Milk: పాలతో కలిపి ఈ పదార్థాలను అస్సలు తినకూడదు.. ఎందుకంటే..?

These Ingredients Should Not be Eaten With Milk at All | Health Care Tips
x

Milk: పాలతో కలిపి ఈ పదార్థాలను అస్సలు తినకూడదు.. ఎందుకంటే..?

Highlights

Milk: ప్రతిరోజు గ్లాసు పాలు తాగితే డాక్టర్‌ దగ్గరికి వెళ్లే అవసరం ఉండదు. ఎందుకంటే పాలలో చాలా పోషకాలు ఉంటాయి...

Milk: ప్రతిరోజు గ్లాసు పాలు తాగితే డాక్టర్‌ దగ్గరికి వెళ్లే అవసరం ఉండదు. ఎందుకంటే పాలలో చాలా పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి అన్నివిధాలా సహాయం చేస్తాయి. ఇందులో కాల్షియం, ఇతర పోషకాలు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఇవి ఎముకల వ్యాధులను రాకుండా కాపాడుతాయి. పిల్లలే కాదు, వృద్ధులు కూడా ప్రతిరోజు పాలు తాగాలి. పాలు తాగే పిల్లలు ఆరోగ్యంగా, చురుగ్గా ఉంటారు. అయితే పాలతో కలిపి కొన్ని పదార్థాలను తీసుకోకూడదు. ఎందుకంటే అవి విషంగా మారుతాయి. అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఆ పదార్థాల ఏంటో తెలుసుకుందాం.

1. పండ్లు

పుల్లని స్వభావాన్ని కలిగి ఉండే పండ్లను పాలతో కలిపి తినకూడదు. పుల్లని కారణంగా పాలు విషపూరితం అయ్యే అవకాశం ఉంటుంది. అరటిపండుతో పాటు పాలు తాగకూడదు. ఈ రెండు కలిపి తీసుకోవడం వల్ల కఫం సమస్య ఏర్పడుతుంది జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం చూపుతుంది.

2. ముల్లంగి

అల్పాహారంలో ముల్లంగి కూరగాయలతో పరాటాలు తిన్న వెంటనే పాలు తాగడం కొందమందికి ఇష్టం ఉంటుంది. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇలా చేయకూడదు. ఎందుకంటే పాలు విషపూరితం అవుతాయి. దీని వల్ల చర్మ వ్యాధులు ఏర్పడుతాయి. ముల్లంగి తిన్న 2 గంటల తర్వాత పాలు తాగాలని సూచించారు.

3. ఉప్పు పదార్థాలు

పాలు, పులుపు స్వభావం గురించి అందరికి తెలుసు. చాలా మంది ఉప్పు కలిపిన అల్పాహారం తర్వాత పాలు తాగుతారు. కొంతమంది రాత్రి భోజనం చేసిన వెంటనే పాలు తాగుతారు. ఇది మంచి పద్దతి కాదు. ఆయుర్వేదం ప్రకారం పాలు విషపూరితం కావచ్చు చర్మ సమస్యలకు కూడా కారణం కావచ్చు.

4. ఆమ్ల పదార్థాలు

ఉప్పు లేదా ఆమ్ల పదార్థాలు కలుపుకొని, పాలు అస్సలు తాగకూడదు. ఈ రోజుల్లో ప్రజలు మొలకెత్తిన పప్పులు తిన్న తర్వాత పాలు తాగడం చేస్తున్నారు. ఇది తప్పు నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది హానికరం. ఇలా చేయడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories