Health Tips: ఈ టీలు రక్తాన్ని శుభ్రపరుస్తాయి.. రోజు తాగితే చాలా మేలు..!

Health Tips: ఈ టీలు రక్తాన్ని శుభ్రపరుస్తాయి.. రోజు తాగితే చాలా మేలు..!
Health Tips: కరోనా వల్ల చాలామంది ప్రజలు మారిపోయారు. ఆరోగ్యంపై బాగా దృష్టిపెడుతున్నారు.
Health Tips: కరోనా వల్ల చాలామంది ప్రజలు మారిపోయారు. ఆరోగ్యంపై బాగా దృష్టిపెడుతున్నారు. వ్యాధులు రాకుండా ఉండాలంటే ముందుగా మనం తినే ఆహారం బాగుండాలి. చక్కటి పదార్థాలని డైట్‌లో చేర్చుకోవాలి. ఇందులో హెర్బల్ టీలు కూడా భాగమే. కరోనా కాలంలో చాలామంది హెర్బల్ టీలు తాగి రోగనిరోధక శక్తి పెంచుకున్నారు. ఈ టీలు తాగడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అన్ని అవయవాలకు ఆక్సిజన్ అందుతుంది. ఇవి రక్తాన్ని శుభ్రపరుస్తాయి. అలాంటి కొన్నింటి గురించి తెలుసుకుందాం.
కొత్తిమీర, పుదీనా టీ
మీరు కొత్తిమీర, పుదీనా ఆకులతో చేసిన టీని తయారు చేసి తాగవచ్చు. ఒక పాత్రలో 1 గ్లాసు నీళ్లు తీసుకుని అందులో కొన్ని పుదీనా ఆకులు, కొత్తిమీర ఆకులు వేయాలి. 10 నిమిషాలు మరగబెట్టి టీ లాగా గోరువెచ్చగా తాగాలి.
తులసి టీ
రోజూ 8 నుంచి 10 తులసిఆకులు తింటే రక్తం శుద్ది అవుతుంది. మీరు ఉదయం, సాయంత్రం టీలో తులసి ఆకులను ఉపయోగించవచ్చు. తులసి టీ చేయడానికి ఒక గ్లాసు నీటిలో 10-15 తులసి ఆకులను వేసి 10 నిమిషాలు మరిగించాలి. ఇప్పుడు ఈ నీటిని ఫిల్టర్ చేసి టీ లాగా తాగితే సరిపోతుంది.
లెమన్ టీ
నిమ్మకాయలో ఉండే అసిడిక్ గుణాలు రక్తంలోని మలినాలని తొలగిస్తాయి. రోజూ ఒక గ్లాస్ లెమన్ వాటర్ తాగడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో నిద్ర లేచిన తర్వాత ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో సగం నిమ్మకాయ పిండుకొని తాగాలి.
అల్లం, బెల్లం టీ
బెల్లం శరీరంలో ఉన్న టాక్సిన్స్‌ని బయటకు పంపుతుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. బెల్లం, అల్లం టీ కోసం 1 పెద్ద కప్పు నీటిలో కొద్దిగా అల్లం ముక్క, తర్వాత చిన్న బెల్లం ముక్క కలిపి 5-6 నిమిషాలు స్టవ్‌పై మరిగించి తర్వాత వడగట్టి తాగాలి.
ప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMTబిహార్‌లో రోజంతా నాటకీయ పరిణామాలు
10 Aug 2022 2:19 AM GMT
PM Kisan: రైతులకి అలర్ట్.. మరో 20 రోజుల్లో 12వ విడత డబ్బులు..!
12 Aug 2022 11:30 AM GMTHealth Tips: తొందరగా అలసిపోతున్నారా.. ఈ జ్యూస్లని డైట్‌లో...
12 Aug 2022 10:30 AM GMTKomatireddy Venkat Reddy: అద్దంకి దయాకర్‌ను ఎందుకు సస్పెండ్...
12 Aug 2022 9:55 AM GMTCM Jagan: అన్ని స్కూళ్లకు ఇంటర్నెట్.. స్కూళ్ల నిర్వహణ కోసం ప్రత్యేక...
12 Aug 2022 9:43 AM GMTMacherla Niyojakavargam: మాచర్ల నియోజకవర్గం మూవీ రివ్యూ..
12 Aug 2022 9:29 AM GMT