30 Days Without Sugar: 30 రోజులు పంచదార తినకపోతే శరీంలో ఏం జరుగుతుంది?

30 Days Without Sugar: పంచదార తింటే శరీరానికి మంచిది కాదన్న విషయం అందరికీ తెలుసు. కానీ దాన్ని ఎవరూ తినకుండా ఉండలేరు.

Indira Ram
Published on: 4 July 2025 3:55 PM IST
What Really Happens to Your Body After 30 Days Without Sugar
X

30 Days Without Sugar: 30 రోజులు పంచదార తినకపోతే శరీంలో ఏం జరుగుతుంది? 

30 Days Without Sugar: పంచదార తింటే శరీరానికి మంచిది కాదన్న విషయం అందరికీ తెలుసు. కానీ దాన్ని ఎవరూ తినకుండా ఉండలేరు. దీనివల్ల ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడుతున్నారు. అసలు ఒక నెల రోజుల పాటు పంచదారను తినకపోతే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి. చూద్దాం..

శరీరానికి అవసరం కంటే ఎక్కువ పంచదార తీసుకోవడం.. ఆరోగ్యానికి హానికరం. ఒకవేళ మీరు డయాబెటిసీ రోగులైనా, ఒబేసిటీ రోగులైనా.. ఎటువంటి ప్రాణాంతకమైన జబ్బులతో ఉన్నావారైతే.. అసలు పంచదారను తినకూడదు. ఒకవేళ తిన్నట్లయితే శరీరంలోపల ఉన్న ఆర్గాన్లు నెమ్మది నెమ్మదిగా పనిచేయడం మానేస్తాయి. ఎందుకంటే పంచదార తినడం వల్ల శరీరంలోని వివధ అవయవాల్లో కొవ్వు పేరుకుపోతుంది. దీనివల్ల ప్రమాదం అతి ప్రమాదంగా మారుతుంది. ఒకవేళ మీరు 40–50 ఏళ్ల వయసు మధ్యలో ఉన్నా సరే పంచదారకు దూరంగా ఉండాలి. లేదంటే డయాబెటీస్ మీకు దగ్గరగా వస్తుంది.

పంచదారను నేరుగానే కాదు చాక్లెట్లు, బిస్కెట్లు, బ్యాకరీ పదార్ధాలు, స్టోరేజ్ పదర్ధాలు, జంక్ ఫుడ్.. ఇలాంటివి తినడం వల్ల కూడా పంచదార శరీరంలోపలకి వెళ్లిపోతుంది. అందుకే ఏ విధంగానైనా వీటిని తినకుండా పంచదారకు దూరంగా ఉండాలి. అసలు ఒకవేళ ఒక నెల రోజుల పాటు పంచదారకు దూరంగా ఉంటే ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం...

కాలేయంలో మార్పు

పంచదారను తినడం తగ్గించిన తర్వాత కాలేయంలోనే మొదట మార్పు కనిపిస్తుంది. ఎందుకంటే పంచదార తినడం వల్ల కాలేయం చుట్టుపక్కలంతా కొవ్వు పేరుకుపోతుంది. దీంతో శరీరం మొత్తం అనారోగ్యానికి గురవుతుంది. ఎందుకంటే కాలేయం బావుంటేనే శరీరంలోని అవయవాలన్నీ బావుంటాయి. కాలేయం ఇలా కొవ్వుతో పేరుకుపోతే కాలేయ సంబంధిత వ్యాధులు వస్తాయి.

మూత్రపిండాల పనితీరు

ఒక నెల రోజుల పాటు పంచదారను మానేస్తే మూత్ర పిండాల పనితీరు మెరుగుపడుతుంది. అధిక చక్కెర, అధిక ఇన్సులిన్ స్థాయిలు మూత్రపిండాలపై నిత్యం ఒత్తడిని తీసుకొస్తాయి. దీనివల్ల మూత్రపిండాల పనితీరు తగ్గిపోతుంది. అదే పంచదారను తినకుండా ఉంటే మూత్రపిండాలు రెస్ట్ తీసుకుంటాయి. దానివల్ల వాటి పనితీరు బావుంటుంది.

ధమనుల వాపు

ప్రతి రోజు చక్కెర తీసుకున్నవారిలో ధమనుల గోడలలో వాపు ఏర్పడుతుంది. ఇది గుండె జబ్బులకు ప్రధాన కారణం. చక్కెరను మానేయడం ద్వారా ఈ వాపు క్రమంగా తగ్గుతుంది. ఇది తగ్గితే గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వంటి ప్రమాదాలు తగ్గుతాయి.

పళ్లు సేఫ్

దంతాలను హానిచేసేవాటిలో ముఖ్యమైనది.. పంచదార. ఎక్కువ చక్కెర తినడం వల్ల చిగుళ్ల వ్యాధి వచ్చే ప్రమాదం ఉంటుంది. అంతేకాదు దీనివల్ల నోటిలో బ్యాక్టీరియా ఎక్కువవుతుంది. అదే నెలరోజులు పంచదారను తినకుండా ఆపేస్తే దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి.

తెల్లరక్తకణాలకు బలం

పంచదార శరీరంలో తెల్ల రక్తకణాలను బలహీన పరుస్తుంది. అందుకే ఒక నెల రోజుల పాటు పంచదారను తినకపోతే తెల్ల రక్తకణాలు బలంగా ఉంటాయి. దీనివల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి ఉంటేనే కదా ఎటువంటి అటువంటి వ్యాధులనైనా మన శరీరం నయం చేసుకోగలుగుతుంది.

Indira Ram

Indira Ram

Next Story