Increase Eyesight: దృష్టిలోపం ఉండొద్దంటే ఈ ఫుడ్స్‌ బెస్ట్‌.. అద్దాలు పక్కన పడేస్తారు..!

These foods increase Eyesight Health is also Good
x

Increase Eyesight: దృష్టిలోపం ఉండొద్దంటే ఈ ఫుడ్స్‌ బెస్ట్‌.. అద్దాలు పక్కన పడేస్తారు..!

Highlights

Increase Eyesight: మానవ శరీరంలో కళ్లు ప్రధాన అవయవాలు. వీటివల్లే మనం లోకాన్ని చూడగలుగుతున్నాం.

Increase Eyesight: మానవ శరీరంలో కళ్లు ప్రధాన అవయవాలు. వీటివల్లే మనం లోకాన్ని చూడగలుగుతున్నాం. ఒక్కసారి కళ్లు లేవని ఊహించుకుంటే ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాలో తెలుస్తుంది. ఇలాంటి సున్నితమైన కళ్లని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే అంత మంచిది. కొన్ని రకాల ఆహారాలని తీసుకోవడం వల్ల దృష్టి లోపం ఉండదు. అద్దాలు పెట్టుకునేవారు కూడా వాటిని తీసి పక్కనపడేస్తారు. అటువంటి కొన్ని ఆహారాల గురించి ఈరోజు తెలుసుకుందాం.

చేపలు

చేపలు తినడం వల్ల కంటి చూపు మెరుగవుతుంది. ఎందుకంటే వీటిలో ఉండే పోషకాలు కంటిచూపుని పెంచడానికి పనిచేస్తాయి. కంటి చూపు బలహీనంగా ఉన్నవారు చేపలను కచ్చితంగా డైట్‌లో చేర్చుకోవాలి.

వాల్ నట్స్

వాల్ నట్స్ లో ఒమేగా-3, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. ఇవి కళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతాయి. అందుకే ప్రతిరోజూ ఉదయాన్నే వాల్ నట్స్‌ని తినడం అలవాటు చేసుకోవాలి. వీటిని తినడం వల్ల కళ్లకే కాకుండా కీళ్ల నొప్పులకు కూడా ఉపశమనం లభిస్తుంది.

ఆమ్ల ఫలాలు

సిట్రస్ జాతి పండ్లు కళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఎందుకంటే వీటిలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఇది ఒక రకమైన పవర్ యాంటీఆక్సిడెంట్ కళ్ళను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. కంటి చూపు బలహీనంగా ఉంటే నారింజ, సీజనల్, పండ్లు, ఇతర సిట్రస్ జాతి పండ్లను ఆహారంలో చేర్చుకోవాలి.

ఆకు కూరలు

ఆకు కూరలు తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. ఎందుకంటే వీటిలో లుటిన్, జియాక్సంతిన్ ఉంటాయి. ఇవి కంటిచూపుని పెంచడంలో సహాయపడుతాయి. అందుకే ఆకుకూరలను డైట్‌లో కచ్చితంగా చేర్చుకోవాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories