Ghee For Skin: ముఖ సౌందర్యం కోసం సహజసిద్దమైన నెయ్యి.. కచ్చితమైన ఫలితాలు..!

Use Natural Ghee for Facial Beauty For Sure Results
x

Ghee For Skin: ముఖ సౌందర్యం కోసం సహజసిద్దమైన నెయ్యి.. కచ్చితమైన ఫలితాలు..!

Highlights

Ghee For Skin: భారతీయులు ప్రాచీనకాలం నుంచి నెయ్యిని ఉపయోగిస్తున్నారు.

Ghee For Skin: భారతీయులు ప్రాచీనకాలం నుంచి నెయ్యిని ఉపయోగిస్తున్నారు. ఇందులో అనేక ఔషధ గుణాలు దాగి ఉంటాయి. ఆయుర్వేదంలో కూడా నెయ్యికి ప్రత్యేక స్థానం ఉంటుంది. అంతేకాకుండా ఇది వంటకాల రుచిని పెంచుతుంది. నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. చర్మ నిగారింపునకి నెయ్యి సూపర్‌ఫుడ్‌గా చెప్పవచ్చు. ఇందులో ఉండే పోషకాలు చర్మానికి పోషణనిస్తాయి. చర్మ సంరక్షణలో నెయ్యిని చేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఈరోజు తెలుసుకుందాం.

సహజమైన మాయిశ్చరైజర్‌

నెయ్యిలో విటమిన్ ఎ, ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి సహజ సిద్దమైన మాయిశ్చరైజర్‌లా పనిచేస్తాయి. చర్మాన్ని చాలా కాలం పాటు హైడ్రేట్‌గా ఉంచుతాయి. పొడి చర్మం ఉన్నవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. స్నానానికి ముందు నెయ్యితో చర్మాన్ని మసాజ్ చేసుకోవచ్చు. నెయ్యి చర్మాన్ని మృదువుగా మారుస్తుంది.

పగిలిన పెదవులు

పగిలిన పెదాల సమస్యను తొలగించడానికి నెయ్యిని ఉపయోగించవచ్చు. నెయ్యి పెదాలను మృదువుగా మారుస్తుంది.

టాక్సిన్స్‌ని బయటికి పంపిస్తాయి

నెయ్యిలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థకు చాలా మంచివి. టాక్సిన్ శరీరం నుంచి బయటకు పంపిస్తాయి. దీని వల్ల చర్మం మెరుస్తూ కాంతివంతంగా ఉంటుంది.

నల్లటి వలయాలు తొలగిపోతాయి

చాలా మంది కళ్ల కింద నల్లటి వలయాలతో ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి వారు వాటిపై నెయ్యి రాయవచ్చు. ఇది డార్క్ స్కిన్‌ని కాంతివంతంగా మార్చడంలో సహాయపడుతుంది. నెయ్యి రాసుకోవడం వల్ల చర్మం రిలాక్స్ అవుతుంది. నల్లటి వలయాల సమస్యను తొలగించడానికి నెయ్యిని ఉపయోగించవచ్చు. రాత్రి పడుకునే ముందు నల్లటి వలయాలపై నెయ్యితో మసాజ్ చేయాలి. కొద్దిరోజుల్లోనే ఫలితం చూస్తారు.

చర్మాన్ని యవ్వనంగా

నెయ్యిలో విటమిన్ ఎ, డి, ఇ ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఇవి చర్మం ముడతలను తొలగిస్తాయి. చర్మాన్ని యవ్వనంగా మారుస్తాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories