Cancer: ఈ ఆహారాలు క్యాన్సర్‌ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.. డైట్‌లో చేర్చుకోండి..!

These Foods Reduce the Risk of Cancer Include in the Diet
x

Cancer: ఈ ఆహారాలు క్యాన్సర్‌ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.. డైట్‌లో చేర్చుకోండి..!

Highlights

Cancer: శరీరంలోని ఏదైనా కణం అసాధారణంగా పెరుగుతూ ఉంటే అది క్యాన్సర్‌కి దారి తీస్తుంది.

Cancer: శరీరంలోని ఏదైనా కణం అసాధారణంగా పెరుగుతూ ఉంటే అది క్యాన్సర్‌కి దారి తీస్తుంది. మన శరీరంలో కణాల తయారీ, చనిపోయే ప్రక్రియ నిరంతరం జరుగుతుంది. కానీ ఒక కణం ఏర్పడే సమయంలో శరీరం దాని పెరుగుదలను నియంత్రించలేకపోతే అది క్యాన్సర్ రూపాన్ని సంతరించుకుంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)రాబోయే 15 నుంచి 20 సంవత్సరాలలో క్యాన్సర్‌ రోగులు 70 శాతం పెరగవచ్చని ప్రకటించారు.

క్యాన్సర్ 100 కంటే ఎక్కువ రకాలుగా ఉంటుంది. ఇది చాలా విస్తృతమైన అంశం, దీనిపై పరిశోధన నిరంతరం జరుగుతోంది. క్యాన్సర్ రోగులు నిరంతరం పెరుగుతున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఈ వ్యాధి విపరీతంగా వ్యాపిస్తోంది. క్యాన్సర్ నివారణ అనేది ఏ ఒక్కదాని నియంత్రణలో ఉండదు. ఎందుకంటే క్యాన్సర్‌కు కారణం గాలి, నీరు, నేల, కూరగాయలు, పాలు, పండ్లు మొదలుగునవి కారణం అవుతున్నాయి.

ప్రస్తుతం అన్నింటిలోనూ రసాయనాలు వాడుతున్నారు. అధిక దిగుబడి కోసం రసాయనాలని పురుగుమందుల రూపంలో పంటలపై పిచికారీ చేయడం వల్ల అది క్యాన్సర్‌కి కారణం అవుతుంది. ఈ రసాయనాలు భూమిలోకి కూడా వెళుతున్నాయి. వర్షాకాలంలో ఈ రసాయనాలు నీటిలో ప్రవహించి నదుల్లో కలిసిపోవడం వల్ల కాలుష్యం వ్యాపిస్తోంది. నీరు కలుషితమై నదిలో నివసించే జీవరాశులు చనిపోతున్నాయి. మట్టిలో పెరిగే గడ్డిలో కూడా ఈ రసాయనాలు ఉంటున్నాయి. వీటిని తినడం ద్వారా పాలు పితికే జంతువుల పాలలో కూడా రసాయనాల ప్రభావం ఉంటుంది. సేంద్రీయ వ్యవసాయం ద్వారానే క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులను నివారించవచ్చు.

క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఏం తినాలి?

1. పసుపులో యాంటీ క్యాన్సర్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. క్యాన్సర్ కారక కణాల పెరుగుదలను ఇది నిరోధిస్తుంది. ప్రతిరోజూ ఆహారం తీసుకున్న 2 గంటల తర్వాత పాలలో కొంచెం పసుపు కలుపుకొని తాగండి.

2. కుంకుమపువ్వు తీసుకోవడం వల్ల క్యాన్సర్ వ్యాధి పెరగకుండా నిరోధిస్తుంది. ఎవరికైనా క్యాన్సర్ ఉంటే అతను పాలు, ఖీర్, పాయసం వంటి ఆహార పదార్థాలతో పాటు కుంకుమపువ్వును తీసుకోవాలి.

3. పాలతో పాటు అంజీర పండ్లను తినడం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా ఉంటాయి. మీరు ప్రతి రోజు రాత్రి నిద్రించే ముందు ఒక అంజీర్ పండును తీసుకోవాలి. పాలలో వేసి ఉడికించి నమిలి తిని పాలు తాగాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories