Viral Video : నీళ్లు వేడి చేయడానికి సరికొత్త టెక్నాలజీ..వీడి తెలివికి నోబెల్ ఇవ్వాల్సిందే!

Viral Video
x

Viral Video : నీళ్లు వేడి చేయడానికి సరికొత్త టెక్నాలజీ..వీడి తెలివికి నోబెల్ ఇవ్వాల్సిందే!

Highlights

Viral Video : చలికాలం వచ్చిందంటే చాలు.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరికీ ఒకటే భయం.

Viral Video: చలికాలం వచ్చిందంటే చాలు.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరికీ ఒకటే భయం. అదే స్నానం. బయట గజగజ వణికించే చలి, పైగా ఐస్‌లాంటి చల్లటి నీళ్లు.. ఆ నీటి చుక్క ఒంటి మీద పడితే చాలు ప్రాణాలు పోయినంత పనవుతుంది. గీజర్లు ఉన్నవాళ్లు పర్లేదు కానీ, లేనివాళ్లు మాత్రం రకరకాల వేషాలు వేస్తుంటారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తే.. ఈ చలి నుంచి తప్పించుకోవడానికి జనం ఎలాంటి వింత వింత పనులు చేస్తారో అర్థమవుతుంది. ఒక వ్యక్తి నీటిని వేడి చేయడానికి కనిపెట్టిన ఆ టెక్నిక్ చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ఉదయం పూట మంచు కురుస్తుండటంతో చన్నీటితో స్నానం చేయడం అనేది ఒక పెద్ద సాహసంగా మారింది. ఈ క్రమంలోనే ఒక వ్యక్తి బాత్‌రూమ్‌లో నీటిని వేడి చేయడానికి అద్భుతమైన ఐడియా వేశాడు. ఈ వీడియోలో ఒక వ్యక్తి బాత్‌రూమ్‌లో కూర్చుని ఉంటాడు. నీళ్లు చాలా చల్లగా ఉండటంతో స్నానం చేయడానికి అస్సలు ధైర్యం సరిపోవడం లేదు. కాసేపు ఆలోచించి, ఎలాగైనా నీటిని గోరువెచ్చగా మార్చాలని ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు.

ఆ వ్యక్తి ఏం చేశాడంటే.. బాత్‌రూమ్ టాప్ కు అనుసంధానించిన పైపు కింద లైన్ ప్రకారం వరుసగా కొవ్వొత్తులను వెలిగించి అమర్చాడు. ఆ కొవ్వొత్తుల మంట నేరుగా నీటి పైపుకు తగిలేలా సెట్ చేశాడు. అలా చేయడం వల్ల పైపు లోపలి నుంచి వచ్చే నీరు వేడెక్కుతుందని, ఆ తర్వాత గోరువెచ్చని నీటితో హాయిగా స్నానం చేయవచ్చని ఆ మహానుభావుడి ఉద్దేశం. వీడియో చివర్లో ఆ నల్లా కింద కూర్చుని ఆయన స్నానం చేస్తున్న దృశ్యాలు చూస్తే నవ్వు ఆపుకోవడం ఎవరి తరమూ కాదు.



ఈ వింత ప్రయోగానికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో maximum_manthan అనే అకౌంట్ నుండి పోస్ట్ చేశారు. పోస్ట్ చేసిన కొద్దిసేపటికే ఇది కాస్తా వైరల్‌గా మారిపోయింది. ఇప్పటివరకు ఈ వీడియోను 20 లక్షల మందికి పైగా వీక్షించారు. వేలాది మంది నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తూ రచ్చ చేస్తున్నారు. ఒక యూజర్ "అన్నయ్య.. కొవ్వొత్తుల వేడికి ఆ పైపు కరిగిపోతుంది తప్ప నీళ్లు వేడెక్కవు" అని చమత్కరించగా, మరొకరు "ఇతని ఆత్మవిశ్వాసం చూస్తుంటే ముచ్చటగా ఉంది" అని రాశారు. "ఇలాంటి వింతలు కేవలం మన దేశంలోనే సాధ్యం" అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

సైన్స్ ప్రకారం చూస్తే.. కొవ్వొత్తి ఇచ్చే అతి తక్కువ వేడితో ప్రవహిస్తున్న నీటి ఉష్ణోగ్రతను మార్చడం అసాధ్యం. పైగా ఆ మంట వల్ల ప్లాస్టిక్ పైపు కాలిపోయి ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇలాంటి తింగరి ప్రయోగాలు ఎవరూ ఇంట్లో ట్రై చేయకపోవడమే మంచిది. ఏదేమైనా, చలికాలంలో స్నానం చేయకుండా తప్పించుకోవడానికి లేదా నీటిని వేడి చేయడానికి జనం వేసే వేషాలు మాత్రం సోషల్ మీడియాలో మంచి వినోదాన్ని పంచుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories