Health: ఈ విటమిన్‌ లోపిస్తే చర్మంపై ముడతలు.. అనేక రకాల రుగ్మతలు..!

Vitamin E Deficiency Causes Wrinkles on the Skin Many Types of Disorders
x

Health: ఈ విటమిన్‌ లోపిస్తే చర్మంపై ముడతలు.. అనేక రకాల రుగ్మతలు..!

Highlights

Health: ఈ విటమిన్‌ లోపిస్తే చర్మంపై ముడతలు.. అనేక రకాల రుగ్మతలు..!

Health: పెరుగుతున్న వయస్సు మొదట మీ చర్మం, తర్వాత జుట్టులో కనిపిస్తుంది. శరీరంలో విటమిన్ల లోపం కారణంగా చర్మంపై మచ్చలు ఏర్పడుతాయి. విటమిన్ ఈ లోపం వల్ల చర్మం ముడతలు, పొడిబారడానికి దారితీస్తుంది. అంతేకాకుండా పొడిబారిన ప్రాణములేని జుట్టు కూడా వయస్సును చూపుతుంది. జుట్టు, చర్మాన్ని యవ్వనంగా ఉంచడానికి మీరు విటమిన్ ఇ అధికంగా ఉండే వాటిని తీసుకోవాలి. విటమిన్ ఇ శరీరానికి చాలా ముఖ్యమైనది. విటమిన్ ఇ మన జుట్టు, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. విటమిన్ ఇ అలెర్జీల సమస్య నుంచి దూరంగా ఉంచడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. విటమిన్ ఇ వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.

యాంటీ ఏజింగ్ ఆక్సిడెంట్లు విటమిన్ ఇలో సమృద్ధిగా లభిస్తాయి. ఇది వృద్ధాప్య ప్రభావాన్ని తగ్గిస్తుంది. విటమిన్ ఇ చర్మంపై ముడతలను తగ్గిస్తుంది. మానసిక వ్యాధులను దూరం చేయడంలో విటమిన్ ఇ బాగా పనిచేస్తుంది. విటమిన్ ఇ అనేక రకాల సౌందర్య ఉత్పత్తులలో ఉపయోగిస్తారు. చర్మానికి తేమను తీసుకురావడానికి విటమిన్ ఈ అవసరం. విటమిన్-E శరీరంలో ఎర్ర రక్త కణాల ఏర్పాటులో సహాయపడుతుంది. గర్భధారణ సమయంలో విటమిన్-ఇ బిడ్డను రక్తహీనత నుంచి కాపాడుతుంది. విటమిన్ ఇ తీసుకోవడం వల్ల అలర్జీలు తొలగిపోయి కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories