Typhoid: వర్షాకాలంలో పిల్లలకు టైఫాయిడ్ ఎందుకు వస్తుంది? దాని లక్షణాలు ఏంటి?

Typhoid
x

Typhoid: వర్షాకాలంలో పిల్లలకు టైఫాయిడ్ ఎందుకు వస్తుంది? దాని లక్షణాలు ఏంటి?

Highlights

Typhoid: వర్షాకాలం వచ్చిందంటే చాలా రోగాలు వెంట పడతాయి. వాటిలో ఒకటి టైఫాయిడ్. ఇది ముఖ్యంగా పిల్లలకు చాలా ఈజీగా వచ్చే ఒక బ్యాక్టీరియల్ జబ్బు. మామూలుగా అయితే టైఫాయిడ్ సంవత్సరంలో ఎప్పుడైనా రావచ్చు, కానీ వర్షాకాలంలో దీని కేసులు చాలా ఎక్కువగా నమోదవుతాయి.

Typhoid: వర్షాకాలం వచ్చిందంటే చాలా రోగాలు వెంట పడతాయి. వాటిలో ఒకటి టైఫాయిడ్. ఇది ముఖ్యంగా పిల్లలకు చాలా ఈజీగా వచ్చే ఒక బ్యాక్టీరియల్ జబ్బు. మామూలుగా అయితే టైఫాయిడ్ సంవత్సరంలో ఎప్పుడైనా రావచ్చు, కానీ వర్షాకాలంలో దీని కేసులు చాలా ఎక్కువగా నమోదవుతాయి. ఈ జబ్బు ఎక్కువగా మురికి నీరు లేదా కలుషితమైన ఆహారం ద్వారా వ్యాపిస్తుంది.

టైఫాయిడ్ రావడానికి కారణం సాల్మొనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా మన శరీరంలోకి కలుషితమైన ఆహారం లేదా నీటి ద్వారా చేరుతుంది. అది పేగుల నుంచి రక్తంలోకి పాకుతుంది. పిల్లలు మురికి చేతులతో ఆహారం తినడం, బయట అమ్మే కలుషితమైన ఆహారం తినడం లేదా చేతులు సరిగా కడుక్కోకపోవడం కూడా దీనికి ముఖ్య కారణాలు.

పిల్లల్లో టైఫాయిడ్ వస్తే మొదట్లో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. మొదట్లో తేలికపాటి జ్వరం వచ్చి, అది నెమ్మదిగా పెరుగుతూ కొన్ని రోజుల్లో 102 నుంచి 104 డిగ్రీల ఫారన్‌హీట్ వరకు చేరుతుంది. ఈ జ్వరం మామూలుగా మందులకు త్వరగా తగ్గదు. జ్వరంతో పాటు పిల్లలు అలసిపోయినట్లు, తలనొప్పి, ఒళ్లు నొప్పులతో ఉంటారు.

టైఫాయిడ్ సాధారణ లక్షణాలు ఆకలి లేకపోవడం, పొట్ట నొప్పి, వికారం. కొందరికి విరేచనాలు అవుతాయి, ఇంకొందరికి మలబద్ధకం కూడా ఉంటుంది. కొంతమంది పిల్లల నాలుకపై తెల్లటి పొర కనిపిస్తుంది, ముఖం పాలిపోయినట్లు కూడా ఉండొచ్చు. జబ్బు తీవ్రమైతే పొట్ట ఉబ్బడం, కాలేయం, ప్లీహం పెరగడం, రక్తపోటు తగ్గడం లాంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు.

టైఫాయిడ్ రాకుండా చూసుకోవాలంటే ముఖ్యంగా శుభ్రత పాటించాలి. పిల్లలకు ఎప్పుడూ కాచి చల్లార్చిన నీటిని లేదా ఫిల్టర్ చేసిన నీటిని మాత్రమే తాగించాలి. బయట అమ్మే కలుషితమైన ఆహారాన్ని పిల్లలకు అస్సలు తినిపించకూడదు. పిల్లలకు తరచుగా చేతులు కడుక్కునే అలవాటు చేయాలి. ముఖ్యంగా తినడానికి ముందు, టాయిలెట్‌కు వెళ్లి వచ్చిన తర్వాత తప్పకుండా సబ్బుతో చేతులు కడుక్కోవాలని నేర్పాలి. టైఫాయిడ్‌కు టీకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. డాక్టర్ సలహా మేరకు సరైన వయసులో ఈ టీకాను పిల్లలకు వేయించాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories