Walking: నడకతో డిప్రెషన్ ను దూరం పెట్టొచ్చు.. రోజుకు 7 వేల అడుగులు చాలట

Walking 7000 Steps a day Can Lower Risk of Depression and Disease
x

Walking: నడకతో డిప్రెషన్ ను దూరం పెట్టొచ్చు.. రోజుకు 7 వేల అడుగులు చాలట

Highlights

Walking: నడక ఆరోగ్యానికి అమోఘమైన ఔషధంలా పనిచేస్తుందని మరో సరికొత్త అధ్యయనం ద్వారా వెల్లడైంది.

Walking: నడక ఆరోగ్యానికి అమోఘమైన ఔషధంలా పనిచేస్తుందని మరో సరికొత్త అధ్యయనం ద్వారా వెల్లడైంది. ఇప్పటికే నడక వల్ల కలిగే అనేక లాభాలు మనకు తెలుసు. అయితే తాజాగా ప్రచురితమైన లాన్సెట్ అధ్యయనం ప్రకారం, నిత్యం క్రమం తప్పకుండా నడకతో డిప్రెషన్, డయాబెటిస్‌, హృదయ రోగాలు, క్యాన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధులను కూడా నియంత్రించుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.

ఈ అధ్యయనం కోసం 2014 నుండి 2025 మధ్యకాలంలో యూకే, ఆస్ట్రేలియా, స్పెయిన్‌, నార్వే వంటి 32 దేశాల్లో నిర్వహించిన 88 సర్వేల్లో 1.6 లక్షల మందికి పైగా వాలంటీర్లు, పరిశోధకులు పాల్గొన్నారు. వారందరి డేటా విశ్లేషించిన అనంతరం ప్రతిరోజు కనీసం 7 వేల అడుగులు నడవడం వల్ల ఆరోగ్యంపై ఎంత ప్రభావం పడుతుందో వివరించారు.

నడక వల్ల కలిగే ముఖ్య ప్రయోజనాలు:

మరణ ముప్పు తగ్గింపు: రోజుకు కేవలం 2 వేల అడుగులతో పోలిస్తే, 7 వేల అడుగులు నడిచే వారికి మరణపు ప్రమాదం 47 శాతం వరకు తగ్గుతుందని గుర్తించారు.

మానసిక ఆరోగ్యంపై ప్రభావం: డిప్రెషన్ వచ్చే అవకాశం 22 శాతం తగ్గుతుంది.

క్యాన్సర్ ముప్పు: క్యాన్సర్ రావడాన్ని 6 శాతం, క్యాన్సర్ మృతులను 37 శాతం మేర తగ్గించే అవకాశం ఉంది.

మేధస్సు సమస్యలు: డిమెన్షియా ముప్పు 38 శాతం మేర తగ్గుతుంది.

హృదయ ఆరోగ్యం: గుండె సంబంధిత వ్యాధులు 25 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది.

టైప్ 2 డయాబెటిస్‌: దీని ముప్పు 14 శాతం మేర తగ్గుతుందని అధ్యయనం వెల్లడించింది.

తేలికైన అలవాటుతో గొప్ప ప్రయోజనాలు:

ఇవన్నీ సాధించేందుకు పెద్దగా జిమ్‌కి వెళ్లాల్సిన పనిలేదు. కేవలం ప్రతిరోజూ నడకకు కొంత సమయం కేటాయించడం ద్వారా ఈ అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ముఖ్యంగా రోజుకు కనీసం 7 వేల అడుగులు వేయడం అనేది జీవనశైలిలో ఒక చిన్న మార్పుగా కనిపించవచ్చుగానీ, దీని ప్రభావం మాత్రం ఎంతో గొప్పదిగా ఉంటుందని పరిశోధకులు తేల్చి చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories