Oral Health: ఈ 3 వ్యాధులు దంతాలకు డేంజర్‌.. విస్మరిస్తే భారీ మూల్యం చెల్లించాల్సిందే..!

These three Diseases occur in the Teeth and if Ignored one has to pay a Heavy Price
x

Oral Health: ఈ 3 వ్యాధులు దంతాలకు డేంజర్‌.. విస్మరిస్తే భారీ మూల్యం చెల్లించాల్సిందే..!

Highlights

Oral Health: నోటి ఆరోగ్యం బాగున్నప్పుడే మనిషి ఏదైనా తినగలుగుతాడు తాగగలుగుతాడు. అందుకే దంతాలు, చిగుళ్లు, నాలుక ఎల్లప్పుడు క్లీన్‌గా ఉండేవిధంగా చూసుకోవాలి.

Oral Health: నోటి ఆరోగ్యం బాగున్నప్పుడే మనిషి ఏదైనా తినగలుగుతాడు తాగగలుగుతాడు. అందుకే దంతాలు, చిగుళ్లు, నాలుక ఎల్లప్పుడు క్లీన్‌గా ఉండేవిధంగా చూసుకోవాలి. ఇందుకోసం ప్రతిరోజు బ్రష్ చేయడం, నాలుకను శుభ్రపరుచుకోవడం చేయాలి. కానీ చాలామంది దంతాలను శుభ్రం చేయరు. దీని కారణంగా కుహరం, దంతాలు విరగడం, చిగుళ్ల ఇన్ఫెక్షన్, రక్తస్రావం వంటి సమస్యలు ఎదురవుతాయి. వీటిని విస్మరించడం వల్ల నోటి ఆరోగ్యం క్షీణిస్తుంది. దీంతో ఇది క్యాన్సర్‌కు కారణమవుతుంది. ఈ రోజు పంటి నొప్పి, చిగుళ్ల సమస్యలకు కారణం ఏంటో తెలుసుకుందాం.

చిగుళ్ల వాపు

కొన్నిసార్లు అనుకోకుండా చిగుళ్లు ఉబ్బుతాయి. కొన్ని చిట్కాల ద్వారా దీనిని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ ఇలా చేయకూడదు. డాక్టర్ ప్రకారం దంతాల మధ్య ఫలకం చేరడం వల్ల ఇది సంభవిస్తుంది. దీంతో రక్తస్రావం మొదలవుతుంది. దీని కారణంగా పీరియాంటైటిస్ వ్యాధి వస్తుంది. ఎవరికైనా చిగుళ్లు వాపు ఉంటే దానిని తేలికగా తీసుకోకూడదు. దంతవైద్యుడిని సంప్రదించాలి. వారు స్కేలింగ్ చేసి మొత్తం క్లీన్ చేస్తారు.

సెన్సిటివిటి

చల్లని లేదా వేడి ఆహారాన్ని తిన్నప్పుడు దంతాలు జువ్వుమని లాగుతాయి. దీనివల్ల తాగడం, తినడంలో ఇబ్బంది కలుగుతుంది. దంతాలపై ఉండే ఎనామిల్ క్షీణించినప్పుడు ఇలాంటి సమస్య వస్తుంది. చిగుళ్లు, దంతాలు అరిగిపోవడం వల్ల కూడా ఇలా జరుగుతుంది. దీనిని నివారించడానికి సీలాంట్లు, పూరకాలను ఉపయోగిస్తారు. డాక్టర్ ప్రకారం, సున్నితత్వం సమస్య వచ్చి పోతుంది కానీ చికిత్స చేయకపోతే అది శాశ్వతంగా ఉంటుంది.

పంటి నొప్పి

డాక్టర్ ప్రకారం పంటి నొప్పి చాలా సాధారణం. ప్రమాదంలో గాయం కారణంగా దంతాలు దెబ్బతిన్నప్పుడు నొప్పి వస్తుంది. ఇది చాలారోజులు కొనసాగితే డాక్టర్ నుంచి చికిత్స తీసుకోవాలి. ఈ విషయంలో అజాగ్రత్తగా ఉండటం వల్ల దంతాలు ఊడిపోయే ప్రమాదం పొంచి ఉంది.

దంతాలను ఆరోగ్యం

డాక్టర్ ప్రకారం ఈ మూడు పద్దతుల ద్వారా దంత సమస్యలను నివారించవచ్చు. ఇందుకోసం రోజుకు రెండుసార్లు బ్రష్ చేయడం ముఖ్యం. రాత్రి భోజనం తర్వాత బ్రష్ చేయడానికి ప్రయత్నించండి. లేదంటే మౌత్ వాష్ ఉపయోగించండి. క్రమం తప్పకుండా ఫ్లాసింగ్ చేయించుకోండి. ప్రతి రోజు సమతుల్య ఆహారం తీసుకోండి. మీ దంతాలను క్రమం తప్పకుండా తనిఖీ చేయండి. ధూమపానం చేయవద్దు ఇది చిగుళ్ల వ్యాధిని పెంచుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories