Diabetes: మీ ఈ బ్లడ్‌ గ్రూపేనా.? అయితే మీకు డయాబెటిస్‌ వచ్చే అవకాశాలు ఎక్కువ..

Diabetes
x

Diabetes: మీ ఈ బ్లడ్‌ గ్రూపేనా.? అయితే మీకు డయాబెటిస్‌ వచ్చే అవకాశాలు ఎక్కువ..

Highlights

Diabetes: భారత్‌లో రోజురోజుకీ డయాబెటిస్‌ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. అందుకే భారత్‌ను 'డయాబెటిస్ రాజధాని'గా చెబుతున్నారు.

Diabetes: భారత్‌లో రోజురోజుకీ డయాబెటిస్‌ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. అందుకే భారత్‌ను 'డయాబెటిస్ రాజధాని'గా చెబుతున్నారు. డయాబెటిస్‌ ప్రధానంగా జీవనశైలితో సంబంధం ఉన్న వ్యాధి అని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) స్పష్టం చేసింది. అయితే, తాజా అధ్యయనాల ప్రకారం బ్లడ్ గ్రూప్ కూడా డయాబెటిస్ ముప్పును ప్రభావితం చేయగలదని వెల్లడైంది. కేవలం జీవనశైలి మాత్రమే కాదు, జన్యుపరంగా కూడా అనేక కారణాలు ఈ వ్యాధికి దారితీస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. వీటిలో బ్లడ్ గ్రూప్ కూడా ఒక ప్రధాన కారణమని తాజా అధ్యయనాలు సూచిస్తున్నాయి.

యూరోపియన్ అసోసియేషన్ ఫర్ ది స్టడీ ఆఫ్ డయాబెటిస్ నిర్వహించిన ఒక అధ్యయనం "డయాబెటాలోజియా" జర్నల్‌లో ప్రచురితమైంది. ఈ అధ్యయనంలో 80,000 మందికి పైగా మహిళలను పరిశీలించగా, కొన్ని రకాల బ్లడ్ గ్రూప్‌ల వారికి టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వెల్లడించారు. ఈ అధ్యయనం ప్రకారం, A, B, AB బ్లడ్ గ్రూప్‌ల వారికి డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే, దీని అర్థం O బ్లడ్ గ్రూప్ ఉన్నవారు పూర్తిగా డయాబెటిస్‌ రాదని చెప్పలేమన్నారు. ఆహారపు అలవాట్లు, జీవనశైలి, జన్యుపరమైన లక్షణాలు కూడా డయాబెటిస్ ప్రమాదాన్ని ప్రభావితం చేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. ముఖ్యంగా B బ్లడ్ గ్రూప్ ఉన్నవారు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

ఈ అధ్యయనం ప్రకారం, మహిళలకు డయాబెటిస్ వచ్చే అవకాశాలు 21% అధికంగా ఉంటాయని చెబుతోంది. O బ్లడ్ గ్రూప్ ఉన్నవారితో పోల్చితే A బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి 10% ఎక్కువ ముప్పు ఉంది. B పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి మరింత ఎక్కువగా డయాబెటిస్ వచ్చే అవకాశముందని పరిశోధకులు వెల్లడించారు. అయితే ఇప్పటి వరకు బ్లడ్ గ్రూప్, డయాబెటిస్ మధ్య ఉన్న స్పష్టమైన సంబంధాన్ని శాస్త్రవేత్తలు పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు. కానీ "నాన్ విల్లె బ్రాండ్ ఫ్యాక్టర్" అనే ప్రోటీన్ O బ్లడ్ గ్రూప్ తప్ప మరిన్నింటిలో ఎక్కువగా ఉంటుందని గుర్తించారు. ఇది రక్తంలో చక్కర స్థాయిల పెరుగుదల లేదా తగ్గుదలలో కీలక పాత్ర పోషించవచ్చని వారు భావిస్తున్నారు.

జీవనశైలి, ఆహారపు అలవాట్లు, వ్యాయామం వంటి అంశాలు డయాబెటిస్ నివారణలో కీలకం అయినప్పటికీ, బ్లడ్ గ్రూప్ కూడా డయాబెటిస్ ముప్పును ప్రభావితం చేసే అంశాలలో ఒకటి అని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి, అత్యధిక ప్రమాదం ఉన్న బ్లడ్ గ్రూప్ ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ఇంటర్నెట్ వేదికగా అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్‌ గమనించాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories