Health: ఈ ఐదు కారణాల వల్ల ముఖం మొటిమల సమస్య ఏర్పడుతుంది..!

These Five Factors Can Cause Acne on the Face
x

Health: ఈ ఐదు కారణాల వల్ల ముఖం మొటిమల సమస్య ఏర్పడుతుంది..!

Highlights

Health: ఈ ఐదు కారణాల వల్ల ముఖం మొటిమల సమస్య ఏర్పడుతుంది..!

Health: చర్మం 7 పొరల కింద కొవ్వు పొర ఉంటుంది. సరైన ఆహారం తీసుకోకపోవడం, తగినంత నిద్రపోకపోవడం, వ్యాయామం చేయకపోవడం వంటి కారణాల వల్ల ఈ కొవ్వు పొరలో అసమతుల్యత ఏర్పడుతుంది. దీనివల్ల ఉదయం నిద్రలేచిన తర్వాత మీ ముఖంపై మొటిమలు, నల్లటి వలయాలు, బ్లాక్ హెడ్స్ లేదా వైట్ హెడ్స్ కనిపించడం ప్రారంభిస్తాయి. వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ లేదా మొటిమలకు ఇన్ఫెక్షన్ కారణమని చాలా మంది భావించినప్పటికీ అసలు నిజం అది కాదు. సరైన జీవనశైలి పాటించకపోవడం ఒక పెద్ద కారణం.

1. మంచి ఆలోచనలు

టీనేజర్లలో మొటిమల సమస్య ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ వయస్సులో శరీరంలో పునరుత్పత్తి అవయవాల పెరుగుదల వేగంగా జరుగుతుంది. కాబట్టి తప్పుడు స్పర్శ కారణంగా శరీరం చాలా ఉద్రేకానికి గురవుతుంది. దీనివల్ల హార్మోన్స్‌ ఇన్ బాలెన్స్‌ అవుతాయి. ముఖంపై మొటిమలు ఏర్పడుతాయి. ఇలాంటి పరిస్థితిలో, ధ్యానం చేయడం, యోగా చేయడం, మంచి పుస్తకాలు చదవడం మంచిది.

2. ఆలస్యంగా నిద్రపోవడం, ఆలస్యంగా మేల్కొనడం

రాత్రి ఆలస్యంగా పడుకోవడం ఆలస్యంగా మేల్కోవడం వల్ల శరీరంలోని హార్మోన్లు ఇన్ బాలెన్స్‌ అవుతాయి. దీంతో మొటిమలకు ఏర్పడుతాయి. కాబట్టి సరైన దినచర్యను అనుసరించడం మంచిది.

3. సరైన మోతాదులో నీరు తాగడం

శరీర అవసరాన్ని బట్టి ప్రతిరోజూ 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగడం వల్ల చర్మం శుభ్రంగా, మచ్చలు లేకుండా ఉంటుంది. ఎందుకంటే ఇది శరీరంలోని అన్ని విష పదార్థాలను తొలగిస్తుంది. దీంతో పాటు నీరు శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడానికి, కణాలను పోషించడానికి పనిచేస్తుంది. మన శరీరం దాదాపు 70 శాతం నీటితో నిర్మితమై ఉందంటే నీటి ఆవశ్యకత ఏంటో స్పష్టంగా అర్థమవుతుంది.

4. పిండితో చేసిన పదార్థాలు

పిండితో చేసిన ఆహార పదార్థాలు శరీరానికి హాని కలిగిస్తాయి. మైదా పేగుల నుంచి పూర్తిగా తొలగిపోదు. అందుకే మైదాతో చేసిన వస్తువులను మినిమమ్‌గా తీసుకోవడం మంచిది. ఇంట్లో తయారుచేసిన ఆహారం ఆరోగ్యానికి ఉత్తమమైనది.

5. సరైన పానీయాలను ఎంచుకోండి

మార్కెట్‌లో లభించే చాలా సాఫ్ట్ డ్రింక్స్‌లో కృత్రిమ చక్కెర, ప్రిజర్వేటివ్‌లు ఉంటాయి. ఇవి మీ ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తాయి. ఈ పానీయాల బదులు మజ్జిగ, లస్సీ, పెరుగు, చల్లార్చిన పాలు, తాజా పండ్ల రసం మొదలైన వాటిని తీసుకోవాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories