Health Tips: ఈ అలవాట్ల వల్ల డయాబెటిక్ పేషెంట్లుగా మారుతారు.. జాగ్రత్త..!

These Habits Are Making You Diabetes Patient Quit Today
x

Health Tips: ఈ అలవాట్ల వల్ల డయాబెటిక్ పేషెంట్లుగా మారుతారు.. జాగ్రత్త..!

Highlights

Health Tips: భారతదేశంలో మధుమేహం వేగంగా విస్తరిస్తోంది. దీనికి ప్రధాన కారణం మారుతున్న జీవనశైలి.

Health Tips: భారతదేశంలో మధుమేహం వేగంగా విస్తరిస్తోంది. దీనికి ప్రధాన కారణం మారుతున్న జీవనశైలి. డయాబెటిస్ ఇప్పుడు పిల్లల నుంచి పెద్దల వరకు అన్ని వయసుల వారిని బాధితులుగా చేస్తోంది. మధుమేహంలో ప్రధానంగా రెండు రకాలు ఉంటాయి. టైప్ 1 డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్. టైప్ 1 డయాబెటిస్ అనేది ఒక రకమైన జన్యుపరమైన రుగ్మత. ఇది ఒక తరం నుంచి మరొక తరానికి బదిలీ అవుతుంది. అయితే టైప్ 2 డయాబెటిస్ జీవనశైలి, చెడు అలవాట్ల కారణంగా వస్తుంది. టైప్ 1ని నియంత్రించలేరు కానీ టైప్ 2 మధుమేహాన్ని నియంత్రించవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం.

అల్పాహారం మానేయడం

ఉదయమే టిఫిన్‌ చేయాలి. ఇది మిమ్మల్ని రిఫ్రెష్‌గా ఉంచుతుంది. నిజానికి మీరు అల్పాహారం తీసుకోకపోతే మధుమేహం బారిన పడుతారు. ఎందుకంటే చాలా గంటలు ఆకలితో ఉండటం వల్ల మధుమేహం చుట్టుముడుతుంది.

చాలా సేపు ఒకే చోట కూర్చోవడం

ఆఫీసులో ఒకే చోట పనిచేసేవారు గంటల తరబడి కంప్యూటర్లు, ల్యాప్ టాప్ ముందు గడుపుతారు. వారు సులభంగా మధుమేహం బారిన పడుతారు. ఒక వ్యక్తి 1 గంటకు పైగా ఒకే చోట కూర్చుంటే వారిలో టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు పెరుగుతాయని పరిశోధనలో తేలింది.

ఆలస్యంగా నిద్ర

రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోవడం మధుమేహానికి కారణమవుతుంది. ఈ అలవాటు చాలా హానికరం. రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోవడం వల్ల టైప్ 2 మధుమేహం వచ్చే అవకాశాలు పెరుగుతాయని చాలా పరిశోధనల్లో బయటపడింది.

మద్యపానం,ధూమపానం

మీరు డ్రగ్ అడిక్ట్ అయితే ఈ రోజే అలవాటు మానేయండి. సాధారణ రోగుల కంటే ధూమపానం, మద్యపానం చేసేవారిలో మధుమేహం వచ్చే అవకాశం 30 నుంచి 40 శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది గుండె జబ్బులు, అధిక కొలెస్ట్రాల్ వంటి సమస్యలకు కారణం అవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories