Health Tips: కోవిడ్-19 పాజిటివ్ వ్యక్తులు త్వరగా కోలుకోవాలంటే.. వీటికి దూరంగా ఉండండి..!

These Foods are Avoid When You Are in Tested Covid Positive Quarantine Period | Corona Live Updates
x

Health Tips: కోవిడ్-19 పాజిటివ్ వ్యక్తులు త్వరగా కోలుకోవాలంటే.. వీటికి దూరంగా ఉండండి..!

Highlights

Health Tips: పెరుగుతున్న కరోనా కేసులు అందరినీ ఇబ్బంది పెడుతున్నాయి. అటువంటి పరిస్థితిలో, ఆహారంపై శ్రద్ధ వహించాలి...

Health Tips: పెరుగుతున్న కరోనా కేసులు ప్రతి ఒక్కరినీ ఇబ్బంది పెడుతున్నాయి. అటువంటి పరిస్థితిలో, మంచి రోగనిరోధక శక్తిని కాపాడుకోవడంతో పాటు, ఆహారంపై కూడా శ్రద్ధ వహించాలని వైద్యులు సలహా ఇస్తారు. వ్యాధి సోకిన రోగి త్వరగా కోలుకోవడానికి రోజువారీ ఆహారంలో విటమిన్ డి, సి తప్పనిసరిగా చేర్చాలని తెలిపారు. మీరు కూడా కరోనాతో పోరాడుతున్నట్లయితే, త్వరగా కోలుకోవడానికి మీ ఆహారంలో వీటిని చేర్చుకోకుండా ఉంటే మంచింది. లేదంటే తీవ్ర ప్రభావాలు చూపిస్తాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

వేయించినవి తినవద్దు.. కోవిడ్ పాజిటివ్ రోగులు నోరు రుచి తెలియకపోవడంతో వేయించిన వాటిని తీసుకోవడానికి ట్రై చేయకండి. వేయించిన వాటిలో అధిక కొవ్వు పదార్థాలు ఉంటాయి. అలాగే స్మూతీస్ కూడా కోవిడ్ రోగి శరీరంలోని వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని బలహీనపరచడం ద్వారా చెడు కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. దీంతో గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా సృష్టించే అవకాశం ఉంది.

మద్యానికి దూరంగా ఉండండి: కరోనా సోకిన వ్యక్తులు త్వరగా కోలుకోవాలంటే మాత్రం మద్యానికి దూరంగా ఉండాలి. అలా చేయడం వల్ల కరోనా రికవరీ సమయంలో తీసుకున్న కొన్ని మందుల ప్రభావం తగ్గుతుంది.

ప్రాసెస్ చేసిన ఆహారం హాని చేస్తుంది: కరోనా పాజిటివ్ రోగులు తరచుగా ఆకలితో ఉంటారు. అలాంటప్పుడు ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకోవడం హానికరంగా మారుతుంది. క్యాన్డ్ ప్రాసెస్డ్ ఫుడ్‌లో అధిక మొత్తంలో సోడియం ఉండటం వల్ల కోవిడ్ రోగులు త్వరగా కోలుకోకుండా చేస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని బలహీనపరిచేలా చేస్తుంది.

చల్లని, తీపి పానీయాలు తీసుకోవద్దు: కరోనావైరస్ సోకిన వ్యక్తి వారి చికిత్స సమయంలో చల్లని శీతల పానీయాలు, తీపి పానీయాలు తీసుకోకుండా ఉండాలి. ఇటువంటి పానీయాలు కరోనా రికవరీ ప్రక్రియకు ఆటంకం కలిగిస్తాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories