Tulsi Water: తులసి నీరు ఇంట్లోని అన్ని సమస్యలకి పరిష్కారం.. ఇలా చేసి చూడండి..!

Tulsi Water: తులసి నీరు ఇంట్లోని అన్ని సమస్యలకి పరిష్కారం.. ఇలా చేసి చూడండి..!

Jyothi
Published on: 24 Dec 2022 7:24 AM IST
Tulsi Water is the Solution to all the Problems in the House Try This
X

Tulsi Water: తులసి నీరు ఇంట్లోని అన్ని సమస్యలకి పరిష్కారం.. ఇలా చేసి చూడండి..!

Tulsi Water: ఇంట్లో ఆనందం, శాంతి వెల్లివిరియాలంటే కచ్చితంగా తులసి మొక్కని నాటాలి. దీని వల్ల ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ బయటకు వెళ్లి పాజిటివ్ ఎనర్జీ ప్రసరిస్తుంది. తులసి మొక్కలో విష్ణువు, తల్లి లక్ష్మి నివసిస్తుందని నమ్ముతారు. తులసిని ప్రతిరోజూ పూజించి దానికి నీరు సమర్పించి దీపం వెలిగించిన వారికి శ్రీ హరి, మా లక్ష్మి అనుగ్రహం లభిస్తుంది. తులసి మాదిరి దాని నీరు కూడా చాలా అద్భుత ఔషధ గుణాలతో నిండి ఉంటుంది. ఈ నీటిని ఉపయోగించి అనేక రకాల సమస్యలని పరిష్కరించవచ్చు.

వ్యాపారంలో వైఫల్యం

వ్యాపారంలో వైఫల్యం, పురోగతికి అడ్డంకులు ఎదురైతే తులసి నీరు ప్రభావవంతంగా పనిచేస్తుంది. తులసి ఆకులను నీటిలో మూడు రోజులు నానబెట్టి ఆ నీటిని కార్యాలయం, పని ప్రదేశంలో చిలకరించాలి. దీనివల్ల వ్యాపారం వృద్ధి చెందుతుంది.

తులసి నీటి స్ప్రే

తులసి ఆకులను రాత్రంతా నీటిలో నానబెట్టాలి. తరువాత ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం పూజానంతరం ఇంట్లో మొత్తం ఈ నీటిని చల్లాలి. దీనివల్ల ఇంట్లోని దుష్టశక్తులన్నీ బయటకు వెళ్లి పాజిటివ్ ఎనర్జీ ప్రసరిస్తుంది.

వ్యాధి నివారణ

తులసి శ్రీకృష్ణునికి చాలా ప్రీతికరమైనది. తులసి నీటితో శ్రీకృష్ణునికి అభిషేకం చేయడం వల్ల విశేషమైన పుణ్యఫలం లభిస్తుంది. దీంతో పాటు అనారోగ్యంతో ఉన్న వ్యక్తిపై ఆ నీటిని చల్లడం వల్ల వ్యాధి నుంచి ఉపశమనం లభిస్తుంది.

Jyothi

Jyothi

Next Story