Alcohol: డయాబెటిస్‌తో బాధపడుతున్నవారు మద్యం తాగితే ఏమవుతుంది? తెలుసుకోండి

Alcohol
x

Alcohol: డయాబెటిస్‌తో బాధపడుతున్నవారు మద్యం తాగితే ఏమవుతుంది? తెలుసుకోండి

Highlights

Alcohol in Diabetes: మన దేశంలో డయాబెటిస్‌తో బాధపడుతున్న వారి సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. బ్యాడ్ లైఫ్ స్టైల్ ,ఫ్యామిలీ హిస్టరీ కారణంగా ఇలా జరుగుతుంది.

Alcohol and Diabetes

Alcohol in Diabetes: మన దేశంలో డయాబెటిస్‌తో బాధపడుతున్న వారి సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. బ్యాడ్ లైఫ్ స్టైల్ ,ఫ్యామిలీ హిస్టరీ కారణంగా ఇలా జరుగుతుంది.

డయాబెటిస్ అనేది ఫ్యామిలీ హిస్టరీ వల్ల లేకపోతే కొన్ని రకాల ఆరోగ్య సమస్యల వల్ల వస్తుంది. దీంతో జీవితాంతం గండమే. భారత్‌ డయాబెటీస్‌ క్యాపిటల్‌గా మారిపోయింది. డయాబెటిస్ రోగుల సంఖ్య పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో డయాబెటిస్ వారు మద్యం తాగితే ఏం జరుగుతుందో

డయాబెటిస్‌తో బాధపడుతున్న వారు ఎప్పటికప్పుడు శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలు తనిఖీ చేస్తూ ఉండాలి. హఠాత్తుగా చక్కెర పెరగనివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే ఇది ప్రాణాంతకంగా మారొచ్చు. అంతేకాదు షుగర్ లెవెల్ పూర్తిగా తగ్గిపోతే కూడా ప్రమాదం. దీనికి సంబంధించి సరైన లైఫ్ స్టైల్ అనుసరించాలి. డైట్, ఆరోగ్య నిపుణులు సూచించిన విధంగా ఫాలో అవ్వాలి. అంతే మాత్రమే కాదు రెగ్యులర్ ఎక్సర్ సైజ్ కూడా వీళ్లకు తప్పనిసరి.

అయితే డయాబెటిస్‌తో బాధపడుతున్న వాళ్ళు ఆల్కహాల్ తీసుకుంటే ఏమవుతుంది? ఆల్కహాల్ అనేది ఒకటి డీహైడ్రేటింగ్ డ్రింక్ తద్వారా వీళ్ళకు డిహైడ్రేషన్ మరింతగా పెరిగిపోతుంది. మూత్రపిండాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. అంతేకాదు రాను రాను డయాబెటిస్ వారు మద్యం సేవించడం వల్ల ఒబేసిటీ కూడా వస్తుంది. ఈ నేపథ్యంలో డయాబెటిస్ వారు పొరపాటున కూడా మద్యం తీసుకోకూడదు. అదే విధంగా చక్కర ఉండ డ్రింక్ జోలికి అస్సలు పోకూడదు. ఇది ఆరోగ్యం ప్రభావం చూపుతుంది.

డయాబెటిస్ వారు ఇలా మద్యం సేవిస్తే వారి గుండె, కాలేయంపై తీవ్ర ప్రభావం పడటం మాత్రమే కాదు.. ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. డయాబెటీస్‌ వారు మద్యం సేవిస్తే రక్తపోటు కూడా పెరిగిపోయే ప్రమాదం ఉంది. అయితే మద్యపానం మద్యం అలవాటు ఉన్నవాళ్లు ఆరోగ్య నిపుణుల సూచన మేరకు తాగవచ్చు. ఇక విస్కీ రమ్‌ తాగే బదులు వోడ్కా వంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories