Uric Acid: యూరిక్ యాసిడ్ నుంచి విముక్తికి ఈ పండ్లు బెస్ట్..!

These Fruits Remove the Accumulated Uric Acid From the Body
x

Uric Acid: యూరిక్ యాసిడ్ నుంచి విముక్తికి ఈ పండ్లు బెస్ట్..!

Highlights

Uric Acid: ఈ రోజుల్లో యూరిక్ యాసిడ్ సమస్య సర్వసాధారణంగా మారింది.

Uric Acid: ఈ రోజుల్లో యూరిక్ యాసిడ్ సమస్య సర్వసాధారణంగా మారింది. సాధారణంగా ఇది మధ్య వయస్కుల నుంచి వృద్ధుల వరకు అందరికి వస్తుంది. ముఖ్యంగా చలికాలంలో ఈ సమస్య మరింత అధికమవుతుంది. దీని కారణంగా రోగులు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దీని కోసం మీరు అనేక రకాల మందులు తీసుకోవాలి. అయితే రోజువారీ ఆహారంలో కొంచెం మార్పు చేస్తే దీనిని తొలగించవచ్చు. యూరిక్ యాసిడ్ వ్యాధిగ్రస్తులు తినాల్సిన పండ్ల గురించి తెలుసుకుందాం.

1. ఆరెంజ్

ఆరెంజ్ విటమిన్ సి గొప్ప మూలం. ఇందులో విటమిన్ ఈ, ఫోలేట్, పొటాషియం కూడా లభిస్తుంది. ఇవి శరీరంలో ఉండే టాక్సిన్స్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది యూరిక్ యాసిడ్ పెరిగే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

2. యాపిల్

యూరిక్ యాసిడ్ పెరిగితే యాపిల్ తీసుకోవడం పెంచాలి ఎందుకంటే ఇందులో చాలా ఫైబర్ ఉంటుంది. ఇది రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గిస్తుంది. ఆపిల్ ఎల్లప్పుడూ ఆరోగ్యకరమైన ఆహారం. కాబట్టి ఖచ్చితంగా తీసుకోవాలి.

3. కివి

కివి చాలా పోషకమైన పండు. ఇది యూరిక్ యాసిడ్ రోగులకు చాలా ప్రయోజనకరంగా చెబుతారు. విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే రక్తంలో ప్లేట్‌లెట్ల స్థాయిని కవర్‌ చేస్తుంది. విటమిన్ సి, విటమిన్ ఈ, ఫోలేట్ వంటివి ఇందులో ఎక్కువగా ఉంటాయి.

4. అరటిపండు

అరటిపండు చాలా సాధారణమైన ఆహారం. ఈ పండు యూరిక్ యాసిడ్‌ను పెంచే సమస్య ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. వాస్తవానికి ఈ పండులో తక్కువ ప్యూరిన్ ఉంటుంది. ఇది యూరిక్ యాసిడ్‌ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories