Vitamin D: తల్లిదండ్రులకి అలర్ట్‌.. పిల్లలు వ్యాధులకి దూరంగా ఉండాలంటే ఇది తప్పనిసరి..!

To Keep Children Away From Diseases Feed Them Rich in Vitamin D
x

Vitamin D: తల్లిదండ్రులకి అలర్ట్‌.. పిల్లలు వ్యాధులకి దూరంగా ఉండాలంటే ఇది తప్పనిసరి..!

Highlights

Vitamin D: బిడ్డ పుట్టిన తర్వాత అతడికి విటమిన్‌ డి అవసరం. పిల్లల శారీరక అభివృద్ధికి విటమిన్ డి చాలా ముఖ్యం.

Vitamin D: బిడ్డ పుట్టిన తర్వాత అతడికి విటమిన్‌ డి అవసరం. పిల్లల శారీరక అభివృద్ధికి విటమిన్ డి చాలా ముఖ్యం. శరీరంలో విటమిన్ డి లేకపోవడం వల్ల పిల్లల రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. దీని కారణంగా పిల్లవాడు మళ్లీ మళ్లీ అనారోగ్యానికి గురవుతాడు. పిల్లల ఎముకల అభివృద్ధికి విటమిన్ డి చాలా ముఖ్యం. ఇది పిల్లల దంతాలకు సంబంధించిన సమస్యలకు దారితీస్తుంది. ఈ పరిస్థితిలో మీరు పిల్లలకు విటమిన్ డి అధికంగా ఉండే ఆహారం ఇవ్వాలి. అలాంటి సమయంలో ఇలాంటి డైట్‌ మెయింటెన్‌ చెయ్యాలి.

1 గుడ్డుతో కూడిన ఆహారాలు : పిల్లలకు గుడ్లు తినిపించండి. గుడ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. గుడ్డులోని పసుపు భాగంలో విటమిన్ డి ఉంటుంది. బిడ్డకు ప్రతిరోజూ కనీసం ఒక గుడ్డు తినిపించండి.

2 ఆవు పాలు: పాలు పిల్లలకు సంపూర్ణ ఆహారం. ఈ పరిస్థితిలో బిడ్డకు పాలు ఇవ్వండి. ఆవు పాలు ఇవ్వడానికి ప్రయత్నించండి. ఇందులో విటమిన్ డి అధిక మొత్తంలో ఉంటుంది. పాలలో కాల్షియం, విటమిన్ డి ఉంటాయి.

3 పెరుగు : పిల్లలకు ఆహారంలో పెరుగు ఇవ్వండి. పెరుగు తినడం వల్ల శరీరానికి విటమిన్ డి అందుతుంది. పెరుగు పొట్టకు మేలు చేస్తుంది. ఎండాకాలంలో పెరుగు తప్పనిసరిగా తినాలి.

4 పుట్టగొడుగులు : పిల్లలకు తప్పనిసరిగా పుట్టగొడుగులను తినిపించాలి. విటమిన్ సి, విటమిన్ బి1, బి2, బి5, మెగ్నీషియం పుట్టగొడుగులలో ఉంటాయి. ఇందులో విటమిన్ డి అధిక మొత్తంలో ఉంటుంది.

5 నారింజ : విటమిన్ డి కోసం పిల్లలకు నారింజను తినిపించవచ్చు. ఇందులో విటమిన్ డి, కాల్షియం, విటమిన్ సి లభిస్తాయి. నారింజలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories