Health Tips: ఈ ఐదు ఫుడ్స్‌ మీ జ్ఞాపకశక్తిని తగ్గిస్తాయి..! ఏంటంటే..

These Five Foods can Lower your Memory
x

 ఈ ఐదు ఫుడ్స్‌ మీ జ్ఞాపకశక్తిని తగ్గిస్తాయి

Highlights

* ఆల్కహాల్ తాగే అలవాటు మీ మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది.

Five Foods Can Lower your Memory: జ్ఞాపకశక్తి వయస్సుకు సంబంధించినదని అందరు నమ్ముతారు. ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ జ్ఞాపకశక్తి కూడా తగ్గుతుందని అంటారు. కానీ మీ చుట్టూ ఉన్న కొంతమంది పెద్దవారిని మీరు చూసే ఉంటారు. వారి వయస్సు పెరిగినా వారి జ్ఞాపకశక్తి మాత్రం ఏమాత్రం తగ్గదు. ఎందుకంటే వారు తీసుకునే ఫుడ్, జీవన శైలివల్ల వారు అలా ఉంటారు. ఆహారం మన శారీరక ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే మతిమరుపు తెప్పించే ఐదు ఆహారాల గురించి ఈరోజు "లైఫ్ స్టైల్" తెలుసుకుందాం.

1. వేయించిన ఆహారం

ఎక్కువ వేయించిన ఆహారం రుచికరంగా అనిపిస్తుంది కానీ ఇది ఏ విధంగానూ ఆరోగ్యానికి మంచిది కాదు. ఎక్కువ వేయించిన ఆహారం మీ నరాలను దెబ్బతీస్తుంది. మెదడు సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. ఇది మీ జ్ఞాపకశక్తిని నేరుగా ప్రభావితం చేస్తుంది. కాబట్టి వీలైనంత వరకు తేలికైన, జీర్ణమయ్యే ఆహారాన్ని తినడం అలవాటు చేసుకుంటే మంచిది.

2. జంక్ ఫుడ్

జంక్ ఫుడ్‌లో రుచిని పెంచడానికి డోపమైన్ హార్మోన్ ఉత్పత్తిని ప్రభావితం చేసే కొన్ని వస్తువులను ఉపయోగిస్తారు. దీన్ని ఎక్కువగా తినడం వల్ల వ్యక్తిలో ఒత్తిడి స్థాయి పెరిగి జ్ఞాపకశక్తి బలహీనపడటం మొదలవుతుంది.

3. మద్యం

ఆల్కహాల్ తాగే అలవాటు మీ మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది. ఇది మీ శరీరంలోని అన్ని ప్రాణాంతక వ్యాధులకు కారణమవుతుంది. మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. దీన్ని తాగడం వల్ల మనిషి మానసిక సమతుల్యత దెబ్బతింటుంది. జ్ఞాపకశక్తి బలహీనపడుతుంది సాధారణ విషయాలను కూడా మరిచిపోతారు.

4. తీపి ఆహారాలు

మిఠాయిలు తినడానికి ఇష్టపడే వారు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చక్కెర ఎక్కువగా తినడం వల్ల మెదడుపై ప్రభావం చూపుతుంది. ఈ కారణంగా వ్యక్తి జ్ఞాపకశక్తి బలహీనపడటం ప్రారంభమవుతుంది.

5. ట్రాన్స్ ఫ్యాట్

అధిక మొత్తంలో ట్రాన్స్ ఫ్యాట్ మీ మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది జ్ఞాపకశక్తిపై ఒత్తిడిని కలిగిస్తుంది. అల్జీమర్స్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories