Carrot Soup: చలికాలంలో హెల్తీ, టేస్టీ క్యారెట్ సూప్.. ఇంట్లోనే ఇలా ట్రై చేయండి..

Try hot carrot soup for dinner in the winter
x

Carrot Soup: చలికాలంలో హెల్తీ, టేస్టీ క్యారెట్ సూప్.. ఇంట్లోనే ఇలా ట్రై చేయండి..

Highlights

Carrot Soup: చలికాలంలో చాలామందికి వేడి వేడిగా ఏదైనా ట్రై చేయాలని ఉంటుంది.

Carrot Soup: చలికాలంలో చాలామందికి వేడి వేడిగా ఏదైనా ట్రై చేయాలని ఉంటుంది. ఎందుకంటే శరీరం చల్లదనానికి బదులు వేడిని కోరుకుంటుంది. అలాంటి వారికి క్యారెట్ సూప్ బెస్ట్ అని చెప్పవచ్చు. తక్కువ ఖర్చులో వేడ వేడి టేస్టీ సూప్ రెడీ అవుతుంది. క్యారెట్‌లో శరీరానకి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. నాలుగు రకాల ఫైటోకెమికల్స్ ఇందులో కనిపిస్తాయి ఇవి క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. పొటాషియం, విటమిన్ సిని అందించడమే కాకుండా ప్రొవిటమిన్ ఎ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. క్యారెట్ సూప్‌ ఎలా చేయాలో తెలుసుకుందాం.

క్యారెట్ సూప్‌కి కావలసిన పదార్థాలు

4 నుంచి 5 క్యారెట్లు, నల్ల మిరియాలు, 3 నుంచి 4 వెల్లుల్లి లవంగాలు, కొంత అల్లం, జీలకర్ర ఒక చెంచా, మొక్కజొన్న పిండి, తరిగిన పచ్చి ఉల్లిపాయ, చాట్ మసాలా, ఉల్లిపాయ ముక్కలు, రుచికి సరిపడ ఉప్పు

ఇలా తయారు చేయండి..

1. గిన్నెలో నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, తరిగిన అల్లం, వెల్లుల్లి వేయాలి.

2. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి.

3. ఇప్పుడు అందులో క్యారెట్ వేసి ఉడికించాలి.

4. ఇప్పుడు క్యారెట్‌ను శుభ్రమైన పాత్రలో చల్లార్చాలి.

5. కొంత సమయం తరువాత ఉడికిన క్యారెట్లను మిక్సీలో వేయండి.

6. ఇప్పుడు ఒక గిన్నెలో క్యారెట్ పేస్ట్ ఉంచండి. దానికి కొంత నీరు కలపండి.

7. ఈ సమయంలో ఉప్పు, మిరియాలు, చాట్ మసాలా వేయండి.

8. కొద్దిసేపు తక్కువ మంటపై మరిగించాలి.

9. మీ సూప్ సిద్ధంగా ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories