Low Glycaemic: గ్లైసెమిక్‌ సూచీ తక్కువగా ఉండే ఈ పండ్లు డయాబెటిక్ వ్యాధిగ్రస్తులకు వరం..!

Top Low Glycemic Fruits for Diabetics Best Fruits to Manage Blood Sugar Levels
x

Low Glycaemic: గ్లైసెమిక్‌ సూచీ తక్కువగా ఉండే ఈ పండ్లు డయాబెటిక్ వ్యాధిగ్రస్తులకు వరం..!

Highlights

Low Glycemic Fruits: డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు ప్రధానంగా తమ డైట్‌లో కొన్ని మార్పులు చేసుకోవాలి. తద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు హఠాత్తుగా పెరగకుండా ఉంటాయి. అంతేకాదు వారు తీసుకునే పండ్లు కూడా గ్లైసెమిక్‌ సూచీ (GI) తక్కువగా ఉండే పండ్లు మాత్రమే తీసుకోవాలి.

Low Glycemic Fruits: గ్లైసెమిక్‌ సూచీ తక్కువగా ఉండే పండ్లు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలో హఠాత్తుగా పెరగకుండా ఉంటాయి. ప్రధానంగా అలాంటి ఐదు పండ్లు ఉన్నాయి. అవి డయాబెటిస్ రోగులకు ఎంతో మేలు చేస్తాయి. వారి శరీరా ఆరోగ్యానికి మంచిది.. అంతే కాదు చక్కెర స్థాయిలో పెరగకుండా నియంత్రణలో ఉంచుతాయి.

యాపిల్స్..

యాపిల్స్ ఆరోగ్యకరం ప్రతిరోజు ఒక యాపిల్ తినాలని ఆరోగ్య నిపుణులు అభిప్రాయం. అయితే డయాబెటిక్ రోగులకు కూడా ఈ యాపిల్స్ వరం. ఇందులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు యాపిల్‌లో గ్లైసెమిక్‌ సూచీ తక్కువగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తినాలి.

చెర్రీ పండ్లు..

డయాబెటిస్ ఉన్నవారు డైట్లో చెర్రీ పనులు చేర్చుకోవాలి. ఇందులో గ్లైసెమిక్‌ సూచీ తక్కువగా ఉంటుంది. రక్తంలో షుగర్ లెవెల్స్ హఠాత్తుగా పెరగనివ్వకుండా ఉంటాయి. డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు ఫైబర్ పుష్కలంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. చెర్రీ పండ్లలో ఫైబర్ కూడా పుష్కలం.

ఆప్రికాట్..

ఆప్రికాట్లలో గ్లైసిమిక్ సూచీ తక్కువగా ఉంటుంది. ఇందులో పొటాషియం, ఫాస్ఫరస్ తో పాటు కొన్ని ఖనిజాలు ఉంటాయి. ఇవి డయాబెటిస్ రోగులకు ఆరోగ్యకరం. వారి డైట్‌లో చేర్చుకోవచ్చు.

పియర్ ఫ్రూట్..

పీయర్‌ పండులో కూడా ఫైబర్, విటమిన్ సి, విటమిన్ కే పుష్కలంగా ఉంటాయి. ఇందులో గ్లైసమిక్ సూచీ కూడా తక్కువ మోతాదులో ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలను హఠాత్తుగా పెరగనివ్వవు. డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు వారి డైట్‌లో పీయర్‌ పండ్లను చేర్చుకోవాలి

పీచ్ పండు..

పీచ్ పండు కూడా రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు వీటిని తినవచ్చు. ఇందులో అధిక మోతాదులో ఫైబర్ ఉంటుంది. రక్తంలో షుగర్ హఠాత్తుగా పెరగనివ్వదు. అయితే డయాబెటిస్ తో బాధపడేవారు ఏ పండ్లు అయినా ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు. కొద్దిగా ఎక్కువసార్లు తీసుకోవచ్చు. అంతేకాదు ఎప్పటికప్పుడు రక్తంలో చక్కర స్థాయిలను టెస్ట్ చేసుకుంటూ ఉండాలి.. ఎక్కువ షుగర్‌తో బాధపడేవారు తక్కువ మోతాదులో తీపి వస్తువులు తీసుకోవాలి. మొత్తానికి డైట్ లో చక్కెర లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వైద్యుల సలహా మేరకు వారి డైట్లో పండ్లు కూరగాయలు చేర్చుకోవాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories