇమ్యూనిటీ పవర్‌ని పెంచుతుంది. ఇందులో ఉండే విటమిన్ కె కంటి ఆరోగ్యానికి చాలామంచిది. ఇందులో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల జీర్ణక్రియకు జామకాయ బాగా సహాయపడుతుంది. అంతేకాదు రక్తపోటును నియంత్రించడంలోనూ ఇది తోడ్పడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ప్రీ రాడికల్స్‌తో పోరాడి కణాల్ని రక్షిస్తాయి. దీనివల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే జామకాయతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.
ఎవరు తినకూడదు?
సాధారణంగా జామకాయను పిల్లలు దగ్గర నుండి పెద్దవాళ్ల వరకు అందరూ తినొచ్చు. అయితే కొన్ని రకాల సమస్యలున్నారు.. ఈ సీజన్‌లో తినకుండా ఉంటే మంచిది.
జీర్ణక్రియ సమస్యలు
చాలామందికి ఏది తిన్నా కడుపు ఉబ్బరంగా ఉంటుంది. బరువు ఎక్కినట్లు ఉంటుంది. ఇలా ఉండే వాళ్లు ఎట్టిపరిస్థితుల్లోనూ జామకాయను తినకూడదు. ఒకవేళ తింటే ఈ సమస్యలు పెరగడమే కాకుండా అదనంగా గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు తోడయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా జామకాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది సాధారణ జీర్ణక్రియకు మంచిది. అయితే కడుపు నొప్పి, విరేచనాలతో బాధపడేవారు మాత్రం జామకాయను తినకూడదు.
కిడ్రీ సమస్యలు
ఏదైనా కిడ్నీ సమస్యలతో బాధపడేవారు జామకాయను తినకుండా ఉంటేనే మంచిది. ఎందుకుంటే కిడ్రీ ఫంక్షన్ సజావుగా జరగాలంటే పొటాషియం స్థాయిలను నియంత్రించాలి. అయితే జామ కాయ తింటే.. లేనిపోని సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఎందుకంటే జామకాయలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది కొత్త సమస్యలు తెచ్చే అవకాశం ఉంది. అందుకే డాక్టర్ సలహా మేరకు తినడం మంచిది.
జలుబు , దగ్గు సమస్యలు
కొంతమంది వర్షాకాలంలో ఎపుడు చూసినా జలుబు, దగ్గుతో బాధపడుతుంటారు. ఇలాంటి వాళ్లు అసలు జామకాయను తినకూడదు. ఎందుకంటే జామకాయలో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. జలుబు , దగ్గు ఉన్నవారు సిట్రస్‌కు దూరంగా ఉండాలి. లేదంటే అధికమయ్యే అవకాశాలు ఎక్కువ. అంతేకాదు జామకాయ చలవ చేస్తుంది. దీనివల్ల కూడా జలుబు మరింత పెరిగే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రకమైన సమస్యలు ఉన్నవారు జామకాయను తినకుండా ఉంటేనే మంచిది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




