Kidneys Clean: ఈ 3 పానీయాలు కిడ్నీని క్లీన్‌ చేస్తాయి.. అవేంటంటే..?

Kidneys Clean: కిడ్నీలు రక్తాన్ని శుభ్రపరచడానికి శరీరం నుంచి టాక్సిన్స్‌ని తొలగించడానికి పనిచేస్తాయి.

Arun Chilukuri
Updated on: 29 July 2022 7:30 PM IST
These 3 Lemon Drinks are Good for Kidneys Kidneys are Clean
X

Kidneys Clean: ఈ 3 పానీయాలు కిడ్నీని క్లీన్‌ చేస్తాయి.. అవేంటంటే..?

Kidneys Clean: కిడ్నీలు రక్తాన్ని శుభ్రపరచడానికి శరీరం నుంచి టాక్సిన్స్‌ని తొలగించడానికి పనిచేస్తాయి. కానీ కొన్నిసార్లు ఈ టాక్సిన్స్ దాడికి కిడ్నీలు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ప్రతిరోజూ ఒక పానీయం తాగడం ద్వారా మీరు ఈ అవయవాన్ని శుభ్రపరుచుకోవచ్చు. మూత్రపిండాలు దెబ్బతినకుండా నిరోధించవచ్చు. అలాంటి డ్రింక్‌ గురించి తెలుసుకుందాం.

మూత్రపిండము ప్రధాన విధి శరీరంలోని చెడు ద్రవాలను మూత్రం ద్వారా బయటకి పంపండం. ఇది కాకుండా కిడ్నీ మానవ శరీరంలోని ఉప్పు, పొటాషియం, యాసిడ్ స్థాయిలని నియంత్రిస్తుంది. దీంతో పాటు మన శరీరంలోని ఇతర భాగాలు పనిచేయడానికి అవసరమైన హార్మోన్లని ఉత్పత్తి చేస్తుంది. హార్వర్డ్ నివేదిక ప్రకారం రోజూ 2 నిమ్మకాయల రసాన్ని తాగడం వల్ల యూరినరీ సిట్రేట్ పెరుగుతుంది. మూత్రపిండాల నుంచి టాక్సిన్స్‌ బయటకి వచ్చేస్తాయి. అదే సమయంలో, రోజూ 2 నుంచి 2.5 లీటర్ల వరకు మూత్ర విసర్జన చేసే వ్యక్తులు కిడ్నీలో రాళ్లకు గురయ్యే అవకాశం తక్కువ. మీరు ఈ కిడ్నీ-హెల్తీ డ్రింక్ ను ఉదయం, మధ్యాహ్నం తాగవచ్చు.

1. పుదీనాతో నిమ్మకాయ

ఒక గ్లాసు నీటిలో నిమ్మరసం, పుదీనా ఆకులు, కొంత చక్కెర వేసి బాగా కలపాలి. దీనిని తీసుకుంటే కిడ్నీలు క్లీన్‌ అవుతాయి.

2. లెమన్ సోడా

ఒక గ్లాసులో నిమ్మరసం, జీలకర్ర-కొత్తిమీర పొడి, చాట్ మసాలా, సోడా బాగా కలపాలి. ఈ పానీయం తాగడం వల్ల కిడ్నీలు క్లీన్‌ అవుతాయి.

3. కొబ్బరి షికంజీ

ఈ హెల్తీ కిడ్నీ డ్రింక్ చేయడానికి ఒక గ్లాసులో కొబ్బరి నీళ్లు పోసి అందులో నిమ్మరసం కలపి తాగాలి. ఈ డ్రింక్‌ తాగడం వల్ల కిడ్నీలు క్లీన్‌ అవుతాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story