Life Skills: మహిళల నుంచి పురుషులు నేర్చుకోవాల్సిన విషయాలు ఇవే..!

These are the Things That men Should Learn From Women
x

Life Skills: మహిళల నుంచి పురుషులు నేర్చుకోవాల్సిన విషయాలు ఇవే..!

Highlights

Life Skills: మహిళలని ప్రకృతి అందించిన అమూల్యమైన బహుమతిగా చెబుతారు.

Life Skills: మహిళలని ప్రకృతి అందించిన అమూల్యమైన బహుమతిగా చెబుతారు. వీరు లేకుండా పురుషుల జీవితం అసంపూర్ణం. సాధారణంగా మహిళల స్వభావం భిన్నంగా ఉంటుంది. వీరు తరచుగా భావోద్వేగానికి లోనవుతారు. వాస్తవానికి పురుషులు మహిళల నుంచి అనేక జీవిత నైపుణ్యాలను నేర్చుకోవచ్చు. దీనికి సంబంధించి కొన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

1. తనను తాను నయం చేసుకునే స్వభావం

మహిళలు సహజంగానే పురుషుల కంటే ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటారు. మహిళలకి ఓర్పు బాగా ఉంటుంది. అందుకే కుటుంబ బాధ్యత వీరే చూసుకుంటారు. అలాగే పిల్లలకి జన్మనిస్తారు. వారిని జాగ్రత్తగా చూసుకుంటారు. వీటితో పాటు ఉద్యోగం కూడా చేస్తారు. మగవారితో సమానంగా సంపాదిస్తారు.

2. అప్రమత్తంగా ఉండటం

సాధారణంగా మహిళలు తమ కుటుంబ సభ్యులు, సన్నిహితుల గురించి ప్రత్యేక శ్రద్ద కనబరుస్తారు. వారిని బాగా చూసుకుంటారు. వారిని ఎలా చూసుకోవాలో మహిళలకి తెలిసినంతగా మరెవరికి తెలియదు. అదే పురుషులు వీరిని ఎక్కువగా పట్టించుకోరు.

3. ఎమోషనల్ ఇంటెలిజెన్స్

ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది మహిళల నుంచి పురుషులు నేర్చుకోగల నైపుణ్యం. సన్నిహితులు సమస్యలను చెబుతుంటే చాలా ఓర్పుగా వింటారు. వారి బాధలకి చలించి సానుభూతి చూపుతారు. వారిని ఓదార్చుతారు. అవసరమైన సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు.

4.మల్టీ టాస్కింగ్‌

మహిళలలు మల్టీటాస్కింగ్‌ పనులు చేస్తారు. ఇంటి బాధ్యతని చూసుకుంటారు. ఖర్చులు, పొదుపు మెయింటెన్‌ చేస్తారు. ఉద్యోగం చేస్తారు. పిల్లలకి పాఠాలు బోధిస్తారు. ఇలా అనేక పాత్రలు పోషిస్తారు. కానీ పురుషులు ఉద్యోగం మాత్రమే చేస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories